Gas prices hiked 40 percent; CNG, PNG to cost more సీఎన్జీ వాహనదారులకు షాక్.. ఏకంగా 40శాతం మేర పెరిగిన గ్యాస్ ధరలు

Steep hike in gas price cng png to increase as prices of natural gas hiked by 40

Natural gas price, LPG gas price, CNG gas price hiked, CNG, CNG price, gas price, petrol price, PNG, prices of natural gas, CNG and piped cooking gas, 40 per cent to record levels

The government has hiked prices of domestically-produced natural gas from normal and difficult fields by 40% and 26%, respectively, for the October 2022-March 2023 period, a move that will likely make gas-based electricity, CNG and piped natural gas costlier, but will boost the profitability of producers like Reliance Industries and state-run ONGC and OIL.

సీఎన్జీ వాహనదారులకు షాక్.. ఏకంగా 40శాతం మేర పెరిగిన గ్యాస్ ధరలు

Posted: 10/01/2022 07:47 PM IST
Steep hike in gas price cng png to increase as prices of natural gas hiked by 40

ఇంధన ధరలను అంతర్జాతీయ మార్కట్లకు అనుగూణంగా హెచ్చతగ్గులను సవరిస్తూ కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత.. తగ్గిన ధరలను వాహనదారులకు అందించకుండా.. ఎక్సైజ్ సుంఖాలను అమాంతం పెంచేసింది. ఇక తాజాగా ఈ ఏడాదిలో పెట్రోల్ వాత ప్రభావం కేంద్ర ప్రభుత్వంపై బాగా పడుతుందని భావించిన తరుణంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ధరలను స్థిరంగా కొనసాగిస్తున్న కేంద్రం.. గ్యాస్ పై ధరలను పెంచుతూ వచ్చిన విషయం తెలిసిందే. సబ్సీడియేతర, సబ్సీడి, గ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచేసింది.

ఇక తాజాగా సహజ వాయువుపై దృష్టిసారించిన కేంద్రం.. ఆ రేట్లను కూడా ఏకంగా 40 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో యూనిట్‌ (ఎంబీటీయూ) రేటు రికార్డు స్థాయిలో 6.1 డాలర్ల నుంచి 8.57 డాలర్లకు చేరింది. అలాగే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌ రేటు 9.92 డాలర్ల నుంచి 12.6 డాలర్లకు పెంచుతూ చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ అనాలిసిస్‌ సెల్‌ (పీపీఏసీ) ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా వాహనాల్లో ఉపయోగించే సీఎన్‌జీ, వంట అవసరాల కోసం పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే పీఎన్‌జీ రేట్లకు రెక్కలు రానున్నాయి. ధరల పెంపు సామాన్యుడిపై ప్రభావం చూపనుంది.

గ్యాస్‌ను ఉపయోగించి ఉత్పత్తి చేసే ఎరువులు, విద్యుత్‌ తయారీ వ్యయాల భారం కూడా పెరగనున్నాయి. సాధారణంగా గ్యాస్‌ రేట్లను ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి (ఏప్రిల్‌ 1న, అక్టోబర్‌ 1న) సమీక్షిస్తుంది. అమెరికా, కెనడా, రష్యా వంటి గ్యాస్‌ మిగులు దేశాల రేట్లకు అనుగుణంగా నిర్దిష్ట ఫార్ములా ప్రకారం సవరిస్తుంది. మరోవైపు, ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం ఎగిసే అవకాశాలు ఉన్నందున రేట్ల ఫార్ములాను సమీక్షించి, తగు సిఫార్సులు చేసేందుకు ప్లానింగ్‌ కమిషన్‌ మాజీ సభ్యుడు కిరీట్‌ పారిఖ్‌ సారథ్యంలో కేంద్రం కమిటీ వేసింది. ఇది సెప్టెంబర్‌ ఆఖరు నాటికే నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles