ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలెదుర్కొంటున్న సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ కెజి బాలకృష్ణన్‌పై విచారణ జరిపారా? లేదా?, ఈ ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అని సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై నెల రోజుల్లోగా స్పందన తెలియజేయాలని ఆదేశించింది.
2004-2009 మధ్య కాలంలో కెజి బాలకృష్ణన్ తన బంధువుల పేర్లతో రూ. 40 కోట్ల ఆస్తులు కూడబెట్టారని, ఆయనపై విచారణకు ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేయాలంటూ కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఈ విషయమై సదరు సంస్థ పది నెలల క్రితమే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా నేటికీ చర్యలు తీసుకోకపోవడంపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ఎస్‌హెచ్ కపాడియా నేతృత్వంలోని ధర్మాసనం నెల రోజుల్లోగా స్పందన తెలపాలని అటార్నీ జనరల్ జిఇ వాహనవతిని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై అన్ని సంబంధిత ప్రభుత్వ అథారిటీలకు లేఖలు రాస్తానని వాహనవతి ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు.
బాలకృష్ణన్ తీవ్రమైన అనుచిత ప్రవర్తనకు పాల్పడినట్లు చాలా ఆధారాలున్నా, మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ పదవి నుంచి ఆయన్ని తొలగించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదని పిటిషనర్ ఆరోపించారు. బాలకృష్ణన్ బినామీ ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలను కూడా పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. మానవ హక్కుల చట్టం కింద జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ లేదా సభ్యులను తొలగించాలంటే, ఈ అంశాన్ని సుప్రీం కోర్టుకు రాష్ట్రపతి రిఫర్ చేస్తారు. దీనిపై సుప్రీం కోర్టు చేసే ప్రతిపాదనను బట్టి రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more