సమాచార హక్కు చట్టం ప్రసాదించిన సర్వజనుల హక్కుని ఉపయోగించుకుని రాష్ట్రపతి, ప్రధానమంత్రిలాంటి అగ్ర నేతల ఖర్చులను అడిగి తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆయా కార్యాలయాలు తమంతట తామే ఆ ఖర్చులను వెల్లడి చెయ్యవలసిందిగా చేసిన సమాచారహక్కు ప్రధాన కమిషనర్ కోరిక మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ 2009 నుంచి తన తొమ్మిది సంవత్సరాల పాలనలో విదేశ పర్యటనల కోసం చేసిన ఖర్చుని వెల్లడి చేసింది. మొత్తం 67 సార్లు విదేశ పర్యటన చేయగా పాత లెక్కలలో కేవలం 65 పర్యటనల వివరాలు మాత్రమే లభించాయని, వాటి మొత్తం 642 కోట్ల రూపాయలని ప్రధానమంత్రిత్వ కార్యాలయం తెలియజేసింది. మిగతా రెండు పర్యటనల ఖర్చు లభించలేదు.
మనం చిన్నప్పటి నుంచి ఎన్ని కిలోల బియ్యం తిన్నామన్నది లెక్కపెట్టుకుంటే కూడా గుండెలు బాదుకోవలసిందే. అయితే లెక్కలు, జవాబుదారీతనం అనేది ప్రభుత్వంలో ఉండాలి కాబట్టి ఇలాంటి లెక్కలను బహిర్గతం చెయ్యటం అవసరమే.
ఆసక్తికరంగా చాలా మంది మర్చిపోయిన ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్పేయ్ వ్యవహారాలు ఈ మధ్య వేదిక మీదకు వచ్చాయి. మొరాదాబాద్ కి చెందిన ఒక వ్యక్తి సమాచార హక్కు శాఖను అడిగిన వివరాలలో వాజ్ పాయ్ మీద ప్రభుత్వం పెట్టిన వైద్య ఖర్చుల వివరాలు తెలియజేయవలసిందిగా చేసిన అభ్యర్థన ఉంది. ఆయన 1999 నుంచి 2004 వరకు ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఆయన మోకాలుకి పలుమార్లు శస్త్ర చికిత్స జరిగింది.
ఇవి చూస్తుంటే మన రాష్ట్రంలో కేంద్ర మంత్రి చిరంజీవి పర్యటన శాఖకోసం చేసిన ఖర్చు మీద ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు చిరంజీవి నివాసం దగ్గర చేసిన ఆందోళన కూడా గుర్తుకొస్తుంది. కొన్ని ఖర్చుల ఫలితాలు వెనువెంటనే చూసేటట్టుగా ఉండవు. పెద్ద పెద్ద కంపెనీలలో రిసెర్చ్ మీద ఎంతో ఖర్చు పెట్టటం జరుగుతుంది. ఆ ఖర్చు మీద ఫలితం వెంటనే కనపడాలంటే కనపడదు. ఒక్కోసారి ఎలాంటి ఫలితమూ ఉండకపోవచ్చు కూడా. పరిశోధన అంటేనే అలాంటిది. ఒక రోజులోనూ ఫలితం రావొచ్చు, ఏళ్ళ తరబడి రాకపోవచ్చు. అదేవిధంగా, అభివృద్ధి పథకాల మీద ఖర్చు వెంటనే మనకు అక్కడ కనిపించేయాలంటే అది సంభవం కాదు.
అటల్ బిహారీ వాజ్ పేయ్ పేరు జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా ఈ మధ్య బయటపెట్టింది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం మీద జరిగిన చర్చలో జెపిసి, వాజ్ పేయ్ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల వలనే టెలికాం శాఖ నష్టాలను కొనితెచ్చిందంటూ వ్యాఖ్యానించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more