వస్తున్నా మీకోసం పేరుతో సుదీర్ఘ సాదయాత్ర చేసిన చంద్రబాబు దాని ముగింపును విశాఖలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బస్సు యాత్రను మొదట ఉత్తరాంద్రలో నిర్వహించనుండడం విశేషం. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ‘ఆత్మగౌరవ యాత్ర’ చేపట్టాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. బాబు చేపట్టే ఆత్మగౌరవ యాత్ర ను విజయనగరం జిల్లా కొత్తవలసలో ఇందుకు శ్రీకారం చుట్టనున్నారు. వెనకబడిన ప్రాంతమైన ఉత్తరాంద్ర నుంచి ఈ యాత్రను ఆరంభించాలని నిర్ణయించుకుని మార్గాన్ని ఖరారు చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి బయల్థేరి విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ నుంచి విశాఖ పశ్చిమ, పెందుర్థి అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా రోడ్డు మార్గంలో విజయనగరం జిల్లాలో అడుగిడతారు. ఆ జిల్లాలో ఏడు రోజల పాటు 360 కిలోమీటర్ల మేర బస్సుయాత్ర చేస్తూ తొమ్మిది నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. అనంతరం శ్రీకాకుళం వెళ్తారు. తొలివిడత యాత్ర దాదాపు 15 రోజులు జరగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ సడన్ గా బస్సుయాత్రకు బ్రేక్ పడింది. తెలుగుదేశం పార్టీ భవనంలో ఈ విషయాన్ని చెప్పటం జరిగింది. చంద్రబాబు తలపెట్టిన ఆత్మగౌరవ యాత్రకు బ్రేక్ పడింది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఏకపక్ష, పక్షపాత వైఖరిని ప్రజల ముందు కడిగేయడం కోసం చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాలలో ఆత్మగౌరవ యాత్ర చేయాలని తలపెట్టారు. ఇది విజయనగం జిల్లాలో త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుత సమయంలో యాత్ర చేయడం సరికాదని, కొన్ని రోజులు ఓపిక పట్టాలని టీడీపీ సీనియర్ నేతలు చంద్రబాబుకు సూచించారు. దీంతో చంద్రబాబు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే మరో నందమూరి హరిక్రిష్ణ క్రిష్ణ జిల్లా నుండి బస్సుయాత్రకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో బాబు బస్సు యాత్రకు బ్రేక్ పడటంతో.. కొన్ని అనుమానలు తెరపైకి వస్తున్నాయి. హరిక్రిష్ణ బస్సు యాత్రకు బయపడి బాబు ఆత్మగౌరవ యాత్రను వాయిదా వేసుకున్నాడా? లేక సీమాంద్రలో ఉద్యమం సెగలు రేగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ప్రజల వద్దకు వెళ్లితే చేదు అనుభవం అవుతుందని చంద్రబాబు భావించారా? లేక ఏమైన కుటుంబం విభేధాల కారణంగా వెనక్కి తగ్గేడా అనేది మాత్రం తెలియదు. కానీ పార్టీలోని సీనియర్ నాయకుల సలహాల మేరకే బాబు బస్సు యాత్రకు బ్రేక్ పడ్డినట్లు టిడిపి బాబులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more