మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీలో వివాదాలు లేని ఫ్యామిలీగా ఉండటమే కాకుండా, మంచి పేరుతో పాటు స్టార్ డమ్ ని సంపాదించుకున్న మెగా ఫ్యామిలీ (చిరంజీవి కుటుంబం)కి ఈ మధ్య రోజులు అస్సలు బాగోలేనట్లు కనిపిస్తున్నాయి. ఇక కొందరు అయితే కావాలనే పనిగట్టుకొని ఆ ఫ్యామిలీ పై బుదరజల్లే ప్రయత్నాలు చేయడమే కాకుండా, చిన్న విషయాన్ని కూడా బూతద్దంలో పెట్టి పెద్దది చేసి చూపిస్తున్నారు. సినిమా రంగం నుండి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన చిరంజీవి నిదులు దుర్వినియోగం చేశాడంటూ ఆయన ఇంటిని మొన్నటికి మొన్న ఓయూ జేఏసీ ముట్టడించింది. అదలా ఉంటే, బంజారా హిల్స్ లో రామ్ చరణ్ సెక్యూరిటీ తో విద్యార్థుల పై దాడి చేయించారనే సంఘటనను మీడియా రచ్చ రచ్చ చేసింది. దానికి మీడియా సమావేశం పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సంఘటనలు మరచి పోకముందే పోయిన వీకెండ్ పార్టీలో అల్లు అరవింద్ కుమారులు అల్లు శిరీష్, అల్లు బాబీలు పబ్బులో మహిళ పై అసభ్యంగా ప్రవర్తించారని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. చివరికి అల్లు శిరీష్ కాదు, అల్లు బాబీ అని ఫైనల్ గా తేల్చేశారు. కానీ అక్కడ జరిగిన వాస్తవం ఏమిటో ఖచ్చితంగా తెలియదు. రామ్ చరణ్ సంఘటనలో కూడా అసలు వాస్తవాన్ని వక్రీకరించి రాశారని ఆ ఫ్యామిలీ వారు ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇక నిన్నటికి నిన్న ఏకంగా అల్లు అర్జున్ ఫ్యామిలీ మేటర్ లోనే తలదూర్చి పుకార్ల మీద పుకార్లు పుట్టించారు. హీరో అల్లు అర్జున్ వైవాహిక జీవితం సాఫీగా సాగడం లేదని, అల్లు అర్జున్ స్నేహాల మధ్య గత కొన్ని రోజులుగా పిల్లల విషయంలో గొడవ జరుగుతుందని , స్నేహ రెడ్డి ఇప్పుడు పిల్లలు కావాలని అప్పుడే పిల్లలు వద్దని అల్లు అర్జున్ అనడం అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి గత కొన్ని రోజుల నుండి వేరు వేరుగా ఉంటున్నారని ఓ మళయాళ పత్రిక ప్రచురించింది. దానిని పట్టుకొని మన తెలుగు వెబ్ సైట్లు పబ్లిసిటీ కోసం తెగ రాసేశారు. ఈ వార్తల పై తాజాగా అల్లు అర్జున్ స్పందించి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అల్లు అర్జున్ మాట్లాడుతూ... సాఫీగా సాగుతున్న మా వివాహ జీవితం పై వస్తున్న కామెంట్లు చూసి బాధేస్తుంది. ఇప్పటికి మేం అన్యోన్యంగా ఉంటున్నాం. సినిమా ఫ్యామిలీ నుండి వచ్చిన నాకు ఇలాంటి పుకార్లు వివి అవాటు అయిపోయాయి. కానీ కొత్తగా నా జీవితంలోకి వచ్చిన స్నేహా రెడ్డి గానీ, వారి ఫ్యామిలీ ఇలాంటి విని తట్టుకోలేదు అని అన్నాడు. అయినా సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి దూరిపోయి గాలి వార్తలు రాయడం సరికాదు. ఇలాంటి వార్తల పై పుంకాను పుంకాలుగా వార్తలు రాస్తూ పబ్లిసిటీ కోసం ఆరాటపడే వెబ్ మీడియా మెగా ఫ్యామిలీ పై బురద జల్లి, వారిని అభాసుపాలు చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. మరి ఇప్పటికైనా, ఇకపైనా నిజనిజాలు ఏంటో తెలుసుకొని వార్తలు రాస్తారని ఆశిద్దాం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more