చట్టసభలలో తెలుగువాడికి ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది. అప్పుడు ఇప్పుడు తెలుగువాళ్లే బలవుతున్నారు. తెలుగువారు అంటే ఒక చులకన ఏర్పాడింది. అందుకే మనకు ఇలా జరుగుతుంది. చట్ట సభలలో గట్టిగా మాట్లాడే తెలువాడు ఒక్కడు కూడా లేకపోవటమే మనకు ఇలా జరుగుతుంది. స్పీకర్ లో సహనం పూర్తిగా నశిస్తే... సభను కొద్దిసేపు వాయిదా వేస్తారు. అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే సభను మరుసటిరోజుకు వాయిదావేస్తారు. కానీ... గందరగోళానికి కారణమైన సభ్యులను మాత్రం సస్పెండ్ చేయరు! ఇది పార్లమెంటులో కొనసాగుతున్న ఓ సంప్రదాయం. రాష్ట్రాల అసెంబ్లీల్లో విపక్ష సభ్యులను సస్పెండ్ చేసి, మార్షల్స్‌ను రంగంలోకి దించి మరీ బయటికి ఈడ్చేయడం సర్వసాధారణమే. కానీ... లోక్‌సభలో, రాజ్యసభలో మాత్రం సస్పెన్షన్లు అసాధారణం. అందులోనూ... అధికార పార్టీకి చెందిన ఎంపీలనే సస్పెండ్ చేయడం అత్యంత అరుదు. బహుశా... ఇది ఆంధ్రప్రదేశ్ విభజన అంశంపైనే జరిగింది. గత ఏడాది తెలంగాణ ఎంపీలను సస్పెండ్ చేయగా.. సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడబోయి, విపక్షాల జోక్యంతో ఆగిపోయింది. 'లోక్‌సభలోగానీ, రాజ్యసభలోగానీ అధికార పార్టీ సభ్యులను సస్పెండ్ చేయడం చాలా ఏళ్లుగా లేనేలేదు. మాకు తెలిసి ఇలా జరగడం ఇదే మొదటిసారి' అని సీనియర్ రాజకీయ నాయకులు పేర్కొన్నారు. 2007 ఆగస్టు 15న లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న సోమనాథ్ ఛటర్జీకి ఇండియన్ ఫెడరల్ డెమొక్రటిక్ సభ్యుడు పీసీ థామస్ తీరుపై పీకలదాకా కోపం వచ్చినా... ఆయనను సస్పెండ్ చేయలేదు. 'సభ నుంచి వెళ్లిపోండి' అని ఆదేశించారు. స్పీకర్‌కు క్షమాపణ చెప్పకుండా, విచారణ వ్యక్తం చేయకుండానే థామస్ బయటికి వెళ్లిపోయారు.
ఈ ఘటన కూడా అప్పట్లో సంచలనం సృష్టించింది. రాజ్యసభలోనూ సస్పెన్షన్లు అరుదైన విషయమే. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ పెద్దల సభలో తీవ్రస్థాయిలో గందరగోళం సృష్టించిన ఆర్జేడీ, ఎల్జేపీ, సమాజ్‌వాదీ పార్టీలకు చెందిన 8మంది సభ్యులను 2010 మార్చి 9న సస్పెండ్ చేశారు. 'పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసేదాకా' సస్పెన్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అయితే... ఆతర్వాత కొన్నాళ్లకే సమాజ్‌వాదీకి చెందిన నలుగురు సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌తో సభా కార్యాకలాపాలకు అడ్డు తగులుతున్నారంటూ గత ఏడాది ఏప్రిల్ 24న 8 మంది టీ-కాంగ్రెస్ సభ్యులను నాలుగు రోజులపాటు సస్పెండ్ చేశారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పట్లో తీసుకున్న జాగ్రత్తలు ఈసారి తీసుకోకపోవడమే ప్రస్తుత గందరగోళానికి కారణం. కీలక సమయంలో సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుండటంతో తమ సభ్యులను సస్పెండ్ చేయాల్సి వస్తోందంటూ అప్పటి సభా నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ముందుగానే విపక్ష నేతలను కలిసి ఒప్పించారు. "మీ పార్టీ నేతల్ని మీరే అదుపులో పెట్టలేకపోతున్నారు'' అని సుష్మ అప్పట్లో రుసరుసలాడారు. ప్రణబ్ నచ్చచెప్పడంతో సస్పెన్షన్‌కు అంగీకరించారు. ఈసారి కమల్‌నాథ్ తీర్మానం ప్రవేశపెట్టగా... స్పీకర్ స్వయంగా అధ్యక్ష స్థానంలో ఉన్నారు. కానీ... అప్పుడు సహకరించిన విపక్షాలు, ఇప్పుడు మాత్రం 'చెయ్యి' ఇచ్చాయి.
లోక్ సభ స్పీకర్ 12 మంది సీమాంధ్ర ప్రాంత ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేశారు.
కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది
1 సాయిప్రతాప్
2 కనుమూరి బాపిరాజు
3 ఉండవల్లి అరుణ్ కుమార్
4 జీవీ హర్ష కుమార్
5 లగడపాటి రాజగోపాల్
6 మాగుంట శ్రీనివాసులు రెడ్డి
7 అనంత వెంకట్రామిరెడ్డి
8 సబ్బం హరి,
టీడీపీ నుంచి నాలుగురు
1 మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
2 నిమ్మల కిష్టప్ప
3 కొనకళ్ల నారాయణరావు
4 ఎన్. శివప్రసాద్
వీరిపై ఐదురోజుల పాటు సస్పెన్షన్ వేటు పడింది. లోక్‌సభ నిబంధన 374ఎ కింద ఉన్న విశేషాధికారం కింద స్పీకర్ ఈ 12 మంది సభ్యుల పేర్లు ప్రస్తావించారు. తాను పిలిచిన 12 మంది ఎంపీలు సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. 374ఎ నిబంధన స్పీకర్ ప్రస్తావించిన సభ్యులందరూ ఆటోమేటిగ్గా సభ నుంచి సస్పెండ్ అవుతారు. ఐదు వరుస సమావేశాలు గానీ, సమావేశాల్లో మిగిలిన భాగం గానీ.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది వీరికి వర్తిస్తుంది. అంతకుముందు సీమాంధ్ర ఎంపీల సమైక్య నినాదాలతో లోక్‌సభ ప్రారంభం కాగానే వాయిదా పడింది. సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ఎంపీలు సమైక్య నినాదాలతో హోరెత్తించారు. సభా కార్యకలాపాలను స్తంభింపజేశారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. అంతకు ముందు సభను సజావుగా నిర్వహించేలా తన ఛాంబర్లో స్పీకర్ మీరా కుమార్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం కూడా ఫలితమివ్వలేదు. సభలో పరిస్థితి మారలేదు. దీంతో సభ వాయిదా తర్వాత స్పీకర్ మరోమారు అన్ని పార్టీల నేతలతో సమావేశమయ్యారు. అయినా ఫలితం లేకపోవడంతో సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేసి, సభను శనివారం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి లేచి వెళ్లిపోయారు. ఎమైన తెలుగువాడికి అవమానం అనేది ఘోరంగా జరుగుతుందనేది అందరికి అర్థమవుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more