The Biography Of Sardar Dandu Narayana Raju Who Fought For Freedom | Indian Freedom Fighters

Sardar dandu narayana raju biography indian freedom fighter activist

Sardar Dandu Narayana Raju Biography, dandu narayana raju history, dandu narayana raju life story, Sardar Dandu Narayana Raju photos, Sardar Dandu Narayana Raju wikipedia, Sardar Dandu Narayana Raju wiki in telugu, Sardar Dandu Narayana Raju updates, Sardar Dandu Narayana Raju, indian freedom fighters, indian activists

Sardar Dandu Narayana Raju Biography Indian Freedom Fighter Activist : The Biography Of Sardar Dandu Narayana Raju Who Fought For Freedom. He Died In Tanjavur Jail.

స్వాతంత్ర్యోద్యమంలో వీరమరణం పొందిన అమరుడు

Posted: 09/11/2015 06:59 PM IST
Sardar dandu narayana raju biography indian freedom fighter activist

బ్రిటీష్ అరాచక పాలన నుంచి విముక్తి కలిగించడంలో వీరమరణం పొందిన స్వాతంత్ర్య సమరయోధుల్లో దండు నారాయణ రాజు ఒకరు. ఆనాడు న్యాయవాది వృత్తిలో కొనసాగిన ఈయన.. తన ఉద్యోగాన్ని త్యజించి దేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. తన ప్రసంగంతో ఎంతోమందిని స్వాతంత్ర్యపోరాట దిశగా నడిచేలా చైతన్యం నింపారు.

జీవిత విశేషాలు :

1889 అక్టోబర్ 15వ తేదీన భీమవరం తాలూకా నేలపోగుల గ్రామంలో భగవాన్ రాజు, వెంకాయమ్మ దంపతులకు శ్రీ దండు నారాయణ రాజు జన్మించారు. ఈయన నర్సాపురం తాలూకా పోడూరులో ప్రాథమిక విద్యను, తణుకు ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. కేవలం విద్యారంగంలోనే కాకుండా.. క్రీడారంగంలోనూ తన ప్రతిభ కనబరిచారు. 1907లో మెట్రిక్యులేషన్ పరిక్షల్లో ఉత్తీర్ణులైన అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ పట్టా పొందారు. తణుకు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా కొన్నాళ్లు పనిచేశారు. ఆ సమయంలోనే ఈయన బి.ఎల్ విద్యను కొనసాగిస్తూ.. చివరికి ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత హైకోర్టు వకీలుగా, ఏలూరులో న్యాయవాదిగా పనిచేశారు. ఈయనకు 1910లో మహదేవపట్నం కాపురస్తులు శ్రీ కలిదిండి వెంకట్రామరాజుగారి కుమార్తె సుబ్బయమ్మతో వివాహం జరిగింది.

స్వాతంత్ర్యోద్యమంలో నారాయణ పాత్ర :

బ్రిటీష్ వారి అరాచకాలు నానాటికి పరిభవిల్లుతున్న రోజుల్లో స్వాతంత్ర్యోద్యమాలూ అదే స్థాయిలో జరిగాయి. ముఖ్యంగా గాంధీ చేపట్టిన ఉద్యమాలు ఎందరినో ఉత్తేజపరిచాయి. అలా.. గాంధీ విధానాలకు ఆకర్షితులైన ఆయా ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. అలాంటివారిలో ఒకరైన నారాయణ రాజు.. 1921లో తన న్యాయవాద వృత్తిని వదిలేసి మహాత్మాగాంధీ సహాయనిరాకరణ ఉద్యమంలో చేరారు. 1927 లో మద్రాసు శాసన సభకు పోటీ చేసి గెలిచారు. 1930లో మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పశ్చిమ గోదావరి జిల్లాకు నాయకుడై తన సహచరులతో ఏలూరు నుండి సముద్రతీరమున తూర్పుతాళ్ళు గ్రామం వరకూ నడచి ఉప్పుసత్యాగ్రహం చేశారు. అప్పుడే ఈయనకు ‘సర్దార్’ అనే బిరుదు వచ్చింది. ఆ సందర్భంలో ప్రభుత్వం ఆయన్ను ఒక సంవత్సరంపాటు నిర్భందంలో ఉంచింది.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఖద్దరు వ్యాప్తి కోసం నారాయణ విశేష ప్రచారం చేశారు. ఖద్దరు బోర్డుకు 1923 నుండి 1926 వరకూ అధ్యక్షులుగా వ్యవహరించారు. హరిజన, రైతు ఉద్యమాల్లో పాల్గొని వారి అభ్యుదయానికై పాటుపడ్డారు. సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అయితే.. ఆ నేపథ్యంలో ఈయన్ను ఆనాటి ప్రభుత్వం పలుమార్లు జైలుకు పంపింది. ఓ సందర్భంలో ఈయన్ను తంజావూరు జైలులో నిర్బంధించగా.. అదే జైలులో 1944 సెప్టెంబరు 10వ తేదీన తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardar Dandu Narayana Raju  Indian Freedom Fighters  

Other Articles