biography of 4th Prime Minister of India morarji desai

Morarji desai biography 4th prime minister of india

morarji desai news, morarji desai updates, morarji desai biography, morarji desai history, morarji desai life story, morarji desai biography, morarji desai fourth prime minister, indian prime ministers list

morarji desai biography 4th Prime Minister of India : The biography of morarji desai who is the 4th Prime Minister of India.

భారతదేశ 4వ ప్రధానమంత్రిగా బాధత్యలు చేపట్టిన దేశాయి

Posted: 04/10/2015 05:37 PM IST
Morarji desai biography 4th prime minister of india

మొరార్జీ దేశాయి.. బ్రిటీష్ పరిపాలనాకాలంలో దేశ స్వాతంత్ర్యకోసం తనవంతు కృషి చేసిన సమరయోధుడు. అంతేకాదు.. దేశానికి ఈయన చేసిన సేవలకుగానూ ఎన్నో పురస్కరాలు, సన్మానాలు అందుకున్నారు. దేశ తొలి కాంగ్రేసేతర ప్రధానమంత్రి అయిన ఈయన.. భారత్-పాకిస్థాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన ‘భారతరత్న’, ‘నిషానే పాకిస్తాన్’లను పొందిన ఏకైక భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు.

జీవిత చరిత్ర :

1896 ఫిబ్రవరి 29న బాంబే ప్రెసిడెన్సీలోని భదేలీలో నివాసముండే ఒక అనావిల్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఈయన ప్రాథమిక పాఠశాల జీవితం సౌరాష్ట్ర కుండ్ల స్కూల్, సవార్ కుండ్లలలో జరిగింది. అనంతరం ముంబయ్ విల్షన్‌ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసి.. గుజరాత్ సివిల్ సర్వీస్ లో చేరారు. అయితే.. అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం చేసిన ప్రణాళికలు, ఆగడాలు, అకృత్యాలు నచ్చక.. ఈయన 1924లో బ్రిటిష్ సివిల్ సర్వీస్ ను వదిలేశారు. 1930లో బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక ఉధ్యమములో చేరారు. అయితే.. స్వాతంత్ర సమరయోధుడుగా చాలా సంవత్సరాలు జైలులో ఉన్నారు.

రాజకీయ జీవితం :

ఇక రాజకీయ నాయకుడిగా ఈయన సమర్థవంతంగా తన సేవలు నిర్వహించారు. గుజరాత్ లో ఇండియన్‌ నేషనల్ కాంగ్రెస్ లో ప్రముఖ నాయకుడుగా చలామని అయ్యేవారు. 1934, 1937లో బాంబే ప్రెసిడెన్సీలో రెవిన్యూ, హోం మినిష్టర్ గా సేవలందించారు. ఇక దేశ స్వాతంత్ర్యానంతరం 1952లో బాంబే స్టేట్ కి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే మరాఠి భాషా రాష్ట్రం ఏర్పాటులో ప్రముఖపాత్ర పోషించారు.

అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకుడైన ప్రధానమంత్రి జవర్లాల్ నెహౄతోనూ, అతని సహచరులతోనూ ఈయనకు విభేదాలుండేవి. 1964లో నెహ్రూ మరణాంతరము తను ప్రధానమంత్రి రేసులో ఉన్నా... తనను కాదని నెహ్రూ అనుచరుడు లాల్ బహదూర్ శాస్త్రినే ప్రధానమంత్రిని చేసారు. ఇక శాస్త్రి మరణాంతరము 1966లో ప్రధానమంత్రిగా పోటీలో ఉండి ఇందిరా గాంధీతో నెగ్గలేక 169/351 ఓట్ల తేడాతో వెనుదిరగవల్ససి వచ్చింది. 1975లో విధించబడిన అత్యవసర పరిస్థితి కారణంగా 1977 ఫిబ్రవరి-మార్చ్ నెలలలో జరిగిన ఎన్నికలలో తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆ దెబ్బకు 30 సంవత్సరాలపాటు నిరంతరాయంగా సాగిన కాంగ్రెస్ పాలన ఒక్కసారిగా అంతమయింది. అప్పుడు కాంగ్రసేతర ప్రభుత్వం అధికారం చేపట్టింది.

కాంగ్రెస్ (ఒ), భారతీయ లోక్ దళ్, జనసంఘ్, సోషలిస్టు తదితర పార్టీలన్నీ ఏకమై జనతాపార్టీ పేరుతో ఒకటయ్యాయి. ఆ సమయంలో ఆ పార్టీకి మొరార్జీ దేశాయ్ అధ్యక్షుడయ్యారు. అప్పటి మాజీ మంత్రి జగజ్జీవన్ రామ్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ‘డెమొక్రటిక్ కాంగ్రెస్’ అనే కొత్త పార్టీని స్థాపించారు. కొన్నాళ్ల తర్వాత ఆయన జనతాపార్టీతో ఒక అవగాహనకు వచ్చారు. ఫిబ్రవరి 16 మార్చ్ 10వ తేదీ మధ్య జరిగిన న్నికలలో జనతాపార్టీ దాని మిత్రపక్షాలు మెజారిటీ సాధించాయి. ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ- రాయ్ బెరీలో ఒడిపోయింది. మార్చ్ 21వ తేదీ అత్యవసర పరిస్థితి ఉపసంహరించుకో బడింది. మార్చ్ 24వ తేది మొరార్జీ దేశాయి ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు స్వీకరించారు. మురార్జీ ఏప్రిల్ 10, 1995న పరమపదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : morarji desai  indian prime ministers list  congress party history  

Other Articles

Today on Telugu Wishesh