Mother denies her teenage son wreck their House మొబైల్ ఫోన్ ఇవ్వలేదని.. ఇంటినే ధ్వంసం చేసిన బాలుడు

Teenager wreck his house after his mother took away his mobile phone

teenager wreck his house, mother took away sons mobile phone, India Police Service (IPS) ofiicer Dipanshu Kabra, mentally ill son wreck his home, Friend betrayl, Hot discussion on Social media, public debate over mobile addiction, IPS officer, Dipanshu Kabra, teenage boy, Mother, Mobile Phone, social media, Twitter, mentally ill, video goes viral, viral video

A shocking incident of teenage mobile addiction has come to light on social media. A 15-year-old boy can be seen destructing his house appliances. Reports said that the boy did this because his mother had allegedly taken away his mobile phone. India Police Service (IPS) ofiicer Dipanshu Kabra shared a video of this incident on Twitter.

ITEMVIDOES: మొబైల్ ఫోన్ ఇవ్వలేదని.. ఇంటినే ధ్వంసం చేసిన బాలుడు

Posted: 09/24/2022 07:04 PM IST
Teenager wreck his house after his mother took away his mobile phone

తమ పిల్లాడు నిత్యం మొబైల్ ఫోన్ లోనే నిమగ్నమవుతూ చదువు పట్ల శ్రద్ద చూపడం లేదని కోపగించుకున్న ఆ తల్లిదండ్రులు. వాడి నుంచి తమ మొబైల్ ఫోన్ తీసుకుని తమ వద్దే అట్టిపెట్టుకన్నారు. ఉదయం తండ్రి ఆఫీసుకు వెళ్లిన తరువాత తల్లి మొబైల్ ఫోన్ అడిగినా అమె ఇవ్వడానికి నిరాకరించారు. కాగా, కొంత సమయానికి అనుకోకుండా పనిబడటంతో తల్లి కూడా బయటకు వెళ్లింది. అంతే తనకు మొబైల్ ఫోన్ ఇవ్వకుండా తల్లిదండ్రులు ఇద్దరూ బయటకు వెళ్లారని ఆగ్రహంతో రగిలిపోయిన 15 ఏళ్ల కుర్రాడు విధ్వంసం సృష్టించాడు.

ఇంట్లోని అన్ని గదులు, వాష్ రూమ్, కిచన్, బెడ్ రూమ్, మాస్టర్ బెడ్ రూమ్, వాడ్రోబ్స్, ఇంటి అద్దాలు, టీవీలు, చిమ్నీ, ఫ్రిడ్జి ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఇంట్లోని అన్ని వస్తువులను చిధ్రం చేశాడు. మొబైల్ ఫోన్ కు అలవాటు పడితే ఇంతటి విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఐపీఎస్ ఆఫీసర్ దీపాన్షు కాబ్రా తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను అప్ లోడ్ చేశారు. అయితే బాలుడి తల్లి మాత్రం ఈ అరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. తమ బిడ్డ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, అయితే అతని స్నేహితురాలు మాత్రం ఈ వీడియోను తీసి నెట్టింట్లో అప్ లోడ్ చేసిందని.. ఇది పూర్తిగా నమ్మకద్రోహమని అమె మండిపడుతున్నారు.

ఇదిలావుండగా, మొబైల్ అడిక్షన్ మానుకోవడానికి తల్లిదండ్రులు నేటి తరానికి అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యం. పాఠశాలలోనూ భావోద్వేగాలపై మొబైల్ ఫోన్ల ప్రభావం.. ఫలితాలు, దుష్ఫరిణామాలు అనే అంశంపై చర్చలు.. మొబైల్ ఫోన్ల పర్యవసానాల నుంచి బయటపడే చర్యలపై తరగతి గదుల్లోనూ బోధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న సూచనలు పెరిగిపోతున్నాయి. మొబైల్ ఫోన్లతో ఎంత వరకు చక్కబెట్టుకునే కార్యక్రమాలను వస్తువుగానే పరిగణించాలి తప్ప.. అనవసరంగా వినియోగం చేస్తూ ఎంతటి దుష్ఫలితాలకు కారణం అవుతుందో కూడా తెలుసుకోవాలి. మొబైల్ ఫోన్లను నియంత్రించుకోవడం నేర్చుకోవడం ఎంత ముఖ్యమో దృశ్యం చూస్తే అర్థమవుతుంది..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles