Lava kusa movie completed 50 years

lava kusa telugu movie, n t rama rao, anjali devi, nagaiah, kantarao, relangi, ghantasala, susheela singer, leela singer

lava kusa movie completed 50 years

lava-kusa-movie.png

Posted: 03/29/2013 12:28 PM IST
Lava kusa movie completed 50 years

lava-kusa-poster2

లవకుశకు 50 సంవత్సరాలు. రాముడంటే ఇలాగే ఉండి వుండాలనే భావన కల్పించిన ఎన్ టి రామారావు, సీతా సాధ్వి అన్న పేరుకి తగ్గట్టుగా ఉన్న అంజలీ దేవి నటనలకు సాటి ఉండదు అనేటట్టుగా పోటీలు పడి నటించి, 48 సంవత్సరాల వరకూ మళ్ళీ అటువంటి కథతో సినిమా తీసే సాహసం ఎవరూ చెయ్యలేనంత గరిష్ట స్థాయిలో నిర్మించిన చిత్రం లవకుశ. అందులోని సందర్భోచితమైన పాటలు, సంగీతం, తెలుగువారి మనసుల్లో గట్టి ముద్ర వేసుకుని ఉండిపోయాయి. లక్ష్మణుడిగా కాంతారావు, వాల్మీకి గా చిత్తూరు నాగయ్య, కధ మలుపు తిరగటానికి కారణమైన చాకలి దంపతులుగా రేలంగి, గిరిజలు చక్కటి సహకారం అందించారు. ఇక కుశలవులుగా వేసిన నాగరాజు,

nt-ramarao

lava-kusa-actors1958 లో శివజ్యోతి పతాకం కింద ఉత్తర రామాయణ కథతో తీసిన మొదటి చిత్రం లవకుశ. అందుకే శ్రీరామ పట్టాభిషేకంతో మొదలవుతుందీ కథ. తెలుగులో పూర్తి నిడివి కలర్ చిత్రం గా తీయటానికి పూనుకున్న చిత్రం కూడా ఇదే. అప్పటికే హిందీలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంతరించిపోయాయి. కానీ తెలుగులో అప్పటివరకూ కలర్ లో తీసే సాహసం వేరెవరూ చెయ్యలేదు. ముఖ్యంగా నీలమేఘశ్యాముడైన రాముడిని నీలం రంగులో చూడటం అదే మొదటిసారి.

c-pullyya-directorనిర్మాత ఎ.శంకరరెడ్డి తొలి సినిమా ఇది. దర్శకుడు సి.పుల్లయ్య ఆరోగ్యం బాగోలేక మధ్యమధ్య సిఎస్ రావు కొన్ని దృశ్యాల చిత్రీకరణకు దర్శకత్వం వహించారు. కానీ కంటిన్యూటీలో తేడా ఎక్కడా కనిపించకుండా చేసారు. డబ్బు వలన కూడా నిర్మాణంలో జాప్యం జరిగింది. నిర్మాణంలో ఎంత ఆలస్యం జరిగిందంటే, లవకుశలు గా వేసిన నాగరాజు సుబ్రహ్మణ్యంలు పెద్దవాళ్ళయిపోయారు. కొన్ని దృశ్యాలలో వాళ్ళకి గడ్డాలు గీసి తీసుకొచ్చారంటూ విమర్శనలు వచ్చాయి. తమిళంలో కూడా అదే సమయంలో తీసారు అందులో కుశుడుగా ఆడపిల్లను తీసుకుంటే, ఆ అమ్మాయికి పులితోలు కప్పవలసి వచ్చింది. సినిమా కథా క్రమంలో చిత్రీకరణ జరగదు కాబట్టి కొన్ని దృశ్యాలలో లవకుశలు చిన్నగా కొన్నిట్లో పెద్దగా కనిపించారు. మొదటిసారిగా వాడిన గేవా కలర్ లో సాంకేతిక లోపాలు కూడా బాగా కనిపించాయి. కానీ ఇవేమీ తెలుగు వారి ఆదరణను తగ్గించలేదు. చిత్రం ఒక్కో థియేటర్లో లెక్కలేనన్ని సార్లు లెక్కలేనన్ని రోజులు ఆడింది. మహిళా ఆదరణ చాలా ఎక్కువగా లభించింది. వారిచేత కంట తడి పెట్టించింది.

ghantasalaసంగీతం విషయానికొస్తే ఘంటసాల అద్బుతమైన సంగీతాన్నందించారు. లీల, సుశీలలు లవకుశలకు పాడిన పాటలు అజామరమైనవి. పాటల రికార్డింగ్ లో చాలా కష్టపడి ఎన్నో రిహార్సల్స్ చేసి ఫైనల్ చేసారు. ఇరవై పద్యాలు, పదహారు పాటలను అత్యంత రమణీయంగా సందర్భోచితంగా, శ్రవణానందం కలిగేవిధంగా సంగీతాన్ని సమకూరుస్తూ తాను కూడా ఒక నేపథ్య గాయకుడై చిత్రానికి ప్రాణం పోసిన ప్రధానాంశాలల ఘంటసాల సంగీతం ఒకటి.

lava-kusa-poster

చిత్ర నిర్మాణంలో అన్ని విభాగాల్లోనూ అన్నివిధాలుగా శ్రమకోర్చి నిర్మాణంలో చాలా ఎక్కువ ఆలస్యమౌతున్నా సహకరిస్తూ ప్రతి ఒక్కరూ తమవంతు సహకారాన్ని అందజేస్తూ లవకుశను దృశ్యకావ్యంగా మలచారు. అందుకే ఇన్నాళ్ళయినా- 50 సంవత్సరాలు నిండిన సందర్భంలో ఇవన్నీ గుర్తు తెచ్చుకుని ఆ మధుర భావనలో కాసేపు గడపటానికి రాయటమే కానీ- ఎవరూ మర్చిపోలేని, కలకాలం గుర్తుండే బహు కొద్ది చిత్రాల జాబితాలో చేరిపోయిన చిత్రం లవకుశ.

 

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunny leone charges rs 15 crore to promote energy drink
Nokia gets interim stay on it notice for tax evasion  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more