ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఓటర్లు చాలా తెలివైన వారని, కాంగ్రెస్ పార్టీ వైపువారిని ఆకర్షించుకోవడానికి ప్రయత్నించాలని సూచించారు. బూత్ కమిటీలు సక్రమంగా పనిచేయడం ఎన్నికల్లో కీలకమన్నారు. ప్రస్తుత ఉప ఎన్నికల్లో ప్రతీ ఓటూ కీలకమేనని, ఒక ఇంట్లో ఒక ఓటరును మనవైపు తిప్పుకోగలిగితే కుటుంబంలోని ఓట్లన్నీ మనకే పడతాయని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్లడానికి ముందు నరసాపురంలో నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఓటర్లు స్థానికంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని బూత్ కమిటీలు పరిశీలించుకోవాలని సూచించారు.
మే 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉన్నందున అప్పటికే బూత్‌కమిటీలు ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేసి నివేదికను తయారుచేసుకోవాలని సూచించారు. ప్రతీ బూత్ కమిటీకి పదిమంది ఉండాలని, వీరు ఎన్నికల కోసం అహర్నిశలు పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఎవరు, ఇతర పార్టీల ఓటర్లు ఎవరు, తటస్థంగా ఉండే ఓటర్లు ఎవరో గుర్తించి వారిలో కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గు చూపేవారిని మన ఓటర్లుగా మార్చుకోవాలన్నారు. ఒక కుటుంబంలో ఒక ఓటరును కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకునేలా చేసుకుని, తద్వారా ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఓటేసేలా చూడాలన్నారు. దీనివల్ల ఒక్క ఓటు వంద ఓట్లుగా మారుతుందని, ఆ వందల ఓట్లు వేల ఓట్లుగా పెరుగుతాయని చెప్పారు. ప్రతీ కుటుంబం వద్దకూ వెళ్ళి ఐదునుంచి పది నిమిషాలపాటు వారితో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించాలన్నారు. అలాగే ఓటర్లకు ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించే సత్తా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఉందని వారికి వివరించాలని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more