The Biography Of Chadalawada Umesh Chandra Who Is Named As Kadapa Puli | Kadapa District Superintendent

Chadalavada umesh chandra biography kadapa puli

Chadalavada Umesh Chandra, Chadalavada Umesh Chandra biography, Chadalavada Umesh Chandra history, kadapa puli history, umesh chandra history, umesh chandra life story, umesh chandra wikipedia, kadapa puli biography, kadapa puli wikipedia

Chadalavada Umesh Chandra Biography Kadapa Puli : The Biography Of Chadalawada Umesh Chandra Who Is Named As Kadapa Puli.

‘కడప పులి’గా పేరుగాంచిన ఐపీఎస్ అధికారి

Posted: 09/05/2015 03:10 PM IST
Chadalavada umesh chandra biography kadapa puli

చదలవాడ ఉమేశ్ చంద్ర.. ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఐపీఎస్ అధికారి. క్రమశిక్షణ కలిగిన పోలీస్ ఆఫీసర్ గా పేరుగాంచిన ఈయన... కడప జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి ‘కడప పులి’ పేరుగాంచారు. జనజాగృతి కార్యక్రమాన్ని ప్రారంభించి.. ఓ ఆపద్భాందవుడిలా ప్రజలకు దగ్గరయ్యారు. సంఘ వ్యతిరేక శక్తులను అణిచివేసి, ప్రజల అభిమానాన్ని పొందారు.

జీవిత విశేషాలు :

1996 మార్చి 19వ తేదీన గుంటూరు జిల్లాలోని పెదపూడి గ్రామంలో వేణుగోపాల రావు, నయనతార దంపతులకు ఉమేశ్ చంద్ర జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ పాఠశాలలో చదివిన అనంతరం నిజాం కళాశాల నుండి బి.ఎ. (1987), ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి యం.ఎ. (1989) పట్టాలు పొందారు. ఆ రెండింటిలోను ప్రధముడిగా నిలచి బంగారు పతకాలు సాధించారు. ఆ తర్వాత 1991లో ‘భారత పోలీస్ సేవ’లో ఎన్నికై, ‘జాతీయ పోలీస్ అకాడెమీ’లో శిక్షణ పొందారు.

శిక్షణ పొందన అనంతరం 1992 నుండి 1994 వరకు వరంగల్లులో ఉప పోలీస్ సూపరింటెండెంట్ గా పని చేశారు. ‘జన జాగృతి’ కార్యక్రమము ప్రారంభించి ప్రజలకు దగ్గరయ్యారు. 1994 అక్టోబరులో పులివెందులకు బదిలీ కాబడి.. అక్కడ సంఘ వ్యతిరేక శక్తులను అణచివేసి, సామాన్య ప్రజల అభిమానాన్ని పొందారు. ఫిబ్రవరి 1995లో వరంగల్లు తిరిగివచ్చి ‘ప్రత్యేక విధుల అధికారి’గా నేరస్థులను అరికట్టారు. పోలీసులపై సంఘంలోవున్న దురభిప్రాయాలు తొలగించారు. ఎంతోమంది నక్సలైట్లను పట్టుకోవడంలో సఫలమయ్యారు. 1995 జూన్లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది కడప జిల్లాకు తిరిగి వచ్చారు. జూన్ 1997 నుండి ఎప్రిల్ 1998 వరకు కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తించారు.

మరణం :

1999 సెప్టెంబర్ 4వ తేదీన ఉమేశ్ చంద్ర హైదరాబాదులో కారులో వెళ్తుండగా.. ఓ ట్రాఫిక్ దీపం వద్ద ఆగింది. అక్కడే వున్న నలుగురు నక్సలైట్లు వెంటనే కాల్పులు జరిపారు. దీంతో అంగ రక్షకుడు, డ్రైవరు వెంటనే మరణించారు. అయితే.. ఉమేశ్ చంద్ర ఏమాత్రం భయపడకుండా కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు. కానీ.. ఆతని వద్ద పిస్తోలు లేదని గ్రహించిన నక్సలైట్లు.. తమ పరుగును ఆపి రెండుసార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేశ్ చంద్ర వద్దకు వచ్చి సమీపము నుండి కాల్చి పారిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chadalavada Umesh Chandra  Kadapa Puli  

Other Articles