ఒకరిని ఒకరు నమ్మకపోవటం, ఎదుటివారిని సాధ్యమైనంత దిగజార్చి మాట్లాడటం, భాషా పరిఙానాన్ని పూర్తిగ ఉపయోగించి వ్యాఖ్యలు చెయ్యటం, పిట్ట కథలు సామెతలను ఉపయోగించటం, తద్వారా వార్తలలోకి ఎక్కటం- ఇదీ నేటి రాజకీయ రంగంలో నాయకులు పాటిస్తున్న ధోరణి. మూడు స్తంభాల ఆట ఇలా ఉంది-
వైయస్ ఆర్ కాంగ్రెస్, తెలంగాణా రాష్ట్ర సమితి కుమ్మక్కయ్యారని కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ విమర్శిస్తాయి.
కాంగ్రెస్, వైయస్ ఆర్ కాంగ్రెస్ ల మధ్య లోపాయికారి ఒప్పందాలు జరిగాయంటుంది తెలుగు దేశం పార్టీ.
తెలుగు దేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తోంది అంటోంది తెరాస.
సందర్భం ఏదైనా, స్థలం ఏదైనా, సమయం ఎలాంటిదైనా, చెప్పే ప్రతి మాటలోనూ, చేసే ప్రతి పనిలోనూ రాజకీయ లబ్ధి ఉండటం నాయకులకు ముఖ్యమైపోయింది కాబట్టి,
వైకాపా, తెరాసా కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీని పడగొట్టాలని చూస్తున్నాయి కానీ అది సాధ్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్న మహబూబ్ నగర్ జిల్లా మండపల్లిలో జరిగిన రెవిన్యూ సదస్సులో అన్నారు. ఐదు సంవత్సరాల కోసం ప్రజలు పట్టంగడితే దాన్ని మధ్యలో కూల్చివేద్దామనుకోవటం అధర్మం అంటూ, ఉదాహరణగా శనగ పంటను మూడునెలల్లో తీసేస్తే కాయలు వస్తాయా రావు కదా అన్నారాయన. (శనగ పంటను ముందుగానే తీస్తే రాదు నిజమే కానీ అసలు పాతుకోలేదు అని తెలిసి కూడా పంటకి కావలసిన నీరు అందించి ఎరువులు వేస్తారా ఎవరైనా)
2014 ఎన్నికల తర్వాత వైకాప కాంగ్రెస్ కి మద్దతిస్తుందని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఒక ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో అనటంతో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ల మధ్య జరిగిన చీకటి ఒప్పందం బట్టబయలైందని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత కిమిడి కళా వెంకటరావు నిన్న శ్రీకాకుళం జిల్లా రామయ్యపుట్టుగలో అన్నారు. (నిజంగానే చీకటి ఒప్పందం జరిగితే దాన్ని ఇంకా దాయవద్దని ఎవరైనా చెప్పారా విజయలక్ష్మికి)
నిన్న వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో రెవిన్యూ సదస్సుని ప్రారంభించిన రాష్ట్ర ఉద్యాన శాఖ మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి తెలంగాణా రాష్ట్ర సమితిని ఒక తోక పార్టీగా అభివర్ణించారు. 15 మంది సభ్యులతో అవిశ్వాసానికి ఒడిగట్టటం హాస్యాస్పదమని ఆయన అన్నారు. (అవిశ్వాస తీర్మానంలో నెగ్గలేరనుకుంటే మరి దానిగురించి మాట్లాడటమెందుకో. వాళ్ళ మీద జాలి చూపిస్తున్నట్టా)
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా తెదేపా కాపుకాస్తోందని, కంటికి రెప్పలా కాపాడుతున్నదని నిన్న తెరాస నాయకుడు హరీష్ రావు అన్నారు. పదివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ప్రజలు చంద్రబాబుని నమ్మే స్థితిలో లేరన్నారాయన. (ప్రజలు నమ్మరు, ప్రజలు తిరగబడతారు, ప్రజలు ఊరుకోరు ఇవన్నీ నిజంగా నిజమని నమ్మిన వాళ్ళు ఆ వ్యాఖ్యలు చెయ్యరు. అవన్నీ ప్రజలు ఇలా చెయ్యాలి సుమా అని చేసే సూచనలు- సజెషన్స్)
నిన్న పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో బహిరంగ సభలో మాట్లాడుతూ, వైకాపా తెరాసాలు తమ లబ్ధి కోసమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాయని చంద్రబాబు నాయుడు అన్నారు. అది కేవలం బ్లాక్ మెయిల్ చర్యలని, జగన్ కి బెయిల్ కోసం బేరాలు ఆడటానికి, తెరాస ప్యాకేజ్ లు మాట్లాడుకోవటం కోసమే అవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనంలో కాదని చంద్రబాబు అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా తో చర్చించకుండా వాళ్లంత వాళ్ళే తీసుకున్న నిర్ణయమది అని కూడా చంద్రబాబు నిరసించారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more