ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టి పది సంవత్సరాల నుండి గులాబి కారును రాష్ట్రంలో నడుపుతున్న కేసిఆర్ కు తెలంగాణ ప్రాంతంలోనే బ్రేకులు పడ్డాయి. పది సంవత్సరాలు కారుకి ఎలాంటి ఆటకం లేకుండా తిప్పిన కారు డ్రైవర్ కేసిఆర్ కు సడన్ బ్రేకులు పడ్డాయి. ఏ ప్రాంతం పేరు చెప్పి ఇన్ని రోజులు దర్జగా కారులో తిరుగుతున్న కేసిఆర్ కు. కొత్త కార్లతో షాక్ తిన్నారు. తెరపైకి కొత్త గులాబి కారులు వస్తున్నాయి. టీడీపీ నుండి బయటకు వెళ్లి స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసిన ఎమ్మెల్యేగా గెలిచిన నాగం జనార్థన్ రెడ్డి తెలంగాణలో కొత్త కారు తిప్పటానికి సిద్దమయ్యినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ కి పోటీగా నాగం జనార్థన్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగం రాకతో.. కేసిఆర్ కారుకి గాలి తీసే మేకు అవుతుందని తెలంగాణ ప్రాంత నాయకులు అంటున్నారు. పుబ్బలో పుట్టి మఖలో మాయం అయ్యే పార్టీలు చాలానే వచ్చినా.. తెలంగాణపై పుట్టిన పార్టీలు సెంటిమెంటును ఎంతోకొంత ప్రభావితం చేయలేదా ? ఇవీ ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ. పొలిటికల్ జేఏసీ లోకి నాగం ను తీసుకోక పోవడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలోనే నాగం కూడా జాక్ పోకడలపై తీవ్ర అసంత్రుప్తి చేశారు. తెలంగాణను తెచ్చేవాళ్లా వీళ్లు? మరి ఇంత నియంత్రుత్వ పోకడలు పోతే తెలంగాణను ఎలా తేగలరు ? అని ఆయన నిలదీశారు. మొత్తం మీద గత కొద్ది రోజులుగా కేసిఆర్, నాగం , ఉప్పు , నిప్పులా ఫైర్ అవుతూ వస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు మాటల తూటాలు విసురుకుంటున్నారు. విద్యార్థులను కొట్టిన వరదారెడ్డికి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ టిక్కెట్ ఎలా ఇస్తారు? తెలంగాణ ఉద్యమంలో ఇంకా ఎవరూలేరా? అంటూ వరదా రెడ్డి అభ్యర్థిత్వంపై నాగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం తెలిసిందే. ఇదే సమయంలో కేసిఆర్ పై కొత్త విమర్శలు వచ్చాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిక్కెట్లు కేసిఆర్ అమ్ముకున్నారంటూ అంటూ ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జెల కాంతం సైతం కేసిఆర్ పై తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసిఆర్ సీట్లను అమ్ముకున్నారని తెలంగాణ రావడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేదని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్ గజ్జెల కాంతం ఆరోపించారు. 2014 ఎన్నికల్లో కేసిఆర్ భవిష్యత్తును తెలంగాణ ప్రజలే నిర్ణయిస్తారని అంటూ ఆయన కరాఖండిగా చెప్పారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే కేసిఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారని ... ఇలా అయితే తెలంగాణ ఎలా వస్తుందని గజ్జెల కాంతం వ్యాఖ్యంచారు, తెలంగాణ నగారా సమితి అధినేత నాగం జనార్థన రెడ్డి టీఆర్ ఎస్ అధినేత కేసిఆర్ పై ఫైర్ అయ్యారు. హస్తినా పురంలోని ఓ టీఆర్ఎస్ నాయకుడిని పార్టీ నుండి సస్సెండ్ చేయడంతో ఆయనను నాగం జనార్థన రెడ్డి పరామర్శించారు. రాష్ట్ర సాధన కోసం పని చేసే వారిని కలుపుకు పోవటంలో కేసిఆర్ తీరును తప్పుబట్టారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీని కేసిఆర్ నీరు గారుస్తున్నారు. త్వరలో కొత్త తెలంగాణ పార్టీని స్థాపించబోతున్నానని నాగం ప్రకటన చేశారు. అయితే తెలంగాణ లో కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త మరో పార్టీ అంటే తెలంగాణ ప్రజలు ఎలా ఆదరిస్తారో చూడాలి. నాగం పార్టీతో కేసిఆర్ కారు టైర్ కు గాలి తగ్గిపోతుందని రాజకీయ మేథావులు అంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలోని నాయకులు కొత్త కారు ఎక్కడానికి సిద్దంగా ఉన్నట్లు రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. గులాబి కారుకి నాగం ఒక మేకులా మారినట్లు గులాబి నేతలు చెవులు కొరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more