Nokia gets interim stay on it notice for tax evasion

nokia, finland, bilateral tax agreement, high court of delhi, income tax dept, tax evasion by nokia

nokia gets interim stay on it notice for tax evasion

nokia-tax-evasion.png

Posted: 03/28/2013 05:23 PM IST
Nokia gets interim stay on it notice for tax evasion

nokia-chennai

2000 కోట్ల టాక్స్ బాకీ ఉందని , ఒక వారంలోగా ఆ మొత్తాన్ని కట్టమని ఆదాయ పన్ను శాఖ నోకియా కంపెనీకి మార్చి 21 న ఇచ్చిన నోటీసుని సవాల్ చేస్తూ నోకియా కంపెనీ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చెయ్యగా హైకోర్ట్ ఇంటరిమ్ స్టే ఇచ్చింది.

వ్యాపారానికి సంబంధించి అన్ని నియమాలనూ పాటిస్తున్నామని నోకియా చెప్తోంది. ఫిన్ ల్యాండ్ కి చెందిన నోకియా సంస్థ, తాము స్థానిక వ్యాపార నియమాలను, రెండు దేశాల మధ్య ఉన్న పన్ను ఒప్పందాలను పూర్తిగా అనుసరిస్తూ నడుచుకుంటున్నామని కోర్టులో వాదించింది.

నోకియా వేసిన రిట్ మీద విచారణ చేసిన ఢిల్లీ హైకోర్టు ఇంటరిమ్ స్టే ఇవ్వటమే కాకుండా, నోకియా ప్రకటిస్తున్నదానికి ప్రతివాదనను అఫిడవిట్ గా ఇవ్వమని ఆదాయ పన్ను శాఖను ఆదేశించింది. ఆదాయపన్ను శాఖకు అలా పన్ను కట్టటానికి గడువుని నిర్దేశించే అధికారాలున్నాయని, దాని ప్రకారమే నోటీసు ఇవ్వటం జరిగిందని ఆ శాఖ అంటోంది.

ఇంతకీ ఆదాయపన్ను శాఖ అడుగుతున్న సొమ్ము టిడిఎస్ కి చెందినది.   చెన్నై లో స్థాపించిన నోకియా సాఫ్ట్ వేర్ వాడుతున్నందుకుగాను తన పేరెంట్ కంపెనీకి కట్టే రాయల్టీ మీద 10 శాతం టాక్స్ తీసివేసి దాన్ని ఆదాయపన్ను శాఖకు కట్టవలసివుంది. అది కట్టటం లేదని ఆదాయ పన్ను శాఖ వాదన. దీనికోసం ఆ శాఖ అధికారులు జనవరిలోనే దర్యాప్తు చేసి నోకియా కార్యాలయంలో దానికి సంబంధించిన పరిశీలనలు చేసారని, పన్ను ఎగవేతను పరిశీలించిన తర్వాతనే నోటీసులిచ్చారని చెప్పారు.

-శ్రీజ

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lava kusa movie completed 50 years
Mulayam expects early polls and third front win  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more