The Biography Of Ravi Narayana Reddy Who Was The Leader In Telangana Rebellion | Communist Party Of India

Ravi narayana reddy biography leader in telangana rebellion communist party of india founding member

Ravi Narayana Reddy biography, telangana rebellion, communist party of india, Ravi Narayana Reddy life story, telangana freedom fighters, Ravi Narayana Reddy wikipedia, Ravi Narayana Reddy history, Ravi Narayana Reddy news

Ravi Narayana Reddy Biography Leader In Telangana Rebellion Communist Party Of India Founding Member : The Biography Of Ravi Narayana Reddy Who Was The Leader In Telangana Rebellion. He was a founding member of the Communist Party of India.

తెలంగాణ సాయుధ పోరాట తొలి యోధుడు

Posted: 09/08/2015 05:38 PM IST
Ravi narayana reddy biography leader in telangana rebellion communist party of india founding member

రావి నారాయణరెడ్డి.. ఓ భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ఈయన ఆంధ్రమహాసభ ప్రారంభించిన సాంస్కృతికోద్యమాన్ని క్రమానుగుణంగా వామపక్ష సాయుధ పోరాటంగా పరివర్తన చేసిన గొప్ప నాయకుడిగా ఎదిగారు. అతి చిన్న వయస్సులోనే తెలంగాణ ప్రజల గుండెల్లో చిరకాలం స్థానం సంపాదించిన అమరుడు. కాలేజీ జీవితంలోనే రాజకీయ, సాంఘిక సేవకు పూనుకుని, అనేక తెలంగాణ గ్రామాల్లో ‘వెట్టి చాకిరి’కి వ్యతిరేకంగా సంఘాలను నిర్మించారు.

జీవిత విశేషాలు :

1908 జూన్ 5వ తేదీన నల్లగొండ జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లిలో భూస్వామ్య కుటుంబంలో నారాయణరెడ్డి జన్మించారు. 20 ఏళ్ల వయస్సులోనే ప్రజాసేవలో పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ లో వుండగానే గాంధీజి జీవితాన్ని అధ్యయనం చేసిన ఆయన.. దాంతో మొదట గాంధేయవాదిగా వున్నారు. ఆంధ్రమహాసభ, ఆంధ్రజనసంఘం ఏర్పరిచిన సాంస్కృతిక చైతన్యం వల్ల ప్రభావితులైన ఈయన.. నిజాం పరిపాలన కాలంలో తెలంగాణాలో ఇంకా రాజకీయ చైతన్యంలేని స్థితిలోనే పోరాటాన్ని ప్రారంభించారు. ఈయన విద్యార్థి వున్న దశలో అప్పటి నిజాం కళాశాల విద్యార్థి బద్దం యెల్లారెడ్డితో కలసి 1930లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 1931లో హరిజన సేవాసంఘాన్ని నెలకొల్పి దాని ప్రధాన కార్యదర్శి హోదాలో హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా 100 పాఠశాలలు ప్రారంభించారు. రెండు వసతి గృహాలను నిర్వహించారు.

1930లో బ్రిటీష్ ప్రభుత్వం మహాత్మాగాంధీని అరెస్టు చేయగా.. అందుకు నిరసనగా హైదరాబాద్‌లోని హస్మద్ గంజ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. బ్రిటీష్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడారు. పాతికేళ్ళ ప్రాయంలోపుగానే దేశభక్తి, రాజకీయ పోరాటం పట్ల పట్టుదల ఏర్పరుచుకున్నారు. 1931లో దేవరకొండలో జరిగిన రెండో ఆంధ్ర మహాసభలకు తన తోటి విద్యార్థులను పోగుచేసి పాదయాత్రగా ఆంధ్రోద్యమాన్ని ప్రచారం చేశారు. మహాసభల్లో చురుకైన పాత్ర వహించారు. నిజామాంధ్ర మహాసభలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్యసమాజ్, హిందూ మహాసభలతో కలిసి పనిచేసిన కమ్యూనిస్టుగా ఆయన ఆచరణ విశిష్టమైంది. ప్రజాజీవితంలో ఉన్న నాయకులు ఒక కీలకమైన చారిత్రక సన్నివేశంలో సిద్ధాంతపరంగా విభేదించే శక్తులతో ఐక్య సంఘటన ఏర్పరచి ఏకతాటిపై ఉద్యమాన్ని ఎలా నిర్మించవచ్చో తన ఆచరణ ద్వారా రావి నిరూపించారు.

ఏడో నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ప్రజాపోరాటానికి చూపునిచ్చిన జననేతగా ప్రసిద్ధుడు. ఆంధ్ర మహాసభకు ఆధ్యక్షుడుగా పని చేశారు. తెలంగాణ విమోచన తరువాత ఆయన సిపిఐలో చాలాకాలం పని చేశాడు. రావి నారాయణరెడ్డి విశాలాంధ్ర కోసం ఎంతో శ్రమించాడు. నిజాం ప్రభుత్వం మీద ఆయన చేసిన సాయుధ పోరాటం చిరస్మరణీయం. 1946-48 కాలంలో హైదరాబాదు సంస్థానంలో నిజాం పోలీసుల దాష్టీకానికి, మతదురహంకారులైన రజాకార్ల ఆగడాలను అరికట్టడ్డడానికి అజ్ఞాతంగా ఎన్నో గెరిల్లా దళాలను ఏర్పాటు చేశారు. 1941లో నల్లగొండ జిల్లా చిలుకూరులో జరిగిన ఎనిమిదవ నిజామాంధ్ర మహాసభకు, 1944లో భువనగిరిలో జరిగిన మహాసభకు ఆయనే అధ్యక్షత వహించారు. దేశ స్వాతంత్య్రానికి ముందు సాగిన సాయుధ పోరాటాన్ని వ్యూహాత్మకంగా సమర్థించిన ఆయన..  1947 తరువాతి పోరాటాన్ని కొనసాగించాలనే ‘మెజారిటీ’ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

వితంతు వివాహాలు, అక్షరాస్యతా కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఆంధ్రమహాసభను క్రియాశీల రాజకీయ సంస్థగా మలిచారు. తమ పార్టీ సభ్యులు 20 ఎకరాల భూమిని మించి కలిగి ఉండరాదు అని కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానించింది. ఆ స్ఫూర్తిని స్వీకరించిన ఆయన.. తన దగ్గర 20 ఎకరాలను మాత్రమే ఉంచుకుని 500 ఎకరాలను రైతుకూలీలకు పంచిపెట్టారు. ప్రజాపోరాట నాయకునిగా ఎదిగి, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని, కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన ఈయన.. 1991 సెప్టెంబర్ 7న మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Narayana Reddy  Telangana Rebellion  Communist Party Of India  

Other Articles