Dawood offered a car to each indian player in 1986

sharjah 1986,Kapil Dev,Javed Miandad,Dilip Vengsarkar,Dawood Ibrahim, dawood ibrahim, dilip vengsarkar, kapil dev

Dawood offered a car to each player of the team if they beat Pakistan in the match that was to be played the next day, Dilip Vengsarkar said at a function in Jalgaon.

దావూద్ గురించి వెంగసర్కార్ సంచలన వ్యాఖ్యలు

Posted: 10/28/2013 09:18 PM IST
Dawood offered a car to each indian player in 1986

క్రికెట్ కి, క్రికెటర్లకు మాఫియాతో సంబంధాలు ఉన్నాయని, మాఫియాతో కలిసే ఫిక్సింగ్ లకు పాల్పడతారంటూ ఎప్పటి నుండో ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఉదంతం అప్పుడు బుకీలకు మాఫియాతో సంబంధాలు ఉన్నాయని, మాఫియా క్రికెటర్లకు ఎరవేస్తారని రుజువయ్యింది కూడా. నేడు భారత్ మాజీ క్రికెటర్ అయిన వెంగ్ సర్కార్ భారత్ జట్టు పై, ఆ జట్టుకు ఉన్న మాఫియా సంబంధాల పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

భారత క్రికెటర్లకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కి సబంధాలు ఉన్నాయనే సంచలన వ్యాఖ్యలు చేసి క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాడు. 1986 ఆస్ట్రేలియా-ఆసియా‌కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో నెగ్గితే భారత ఆటగాళ్లకి టయోటా కారు ఇస్తానని దావూద్ ఆఫర్ ఇచ్చాడని, బాలీవుడ్ నటుడు మహమూద్ ఓ వ్యాపారిగా దావూద్‌ని డ్రెస్సింగ్ రూమ్‌లోవున్న ఆటగాళ్లకు పరిచయం చేశాడని, అప్పుడే డ్రెస్సింగ్ రూంలోకి వచ్చిన కెప్టెన్ కపిల్‌దేవ్ వెంటనే దావూద్‌ని బయటకు వెళ్లిపోవాలని ఈ సందర్భంగా కోరాడని, కపిల్‌పై ఆగ్రహం వ్యక్తంచేసిన దావూద్ తర్వాత రూంలో నుంచి బయటికి వెళ్లాడని , ఆ టైంలో నాకు తప్ప వేరేవారికి అతను దావూద్ అని తెలియదని ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 

కపిల్ స్పందనతో ఆగ్రహం వ్యక్తం అంతేగాక తన కారు బహుమతిని కూడా దావూద్ రద్దు చేసుకున్నట్లు చెప్పాడు. ఆ సమయంలో కపిల్ దేవ్‌కి తను మాట్లాడిన వ్యక్తి దావూద్ అని తెలియదని సర్కార్ తెలిపారు. అయితే అతను రూంలోకి రావడాన్ని అనుమతించలేదని, అతని బహుమతిని కపిల్ నిరాకరించాడని అన్నారు.

కాగా ఆ ఫైనల్ మ్యాచులో ఒక వికెట్ తేడాతో పాకిస్థాన్ విజయం సాధించింది. దావూద్ ఇబ్రహీంకు అల్ఖైదాతో కూడా సంబంధాలున్నట్లు తెలియడంతో అతను ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ గా గుర్తించిన సంగతి తెలిసిందే. తాజాగా దావూద్ పై వెంగీ విమర్శలు గుప్పించడంతో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీని పై బీసీసీఐ ఏవిధంగా స్పందిస్తుందో, ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందోనని క్రికెట్ వర్గాల్లో ఆందోళన మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more