అనంతపురం జిల్లా డీ హీరేహాళ్ మండలం గొడిశలపల్లిలో ఉప ఎన్నికల ప్రచారం చేస్తున్న జగన్‌ను చూసేందుకు వచ్చిన ఒక యువకుణ్ని గొడ్డును బాదినట్లు బాదారు. అయితే జగన్ మాత్రం అసలు విషయాన్ని దాచిపెట్టి పోలీసుల పైకి నెపం నెట్టడంతో.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ వెంట ఉండే ప్రైవేటు గూండాలు వీరంగం సృష్టించారు. జగన్ పర్యటన సందర్భంగా జనబలం చూపాలనే ఉద్దేశంతో ఆ పార్టీ నాయకులు కొందరిని కిరాయికి తరలించారు. ఒక యువకుడు జగన్ కాన్వాయ్ వైపు వెళ్తుండగా.. ఆయన వ్యక్తిగత గూండాలు అడ్డుకున్నారు.
దీంతో ఆ యువకుడికి, వారికి మధ్య వాగ్వాదం జరిగి.. అది పెరిగి, వారు ఆ యువకుణ్ణి చితక బాదారు. జగన్ పర్యటనలో ఏఆర్ పోలీసులు కూడా ఉన్నారు. కొట్టింది వారే అనుకుని స్థానికుల్లో కొందరు పోలీసులపై దాడి చేశారు. తమను ఎందుకు కొడుతున్నారో ఆ కానిస్టేబుళ్లకు అర్థం కాలేదు. చివరికి విషయం తెలుసుకుని ఆ యువకుణ్ణి కొట్టింది తాము కాదని, జగన్ వ్యక్తిగత బాడీగార్డులని చెప్పినా వారు వినిపించుకోలేదు. పోలీసు వాహనాలకు, జగన్ కాన్వాయ్‌కి అడ్డం నిలిచారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే సమయంలో జగన్ మాట్లాడుతూ 'ఇది పోలీసుల పని.. వారి తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను' అని ప్రకటించడంతో విస్తుపోవడం పోలీసుల పనయింది. జగన్‌కు బందోబస్తుగా ఉంటూ నానా అవస్థలూ పడుతోంటే తమ మీదే నిందలు మోపడమేంటని పలువురు పోలీసులు బహిరంగంగా జగన్‌ను ప్రశ్నించారు. చివరికి జగన్ ప్రచార రథం ఆ ఊరి నుంచి బయటికి వెళ్లిపోయింది. కానీ, ఆయన కాన్వాయ్‌లో ఇతర వాహనాలను ప్రజలు వెళ్లనివ్వకుండా గ్రామం చివర్లో ఎడ్లబండిని అడ్డంగా పెట్టారు. పోలీసులు వచ్చి గ్రామస్తులను బతిమాలి జగన్ కాన్వాయ్‌ని పంపించారు
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more