ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్ గాంధీ యూపీఎ ప్రభుత్వాన్ని మూడోసారి అధికారంలోకి తీసుకురావడానికి ఇప్పటి నుండే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు ఉన్నాడు. 2014లో జరగబోయే ఎన్నికకలో మన రాష్ట్రం నుండి గెలిచే పార్లమెంటు స్థానాలే కీలకమని రాహుల్ గాంధీ భావించి ఇప్పటి నుండే గెలుపు గుర్రాల వేటలో పడ్డాడు. కర్నాటక శాసనసభకు జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని మట్టి కరిపించి మళ్ళీ అధికార పీఠమెక్కిన ఉత్సాహం ముప్పిరిగొన్న తరుణంలో పొరుగునే ఉన్న మన రాష్ట్రంపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. ఈ ఆలోచనలో భాగంగానే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ మిస్ర్తీని అధిష్టానం హైదరాబాద్‌కు పంపించి. గురు, శుక్రవారాలలో ఆయన ఇక్కడి కాంగ్రెస్ వర్గాలతో విస్తృతంగా చర్చలు జరపనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల పాటు గాంధీభవన్‌లో మకాం వేసి జిల్లాల వారీగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో సమావేశమవుతారు. ఈ సమావేశంలోనే లోక్‌సభ స్థానాలలో గెలిచే వారెవరో కూడా వారితో చర్చిస్తారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో భేటీ అనంతరం శుక్రవారం పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో మిస్త్రీ ప్రత్యేకంగా సమావేశమవుతారు. నియోజకవర్గాల వారీగా తనకు వచ్చిన నివేదికలను, డీసీసీ అధ్యక్షులు ఇచ్చిన సమాచారాన్ని పీసీసీ చీఫ్, సీఎంలతో సమీక్షిస్తారు. తర్వాత సమగ్ర నివేదికను రాహుల్‌గాంధీకి సమర్పిస్తారు.
సాధ్యమైనంత ముందుగానే అభ్యర్థుల ఎంపిక పూర్తి కావాలని రాహుల్‌గాంధీ చేసిన ప్రయత్నం కర్నాటకలో ఫలించటంతో అదే ప్రయోగాన్ని మన రాష్ట్రంలోనూ చే యాలని, దాన్ని ఇతర రాష్ట్రాలకు విస్తరింపజేయాలని కాం గ్రెస్ నాయకత్వం భావిస్తున్నదని తెలుస్తోంది. అభ్యర్థులను ముందుగానే ఎంపిక చేసి వారికి సమాచారం అందిస్తే క్షేత్ర స్థాయి నుంచి అందరినీ సమన్వయపరచుకొని ప్రచారం ప్రారంభించేందుకు అనువుగా ఉంటుందని, దానితోపాటు ఏవైనా పొరపొచ్చాలు ఉన్నా సర్దుబాట్లు చేసుకునేందుకు తగిన సమయం లభిస్తుందని రాహుల్‌గాంధీ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు నిర్ణీత సమయానికి జరిగినా, ఏవైనా అనుకోని పరిణామాలు తలె త్తి ముందుగానే జరపాల్సి వచ్చినా రెండింటికీ సిద్ధంగా ఉండాలన్నది రాహుల్ ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికి రాహుల్ గాంధీ తన మార్క్ రాజకీయ ప్రభావం రాష్ట్రం పై ఏ మేరకు పనిచేస్తుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more