Telugu movie news special actor kamal hassan in film industry

actor kamal hassan, special actor kamal hassan, tamil actor kamal hassan, tamil film industry, telugu film industry, great actor of indian film industry

special actor kamal hassan in film industry

ఆది నుండి నట 'విశ్వరూపం

Posted: 05/17/2013 03:13 PM IST
Telugu movie news special actor kamal hassan in film industry

అంతులేని సినీ పరిశ్రమకి , తిరుగులేని కధానాయకుడు , అందమైన తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడు . గత 30 సంవత్సరాల నుండి , నిర్విరామంగా నటుడిగా కొనసాగుతున్నాడు . ఎవ్వరు సాహసించని పాత్రలు పోషించడం , విన్నొత్నమైన కధలను ఎంచుకుని , భారీ బడ్జెట్ అయినా వెనుకాడకుండా , సినిమాలు చెయ్యడం , అవసరం అయితే తానె నిర్మాతగా మారి సినిమాలు రూపొందించడం , సినిమాను దైవం గా భావిస్తాడు ఈ నటుడు , సినిమానే నమ్ముతాడు , అనే దానికి నిదర్సనం . 'విశ్వరూపం' ఎన్నో వివాదాలను ఎడురుకొని , విడుదల అయ్యి , ఒక్క వారం లోనే పెట్టిన పెట్టుబడిని అర్జిన్చిపెట్టిందంటే , ఈ చిత్రం లో నటించడం మాత్రమె కాక , నిర్మాతగా వ్యవహరించి , కధను సమకూర్చి , దర్శకత్వం కూడా వహించిన బహుముఖ ప్రజ్ఞ్యాసాలి , ఈ నటుడి సత్తా మనకు మరోసారి రుజువవుతుంది .

'దశావతారం' చిత్రం లో ఒక పాటలో , కమల్ హస్సన్ ను 'లోక నాయకుడా' అంటూ అభివర్ణించారు . ఈ వర్ణన ఈ మహా నటుడికి సరిగ్గా సరిపోతుంది . నాటి 'మరో చరిత్ర' నుండి , నేటి 'విశ్వరూపం' వరకు , కమల్ హస్సన్ చిత్రాల ఎంపిక , నటనను గమనించిన ఎవ్వరైనా ఈ మాటతో ఏకీభవించక తప్పదు . నటుడు , దర్శకుడు , నిర్మాత , అంతకు మించి సినిమాను గౌరవించె ఒక గొప్ప టెక్నీషియన్ కమల్ హస్సన్ .

కమల్ చేసే ప్రయత్నాలు , తీసే , తీసిన కొన్ని సినిమాలు కొంతమందికి నచ్చవు ... 'ఇది సినేమానేనా ? కమల్ హస్సన్ కి ఏమయ్యింది ? ' అని కమల్ ప్రయత్నాలు చూసి పెదవి విరిచిన వారూ లేకపోలేదు . అయినా , ప్రయత్నాలు చెయ్యడం , విన్నూత్నంగా ఆలోచించడం ఆపలేదు కమల్ ...

జాతీయంగా , అంతర్జాతీయంగా ఎన్నో అవార్డ్లులు , రివార్డులు , గుర్తింపు , కమల్ సొంతం . 'స్వాతి ముత్యం ' , 'సాగర సంగమం' , 'ఆకలి రాజ్యం ' , 'పుష్పక విమానం ', 'మైఖేల్ మదన కామరాజు ', 'సతీ లీలావతి ' ఈ చిత్రాలన్నీ ఈ నటుడి ప్రతిభను తెలిపేవే .

కమల్ హస్సన్ తమిళం లో అయితే తన పాత్రకు తానె గాత్రదానం చేస్తారు , తెలుగులో కూడా , మొన్నటివరకు తానె తన పాత్రలకు గాత్రదానం చేసేవారు , అయితే తరువాతి కాలం లో గాయకులు యస్ . పీ . బాల సుబ్రహ్మణ్యం కమల్ హస్సన్ కి గాత్రదానం చెయ్యటం ప్రారంభించారు .

ఈ విలక్షణ నటుడు ఏ పాత్ర నటించిన తన నటన ద్వారా అందరినీ ఎలా మెప్పిస్తారో , బాలు గారి వాయిస్ కూడా కమల్ హస్సన్ గారికి తెలుగులో అంతే ప్రశంసలను తెచ్చిపెట్టేవిధంగా తోడ్పడుతూ వచ్చింది . ఇందుకు నిదర్సనం , 'విశ్వరూపం' , ఇంతకన్నా ముందు విడుదల అయిన , కమల్ 10 పాత్రలు పోషించిన 'దశావతారం ' , ఈ చిత్రం లో 10 రకాల వేరియేషన్స్ లో కమల్ పోషించిన పాత్రలకు , పాత్రలకు తగ్గట్టుగానే తన గొంతు మార్చి , గాత్రదానం చేసి , బాలు కూడా విలక్షణ కళాకారులు మరొక్కసారి అనిపించుకున్నారు .

ప్రస్తుతం కమల్ 'విశ్వరూపం - 2' కధను తయారు చెయ్యడం లో నిమగ్నమయ్యి ఉన్నారు . త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి . ఈ విలక్షణ నటుడు మరిన్ని విజయాలు సొంతం చేసుకువాలని , ప్రేక్షకులను అలరించాలని ఆశిద్దాం .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles