టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ నా వద్ద పని చేసి వెళ్లాడు, కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రితో, నాదెండ్ల మనోహర్ తండ్రితో ఫైట్ చేశాను అంటూ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పాత విషయాలను తవ్వితీశారు. టిడిఎల్‌పి కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యక్తులు ముఖ్యం కాదని, రాజకీయ అంశాలు ముఖ్యం అంటూ వ్యాఖ్యానించారు. టిడిపి నాయకులకు సమైక్యాంధ్ర, తెలంగాణ ప్ల కార్డులను చంద్రబాబు నాయుడే పంపిణీ చేస్తున్నారని టిఆర్‌ఎస్ విమర్శించిందని ఒక విలేఖరి ప్రస్తావించగా, నేను టిఆర్‌ఎస్ గురించి కూడా మాట్లాడాలా? అని ఎద్దేవా చేశారు. టిఆర్‌ఎస్ నాయకులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నారని, తమపై మాత్రం రాళ్లు వేయిస్తున్నారని ఆరోపించారు. అయితే గత అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ అంశం కీలకంగా ఉంటే, ఈసారి లేదని తెలిపారు. దీంతో తెలంగాణ అంశం మరుగున పడిందా? అని ఒక విలేఖరి ప్రశ్నించగా, తన ఉద్దేశం అది కాదని సర్దుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్‌రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more