మహిళల మీద అత్యాచారాలను అరికట్టటానికి రూపుదిద్దుకుంటున్న చట్టంలో ఏకాభిప్రాయం కుదరక పోవటంతో మంత్రుల బృందానికి ఇంకా లోతైన అధ్యయనం కోసం ఇవ్వబడింది. మంత్రివర్గ సమావేశంలో గంటసేపు చర్చించినా అభిప్రాయాలు భిన్నంగా ఉండటంతో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దాని మీద అధ్యయనం చేసి నివేదికను ఇవ్వటం కోసం మంత్రుల బృందానికి అప్పగించారు. బిల్లుని ప్రవేశపెట్టటానికి మంత్రి వర్గమంతా ఒప్పుకుంటున్నా కొన్ని అంశాలలో ఏకాభిప్రాయానికి రాకపోవటం వలనే మంత్రుల బృందానికి దాన్ని పంపుతున్నారు.
మంత్రుల బృందంలో ఆర్థిక మంత్రి చిదంబరం, మహిళలు బాలికల సంక్షేమ మంత్రి కృష్ణ తీర్థ్, న్యాయశాఖా మంత్రి అశ్వనీ కుమార్, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, టెలికాం మంత్రి కపిల్ సిబాల్ ఉంటారు.
ఏకాభిప్రాయానికి రాని అంశాలలో ఉన్నవి ఇవి-
లైంగిక సంపర్కానికి అంగీకరించటానికి ప్రస్తుతమున్న 18 సంవత్సరాల కనిష్ట వయసుని 16 కి తగ్గించాలని ఉన్న ప్రతిపాదనను బాలికలు, మహిళల సంక్షేమ మంత్రి అంగీకరించలేదు. చట్టబద్దంగా అంగీకారానికి ఉన్న కనిష్ట వయసు కంటే తక్కువ వయసులో జరిగితే అది అత్యాచారం కిందికే వస్తుంది. మానభంగం (రేప్) అని వాడే పదంలో లింగ వివక్ష కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది కాబట్టి దానిబదులు లైంగిక అత్యాచారం (సెక్సువల్ అసాల్ట్) అని వాడితే అది ఏ లింగ భేదం లేకుండా ఉంటుందని కొందరు సీనియర్ మంత్రులు అభిప్రాయపడ్డారు.
వోయురిజ్మ్, స్టాకింగ్ అనేవాటిని ఈ నేరాల కిందికి పరిగణించటానికి వాటిని ఏ విధంగా నిర్వచిస్తారు అని కొందరు మంత్రులు ప్రశ్నించారు. వాయురిజ్మ్ అంటే తొంగిచూసే లక్షణం. కిటికీ లోంచి కానీ వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక కోణంలో మరొకరి వస్తువులను పరిశీలనగా చూడటం. దీనివలన నిజానికి ఆస్తిపాస్తుల విషయంలో నష్టమనేది ఉండదు. కానీ మర్మంగా ఉంచుకునే హక్కున్న ప్రదేశాలను (శరీర భాగాలను) ఇతరులు దొంగతనంగా చూడటం కూడా అపరాధమే. అయితే వోయురిజ్మ్ అనేది స్టాకింగ్ లోకి పరిణమించే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటివి జరగకుండా చూసుకోమంటారు. స్టాకింగ్ లో ఒకడుగు ముందుకేసి ప్రైవేట్ ప్రదేశాలలోకి చొరబడటం ఉంటుంది. ఈ రెండిటినీ అత్యాచార నిరోధక చట్టంలో ప్రస్తావించేటప్పుడు వాటి అర్థం స్పష్టంగా ఉండాలని సరిగ్గా నిర్వచించాలని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు.
అత్యాచార నేరాల్లో దొంగ సాక్ష్యాలు, సృష్టించిన ఆధారాల విషయంలో జాగ్రత్తలు తీసుకునే విషయంలో కూడా మంత్రుల మధ్య సయోధ్య కుదరలేదు.
ఈ బిల్లులో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, అత్యాచారంలో బాధితులు మరణించిన సందర్భంలో లేదా వాళ్ళు అచేతనంగా పడివుండే సందర్భంలో అది కూడా మరణ శిక్షకు అర్హమౌతుంది. అందులో కనీసం శిక్ష 20 సంవత్సరాల కారాగార వాసం. ఆ పరిమితి జీవిత కాలం వరకూ పొడిగించే వెసులుబాటుంది.
ఈ వారంలో పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్న ఈ బిల్లుని పార్లమెంటు స్వీకరించి, ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర పడిన దగ్గర్నుంచీ అమలులోకి వస్తుంది.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more