kapu rajaiah biography | world famous painter

Kapu rajaiah biography world famous painter

Kapu Rajaiah news, Kapu Rajaiah updates, Kapu Rajaiah biography, Kapu Rajaiah life story, Kapu Rajaiah pictures, Kapu Rajaiah history, Kapu Rajaiah famous painter, telugu painters, famous telugu painters, telugu artists

kapu rajaiah biography world famous painter : The Biography of World Famous Painter Kapu Rajaiah. Whatever he draw a picture it looks like as living one.

గ్రామీణ నేపథ్యంగల చిత్రాలకు పేరుగాంచిన కాపు రాజయ్య

Posted: 04/08/2015 05:37 PM IST
Kapu rajaiah biography world famous painter

కొందరు చిత్రకారులు గీసే బొమ్మలు చూడటానికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వారు చిత్రించిన సదరు బొమ్మలు నిజంగా ప్రాణంతో వున్నాయోమోనన్న అపోహ కలిగేలా చిత్రకారులు అందులో జీవం పోస్తారు. ఈ విధంగా ఎందరినో ఆశ్చర్యచికితుల్ని చేసి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారులు ఎందరో జన్మించారు. అలాంటివారిలో కాపు రాజయ్య కూడా ఒకరు! గ్రామీణ నేపథ్యంగల చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ఈయన.. ఏ బొమ్మ గీసినా సజీవ లక్షణం ఉట్టిపడేది. ఈయన గీసినా చిత్రాలను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన కళారంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు.

జీవిత చరిత్ర :

1925 ఏప్రిల్ 7వ తేదీన మెదక్ జిల్లాకి చెందిన సిద్ధిపేటలో రాజయ్య ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి రాఘవులు చిన్నపాటి వ్యాపారి. రాఘవులుకు మూడో సంతానమైన రాజయ్యకు ముందే ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. చిన్నవయస్సులోనే తండ్రి మరణించడంతో ఆయన తీవ్రమైన ఇబ్బందుల పాలయ్యారు. ఇటువంటి సమయంలో రాజయ్య కుటుంబాన్ని ఆయన తండ్రి మిత్రుడు మార్కచంద్రయ్య ఆదుకున్నారు.

రాజయ్యకు బాల్యం నుంచే చిత్రాపటాలు గీయడంలో ఎంతో ఆసక్తి వుండేది. ఆరో తరగతి చదువుతున్న సమయంలో ఆయన మొదటి చిత్ర ప్రదర్శన జరిగింది. కుబేరుడు అనే ఉపాధ్యాయుడు చిత్రకళలో కాపు రాజయ్యను ప్రోత్సహించారు. ఇక అప్పటి నుంచి ఏమాత్రం వెనకడుగు వేయని ఆయన.. ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాదు, మద్రాసు ప్రభుత్వం కళాశాల నుంచి చిత్రకళలో రాజయ్య డిప్లోమా పొందారు.

కళాకారునిగా :

చిత్రకళల్లో డిప్లొమా పొందిన రాజయ్య.. మొదట సంప్రదాయబద్దమైన, కాలపరీక్షకు నిలిచిన ప్రాచ్య విధానంలో అంటే ‘వాష్’ పద్ధతిలో తొలిచిత్రాలు వేశారు. ఆ తర్వాత నకాషీ చిత్రకారుల అద్భుతమైన టెక్నిక్ ఆయను ముగ్ధుడ్ని చేసింది. దాంతో ఆయన టెంపరా రంగుల వాడకాన్ని ప్రారంభించారు. ఇరవై ఏళ్ల పాటు 1950 నుంచి 1970 వరకు ఆయన టెంపరా చిత్రాలు వేశారు. లలితా కళా అకాడమీ ద్వారా ఆయన చెకోస్లోవికియా, హంగేరి, రుమేనియా, బల్గేరియా దేశాల్లో ప్రదర్శనలు పెట్టారు. వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, గోపికా కృష్ణ, పంటపొలాలు, వసంతకేళి, కోలాటం వంటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలకు ఆయన ప్రాణం పోశారు.

అవార్డులు - రివార్డులు :

రాజయ్యకు 50దాకా అవార్డులు వచ్చాయి.
1. జెఎన్‌టియు ఆయనను గౌరవ డాక్టరేట్ ద్వారా గౌరవించింది.
2. 1966లో రాష్ట్రప్రభుత్వం ఆయనను ‘రజతపత్రం’తో, 1969లో ‘తామ్రపత్రం’తో సత్కరించింది.
3. 1975లో ఆయనకు చిత్ర కళాప్రపూర్ణ సత్కారం లభించింది.
4. 1993లో ‘కళాప్రవీణ’, 1997లో ‘కళావిభూషణ్’, 2000లో ‘హంస’, 2007లో ‘లలిత కళారత్న’ తదితర అవార్డులు లభించాయి.

ఇలా ఈ విధంగా చిత్రకళారంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించి, ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన రాజయ్య... 20 ఆగష్టు 2012లో తన 87వ ఏట ‘పార్కిన్సన్స్ వ్యాధి’ వల్ల మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kapu Rajaiah  telugu famous painters  telugu artists  

Other Articles