ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనకు సంబంధించిన అంశం పై కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ అంశం పై తేల్చడానికి మంత్రుల కమిటీ (జీఓఎం) ని ఏర్పాటు చేసి మీటింగుల మీద మీటింగులు పెట్టేస్తుంది. ఇక త్వరలో జరగబోయే శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును తెచ్చేందుకు కేంద్రం విశ్వప్రయత్నాలే చేస్తుంది. అందులో భాగంగానే నేడు నార్త్ బ్లాక్ లో జీఓఎం భేటీ అయ్యింది. ఈ భేటీనే చివరిదని దీని తరువాత తెలంగాణ బిల్లు ముసాయిదా రెడీ అవుతుందని అన్నారు.
కానీ తీరా నేడు జరిగిన భేటీకి కొంత మంది మంత్రులు గైర్హాజరు అయ్యారు. ఈరోజు జరిగిన సమావేశానికి షిండేతోపాటు ఆంటోనీ, జైరాం రమేష్, నారాయణస్వామి, వీరప్పమొయిలీలు హాజరయ్యారు. గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో 10 పేజీల ముసాయిదా నివేదికపై చర్చ జరిగింది. ఈ కీలక సమావేశానికి కేంద్ర మంత్రులు చిదంబరం, గులాంనబీ అజాద్‌లు కొన్ని అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు కావాలనే ఈ సమావేశానికి హాజరు కాలేదని, ఇలా అయితే మరో కొన్ని రోజులు తెలంగాణ బిల్లు ఆలస్యం చేసి తీరా శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశ పెట్టకుండా చేసే ఆలోచనలో ఉన్నది అంటున్నారు తెలంగాణ ప్రాంత నాయకులు.
నేడు ఇద్దరు మంత్రులు గైర్హాజరు కావడంతో మరోసారి జీఓఎం భేటి ఉంటుందని, త్వరలోనే ప్రక్రియ పూర్తి చేస్తామని, ఈ నెల 27వ తేదీన ఈ భేటీ ఉండవచ్చునని కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటించారు. ఇక నేడు జరిగిన భేటీకి సీమాంధ్ర తరఫున కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలంలు హాజరయ్యారు. హైదరాబాద్‌ను యూటీ (కేందపాలిత ప్రాంతం) చేయాలని, హైదరాబాద్‌తో తెలంగాణకు సంబంధం ఉండకూడాదని, హైదరాబాద్‌ను యూటీ చేస్తారనే భావంతోనే విభజనకు తాము ఒప్పుకున్నామని, లేని పక్షంలో తమ పదవులకు రాజీనామాలు చేసి రంగంలోకి దిగాల్సి వస్తుందని, తమను కాదని ముందుకు ఎలా వెలతారో చూస్తామని, విభజనను అడ్డుకోవాల్సి వస్తుందని వారు జీఓఎంను హెచ్చరినట్లు తెలుస్తుంది. మరి ఇన్ని రోజులు విభజనకు సై అని చివరి నిమిషంలో ఇలా మాట్లాడటం సరికాదని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more