Ap 9th Chief minister Bhavanam Venkatarami Reddy Biography | Andhra Pradesh Chief Ministers

Bhavanam venkatarami reddy biography andhra pradesh 9th chief minister

bhavanam venkatarami reddy news, bhavanam venkatarami reddy biography, bhavanam venkatarami reddy history, andhra pradesh chief ministers, chandrababu naidu, nt rama rao history, bhavanam venkatarami reddy life story, ap 9 chief minister

bhavanam venkatarami reddy biography andhra pradesh 9th chief minister : The Biography Of Bhavanam Venkatarami Reddy Who Is The 9th Chief Minister Of United Andhra Pradesh. He served as the chief minister for just seven months.

ఆంధ్రప్రదేశ్ 9వ ముఖ్యమంత్రిగా పనిచేసిన ‘భవనం’

Posted: 04/06/2015 07:26 PM IST
Bhavanam venkatarami reddy biography andhra pradesh 9th chief minister

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజకీయ ప్రముఖులు మొత్తం 21 మంది వున్నారు. వీరంతా రాష్ట్రాభివృద్ధికోసం తమవంతు సేవలు నిర్వహించారు. అటువంటివారిలో భవనం వెంకట్రామ్ రెడ్డి ఒకరు. ఈయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 9వ ముఖ్యమంత్రి. 1982 ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబర్ 20 వరకు ఏడు నెలలపాటు మాత్రమే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నారు. ఈయన మంత్రివర్గంలోనే ప్రస్తుత ఆంధ్రముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలిసి పనిచేశారు.

జీవిత చరిత్ర :

1931 జూలై 18న గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలలోని గొల్లపాడు గ్రామములో వెంకట్రామ్ జన్మించారు. గుంటూరు పట్టణంలో న్యాయవాద వృత్తి ప్రాక్టీసు చేసిన ఈయన.. రాజకీయాలలో రాకముందు పూర్వపు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి అయిన కందుల ఓబులరెడ్డి దగ్గర పర్సనల్ అసిస్టెంటుగా పనిచేశారు.

వ్యక్తిగత జీవితం :

వెంకట్రామ్ భార్య పేరు భవనం జయప్రద. ఈమె 1967 నుండి 1978 వరకు వినుకొండ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యురాలుగా కొనసాగింది. ఈమె పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో విద్యుచ్ఛక్తి శాఖా మంత్రిగానూ, జలగం వెంగళరావు మంత్రివర్గంలోనూ మంత్రిగా పనిచేసింది. ఈ దంపతులిద్దరికీ ఇద్దరు కుమార్తెలు.

రాజకీయ జీవితం :

1978లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖా మంత్రిగా చేరి శాసన మండలికి నియమితుడయ్యారు. కుల రాజకీయాలకు వ్యతిరేకంగా తన పేరులోని రెడ్డి విడచి.. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన అంజయ్య మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగారు. 1982లో కాంగ్రేసు పార్టీ అధిష్టానవర్గం అండతో ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన సీఎంగా వున్న సమయంలో దేశంలోనే మొదటిదైన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్శిటీ) ను నెలకొల్పారు. దీంతో ఈయనకు మంచి గుర్తింపు లభించింది. అయితే.. అధిష్టానవర్గం కోరిక మేరకే ఈయన కేవలం 7 నెలల పాలన తర్వాత రాజీనామా చేసి.. కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గము సుగమం చేశారు.

సీఎంగా ఈయన రాజీనామా చేసిన తర్వాత కొంతకాలం వరకు రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అనంతరం వీ.పీ.సింగ్ ‘జనతా దళ్ పార్టీ’లో చేరి అక్కడ కొన్నాళ్లపాటు తన సేవలు అందించారు. అయితే.. ఆ పార్టీ ప్రణాళికలు నచ్చకపోవడం వల్ల ఈయన తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. 2000లో రాం విలాస్ పాశ్వాన్ ‘లోక్ జన శక్తి’ అనే కొత్త పార్టీ పెట్టినప్పుడు వెంకటరామిరెడ్డి ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఇలా రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఈయన.. 2002 ఏప్రిల్ 6న 71 సంవత్సరాల వయసులో గుండెపోటుతో హైదరాబాదులోని మహావీర్ ఆసుపత్రిలో మరణించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bhavanam venkatarami reddy  andhra pradesh chief ministers  

Other Articles