Old actor jaggaiah special article

tollywood actor jaggaiah, kongara jaggaiah, devudu chesina manushulu, jaggaiah biography, jaggaiah filmo graphy, jaggaiag movie list

old actor jaggaiah special article

కంచు కంఠం + విలక్షణ నటన + మంచి రూపం = జగయ్య

Posted: 05/18/2013 04:54 PM IST
Old actor jaggaiah special article

కంచు కంఠం , ఈ పదానికి నిర్వచనం ఈ నటుడు . అటు ఎమోషనల్ పాత్రల్లో అలరించిన , ఇటు కామెడీ విలన్ , విలన్ , నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలు పోషించినా , ఇది ఈ నటుడికే చెల్లింది . అభినయం తో పాటు , చక్కని రూపం కూడా , ఈ నటుడి సొంతం . ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేసిన ఘనత ఈ నటుడిది . ఈయనే 'జగ్గయ్య' ...

తెలుగు తెరపై వెలిగిన అభినయమూర్తుల్లో కొంగర జగ్గయ్యది ఓ ప్రత్యేక స్థానం. తన కంచు కంఠంతో ఎన్నో పాత్రలకు జీవం పోశారాయన. జగ్గయ్య పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఆయన వాచకమే. 1926 డిసెంబర్ 31న గుంటూరు జిల్లా తెనాలి తాలూకా మోరంపూడి గ్రామంలో జగ్గయ్య జన్మించారు. ఆయన కుటుంబ పెద్దలు సైతం సాహితీ ప్రియులు కావడంతో వాళ్లింట్లో ఎన్నో అమూల్య గ్రంథాలుండేవి. వాటిని చదువుతూ బాల్యంలోనే జగ్గయ్య సాహిత్యం, కళల పట్ల ఆకర్షణ పెంచుకున్నారు.

మిత్రుల ప్రోత్సాహంతో 1952లో ప్రియురాలు చిత్రంతో తెరంగేట్రం చేసిన జగ్గయ్య మరి వెనుతిరిగి చూసుకోలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ చిత్రాల్లో సెకండ్ హీరో రోల్స్‌లో మెప్పించారాయన. అనుపమ ఫిలిమ్స్ పతాకంపై కె.బి. తిలక్ నిర్మించి, దర్శకత్వం వహించిన పలు చిత్రాల్లో జగ్గయ్య హీరోగా నటించారు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ తొలి చిత్రం 'అన్నపూర్ణ'లోనూ జగ్గయ్యనే కథానాయకుడు.

విలక్షణమైన పాత్రల పట్ల ఆకర్షితుడై విలన్‌గా, కేరెక్టర్ యాక్టర్‌గా మారిపోయారు జగ్గయ్య. వందలాది చిత్రాల్లో తన కంచు కంఠంతో పలు పాత్రలకు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. శివాజీగణేశన్‌కు జగ్గయ్య పలు చిత్రాల్లో గాత్రదానం చేశారు. మన సినిమా రంగం నుంచి తొలుత క్రియాశీలక రాజకీయాల్లో రాణించిన నటుడు జగ్గయ్య. సోషలిస్ట్ ప్రజా పార్టీలో ఉన్న జగ్గయ్య నాటి ప్రధాని నెహ్రూ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

''వెల్‌కం మిస్టర్‌ రామరాజు వెల్‌కం సిడౌన్‌ నువ్వు వచ్చును అని నాకు తెలియును'' ఎదురుగా ఆవేశంగా వస్తున్న సీతారామరాజుకు తుపాకీని గురిపెట్టి చూస్తూ అంటాడు రూధర్‌ ఫర్డ్‌.

ఇది అల్లూరి సీతారామరాజు సినిమాలోని సన్నివేశం ఎంతో ఉత్కంఠతతో గంభీరంగా సాగే నిడివైన సన్నివేశం. ఈ సినిమాలో ఎంతో కీలకమైన ఈ సన్నివేశంలో సీతారామరాజుగా కృష్ణ, రూధర్‌ఫర్డ్‌గా జగ్గయ్య ఆ సజీవ పాత్రలకు ప్రాణం పోసారు. హావభావాలతో నటనా వాక్పటిమలతో, సందర్భోచిత గంభీరమైన సంభాషణలతో ఆ పాత్రల్ని ఒప్పించారు. మనల్ని మెప్పించారు. రూధర్‌ ఫర్డ్‌ ఎలాంటివాడో, మన తెలుగు నేలపై ఏంచేసాడో చరిత్ర చదివితేనే తెలుస్తుంది. చూడటానికి ఎలా వుంటాడో తెలియదు. ఇలా తెలిసే అవకాశాలు చాలా తక్కువ. కాని మనకు తెలిసిన రూధర్‌ ఫర్డ్‌ పాత్ర పరంగా జగ్గయ్యే! ఇతను తప్ప మరొకరు కాదు. మరొకర్ని ఆ పాత్రలోనూ ఊహించుకోలేం!

ఇంతగా పాత్రల్లో జీవించేవారు కాబట్టే , జగ్గయ్య నేటికీ , తెలుగు సినిమా ఉన్న ఏనాటికీ ప్రత్యేకం .

ఇక జగయ్య నెగెటివ్ పాత్రలను ఎలా పోషించారు అని ఆలోచన చేస్తే , 'అల్లూరి సీతారామరాజు' చిత్రం తో పాటు , 'అర్ధాంగి' , 'తోడి కోడళ్ళు' చిత్రాలు నిదర్సనం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles