Telugu actress special story on actress suryakantham

Actress Suryakantham, Suryakantham telugu film, suryakantham family photos, suryakantham movies, savitri, jamuna,

Special story on Actress Suryakantham

సావిత్రిని హడలెత్తించిన సూర్యకాంతం

Posted: 05/16/2013 06:43 PM IST
Telugu actress special story on actress suryakantham

ఆమె పేరు వింటే చాలు , రేలంగైనా , రామనారెడ్డి అయినా , ఉలిక్కిపదాల్సిందే , సావిత్రి , జమునా వంటి హేమా హేమీలు కూడా , ఆమె చేతి దెబ్బలు , మాట విరుపులు , విసురులు పడ్డవారే ... యన్ . టీ . ఆర్. కూడా ఆమె మాటకు దడిసినవారే ... ఆమె , సూర్యకాంతం ... అయితే ఈ దబాయింపు అంతా వెండి తెర మీదే అనుకోండి .

50 వ శతకం లో గయ్యాళి అత్త , ఆరళ్ళు పెట్టే పిన్ని , పెద్దమ్మ , పెద్దపులి వంటి కోడలు , బామ్మ , ఇటువంటి పాత్రలు పోషించాలి అంటే అది నటి సూర్యకాంతం కి మాత్రమె సాధ్యపడేది . దర్శక - నిర్మాతలు కూడా ఈమెను కాకుండా , ఇటువంటి తరహా పాత్రలకు ఇంకెవ్వరినీ సంప్రదించేవారు కూడా కాదు . అసలు హీరోయిన్ల మంచి స్వభావం తెరమీద అంతబాగా ఎలివేట్ అయ్యింది అంటే సూర్యకాంతం వల్లనే . ఈమె గయ్యాళి అని చూస్తున్న ప్రేక్షకులు , తాము సినిమా చూస్తున్నాం అన్న సంగతి కూడా మరచి పోయి ఈమెను తిట్టేవారు , ఈమె చేతుల్లో దెబ్బలు తినే హీరోయిన్లపై సానుభూతి చూబించే వారు . అందుకే సూర్యకాంతం ఆర్టిస్ట్ గా తనకు తాను గుర్తింపు సంపాదించుకోవడం తో పాటు , ఇతర నటీనటుల నటనని కూడా ఎలివేట్ చేసారు అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు .

అసలు 'గుండమ్మ కధ ' చిత్రం మల్టీ స్టారర్ అయినా , అందరు నటీనటులు ఈ చిత్రం లో విజ్రుమ్భించి నటించినా , చిత్ర కధ , పాటలు , కధనం అన్నీ పక్కాగా కుదిరినా , 'గుండమ్మ ' పాత్రలో సూర్యకాంతం గారి నటన అంత అద్భుతంగా కుదిరింది కాబట్టే , ఇది చిత్ర విజయానికి 60 శాతం వరకు దోహదపడింది . ఈ చిత్రం చూసిన ప్రతీ ప్రేక్షకుడు ఈ మాటతో ఏకీభవిస్తారు .

ఇక ఇంతకంటే ముందు ఒచ్చిన 'తోడి కోడళ్ళు ' చిత్రం లో పచ్చని సంసారం లో స్వలాభం కోసం చిచ్చు పెట్టి , మనిషికోకరి చొప్పున , సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరి దగ్గరా , ఒక్కొక్కలా ఉంటూ , కధను కీలక మలుపు తెప్పే ముఖ్యమైన పాత్ర సూర్యకాంతం గారిది . ఈ పాత్రకు , ఇటువంటి తాను నటించిన ఎన్నో పాత్రలకు , 100 శాతం , కాదు కాదు 200 శాతం న్యాయం చేసారు కాబట్టే , మన నిత్య జీవితం లో ఈరోజుకు కూడా , కాస్త గయ్యాళిగా , దురుసుగా ఎవ్వరు కనిపించిన 'ఏంటి నువ్వు సూర్యకాంతం లా' అని అభివర్నిస్తాం . బౌతికంగా లేకపోయినా , నటన ద్వారా , తాము ఎంచుకున్న రంగం లో చేసే యెనలేని కృషి ద్వారా , మనిషి చిరకాలం గుర్తుండిపోవచ్చు అన్న నానుడికి నిదర్సనం సూర్యకాంతం గారు .

ఇటు వంటి గయ్యాళి పాత్రలని తెరమీద అవలీలగా పోషించే సూర్యకాంతం గారు , నిజజీవితం లో కూడా ఇటువంటి స్వభావం కలిగి ఉంటారేమో అనుకోడానికి కారణాలు ఎన్నో , కాని ఈవిడ ఎంతో కలుపుకోలు మనిషి . షూటింగ్ లొకేషన్ కు మొత్తం యూనిట్ అందరికీ తన ఇంటి నుండి భోజనం తీసుకు వెళ్ళేంత మంచి స్వభావం కలవారు . అంతేకాదు , రంగస్థలం నుండి వెండితెరకు అడుగుపెట్టిన తను , తనలాంటి ఎందరో ఔత్సాహిక నటీనటులకు తన శిఫార్సు తో అవకాశాలు కూడా ఇప్పించారు .

సినిమాల్లో నటించాలన్న కోరిక చిన్నపట్టినుండే సూర్యకాంతం గారికి అమితంగా ఉండేది . హిందీ సినిమా పోస్టర్లు చూసి ఈ కోరిక మరింత బలపదిందట . దీనికితోడు 6 ఏళ్ళ వయస్సులోనే , సంగీతం , నాట్యం నేర్చుకున్నారు . ముందు రంగస్థలం , తరువాత చెన్నై వెళ్లి సినిమా ,ప్రయత్నాలు ఇవన్ని ఫలించడంతో పాటు , తన వైవాహిక జీవితం కూడా ఆనందమయం చేసుకున్నారు . న్యాయమూర్తి పెద్దిపోట్ల చలపతి రావుగారిని సూర్యకాంతం వివాహం చేసుకున్నారు .

తన నటనతో భయపెట్టించడమే కాదు , పాత్ర తీరు మేరకు నవ్వించడం కూడా సూర్యకాంతం సొంతం .

ఒక ఆర్టిస్టు కి నటన మాత్రం కాక గాత్రం కూడా పాత్రకు తగ్గట్టు గా ఉండాలి అని తాన నటనతో చెప్పకనే చెప్పిన సూర్య కాంతం నిజంగా ఎవర్గ్రీన్ నటీమణి .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles