JioBook laptop listed on Indian Govt website at Rs. 19500! దీపావ‌ళికి మార్కెట్‌లోకి జియోబుక్‌.. లోబ‌డ్జెట్ లాప్‌టాప్‌!

Jiobook laptop listed on indian govt website at rs 19500

Jiobook, jiobook laptop, Jio laptop, Jio laptop price, jiobook laptop sale, jiobook laptop price, jiophone

Reliance Jio may have quietly revealed its first laptop, albeit in a rather weird way. The JioBook laptop has been listed for sale on the Indian Government's eMarketplace and you can buy it today, provided you are a reseller. The laptop is still not available to end consumers and only resellers can buy it in a minimum consignment quantity of 1 piece.

దీపావ‌ళికి మార్కెట్‌లోకి జియోబుక్‌.. లోబ‌డ్జెట్ లాప్‌టాప్‌!

Posted: 10/07/2022 02:16 PM IST
Jiobook laptop listed on indian govt website at rs 19500

టెలీ కమ్యూనికేషన్స్ రంగంలో ఇప్పటికే సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఇక సాంకేతిక రంగంలోనూ ప్రకంపనలు సృష్టించేందుకు సిద్దమైంది. తాజాగా ఐటీ సహా ఇతర రంగాలకు చెందిన నిపుణులకు రిల‌య‌న్స్ జియో తీపి క‌బురందించింది. త‌న తొలి లో-బ‌డ్జెట్ లాప్‌టాప్‌ను ఆవిష్క‌రించింది. కేవలం 20 వేల రూపాయల లోపు బడ్జెట్ ధరలో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని జియో వర్గాలు చెబుతున్నాయి. అయితే సంస్థ వర్గాలు మాత్రం ఇప్పటికీ దీని ధరను అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు దీపావ‌ళి త‌ర్వాత అందుబాటులోకి రానున్న‌ద‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతానికి ప్ర‌భుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ (జీఈఎం - GeM) పోర్ట‌ల్‌లో అందుబాటులో ఉంది. అయితే కేవలం కేంద్ర ప్ర‌భుత్వోద్యోగుల‌కు విక్ర‌యించ‌డానికి మాత్ర‌మే `జీఈఎం (GeM)`లో అందుబాటులో ఉంచార‌ని స‌మాచారం. `జియో బుక్` పేరుతో అందుబాటులోకి రానున్న లాప్‌టాప్ ధ‌ర రూ.19,500గా ఈ వెబ్ సైట్ పేర్కోనడం గమనార్హం. 2జీబీ రామ్ కెపాసిటీతో వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంటుంది. ఢిల్లీలోని ప్ర‌గ‌తి మైదాన్‌లో జ‌రిగిన ఇండియ‌న్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో జియో బుక్ డిస్‌ప్లే చేశారు. జియో బుక్ లాప్‌టాప్ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ సామ‌ర్థ్యం 32 జీబీ. 6-8 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్ సౌక‌ర్యం క‌ల్పిస్తోంది.

11.6 అంగుళాల హెచ్‌డీ ఎల్ఈడీ బ్యాక్‌లిట్ యాంటీ గ్లేర్ స్క్రీన్‌తో అందుబాటులోకి వ‌స్తున్న‌ది. ఏడాది పాటు బ్రాండ్ వారంటీ అందిస్తున్న‌ది. యూఎస్బీ 2.0 పోర్ట్, యూఎస్మా 3.0 పోర్ట్‌, హెచ్డీఎంఐ పోర్ట్‌, మైక్రో ఎస్డీ స్లాట్ కూడా ల‌భిస్తుంది. జియోబుక్ లాప్‌టాప్‌ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ 665 ఒక్టాకోర్ ప్రాసెస‌ర్‌తో ప‌ని చేస్తుంది. జియో ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ ఆధారంగానే జియో బుక్ ప‌ని చేస్తుంది. 802.11 ఏసీ వై-ఫై క‌నెక్టివిటీ ఫెసిలిటీ ఉంది. బ్లూటూత్ వ‌ర్ష‌న్ 5.2తో బ్లూటూత్‌ క‌నెక్టివిటీ, 4జీ మొబైల్ బ్రాడ్‌బాండ్ క‌నెక్టివిటీ ఉంటుంది. ఇంట‌ర్న‌ల్ స్పీక‌ర్లు, డ్యుయ‌ల్ మైక్రో ఫోన్లు కూడా ఉంటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles