11-year-old alleges rape by 2 seniors in school పాఠశాల విద్యార్థినిపై దారుణం.. సీనియర్ విద్యార్థుల అఘాయిత్యం

11 yr old girl allegedly gang raped by seniors inside kendriya vidyalaya washroom

girl rape in Kendriya Vidyalaya, girl rape in Kendriya Vidyalaya school, girl rape in Kendriya Vidyalaya delhi, girl rape in Kendriya Vidyalaya, student molested in washroom, minor girl student raped in school washroom, Delhi Gangrape, Delhi KV Gangrape, Delhi Rape Case, Delhi Gangrape News, School Student gangraped, Delhi Gangrape, Delhi KV Student, Minor Student, Teacher, Senior Students, Expelled, Delhi Police, Delhi commission for Women, Swati Maliwal, Crime

After mistakenly bumping into two school seniors, an 11-year-old girl paid the unthinkable price. She was allegedly raped inside the school washroom. The incident took place at Kendriya Vidyalaya in the national capital, following which a case has been registered, police said. The incident occurred in July, but the victim approached the police on Tuesday only after the Delhi Commission for Women (DCW) highlighted the matter.

పాఠశాల విద్యార్థినిపై దారుణం.. సీనియర్ విద్యార్థుల అఘాయిత్యం

Posted: 10/07/2022 01:34 PM IST
11 yr old girl allegedly gang raped by seniors inside kendriya vidyalaya washroom

దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న మైనర్ బాలికపై అదే పాఠశాలకు చెందిన ఇద్దరు సీనియర్ విద్యార్థులు పాఠశాల వాష్ రూమ్ లోనే అమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. 11 ఏళ్ల బాలికపై 12వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జులైలో జరిగిన ఈ ఘటనపై తాజాగా ఢిల్లీ మహిళా కమీషన్ నోటీసులు జారీ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయడంతో ఒక్కసారిగా  కలకలం రేపుతోంది.

కాగా తనపై జరిగిన అఘాయిత్యంపై బాధిత బాలిక అదే రోజు తన క్లాసు టీచరుకు చెప్పినప్పటికీ దానిని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంతో పాటు విషయాన్ని బయట వ్యక్తులకు చెప్పకూడదని వారించింది. బాధిత విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు విద్యార్థులను పాఠశాల నుంచి బహిష్కరించామని.. విషయం బయటకు తెలిస్తే వారు కూడా వచ్చి అల్లరి చేస్తారని హెచ్చరించింది. దీంతో బాలికపై అత్యాచారం జిరిగిన విషయం ఇన్నాళ్లు మరుగున పడిపోయింది. తాజాగా, బాలిక తల్లిదండ్రులు మహిళా కమీషన్ ను ఆశ్రయించిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్రీయ విద్యాలయం యాజమాన్యానికి నోటీసులు జారీచేసింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. జూలై నెలలో బాలిక తన క్లాస్ రూములోకి వెళ్తుండగా పొరపాటున ఇద్దరు సీనియర్లను ఢీకొట్టింది. వెంటనే ఆ చిన్నారి వారికి క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ వినిపించుకోకుండా బలవంతంగా టాయిలెట్‌లోకి తీసుకెళ్లి గడియపెట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఈ విషయాన్ని టీచర్ దృష్టికి తీసుకెళ్లగా, నిందితులైన ఇద్దరినీ స్కూలు నుంచి బహిష్కరించామని, ఈ విషయం గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని చెప్పింది. తాజాగా, ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్.. ప్రిన్సిపాల్‌తోపాటు పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలీవల్ మాట్లాడుతూ.. స్కూల్లోనూ అమ్మాయిలకు రక్షణ లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో స్కూలు అధికారుల పాత్రపైనా విచారణ జరగాలని అన్నారు. దీనిపై కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రాంతీయ కార్యాలయం స్పందించింది. జరగిన ఘటనపై విచారణకు ఆదేశించింది. అయితే, స్కూలు వర్గాల వాదన మరోలా ఉంది. తానీ విషయాన్ని టీచర్‌కు చెప్పానని బాధిత బాలిక చెబుతుండగా, బాలిక కానీ, ఆమె తల్లిదండ్రులు కానీ తమకు ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles