Goddess blesses devotees in Swarna kavachalankrutha Durga Devi avatar ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రులు ప్రారంభం.. దుర్గాదేవీగా కనకదుర్గమ్మ..

Goddess blesses devotees in swarna kavachalankrutha durga devi avatar on day 2 of dasara festivities

Dussehra Navaratri celebrations, Indrakeeladri, Sri Swarna kavachalankrutha Durga Devi, Kanaka Durga Devi Ammavaru, Vijayawada, Andhra Pradesh

On day one of Dasara, the presiding deity Sri Durga Malleswara Swamy Varla Devasthanam of Kanaka Durga temple, was adorned as Sri Swarna kavachalankrutha Durga Devi, as part of the ongoing Dasara festivities that started today. The nine-day Dussehra Navaratri celebrations began today and end on October 5 at the Indrakeeladri Ammavari Temple in Vijayawada.

ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రులు ప్రారంభం.. దుర్గాదేవీగా కనకదుర్గమ్మ..

Posted: 09/26/2022 11:47 AM IST
Goddess blesses devotees in swarna kavachalankrutha durga devi avatar on day 2 of dasara festivities

విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇవాళ్టి నుంచి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. ఈ తొమ్మిది రోజలు పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తలకు దర్శనం కల్పించి అభయ ప్రధానం చేస్తారు. ఇవాళ ప్రారంభమయ్యే దేవి శరన్నవరాత్రులు అక్టోబర్‌ ఐదో తేదీ వరకు కొనసాగుతాయి. శ్రీదేవీశరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

తొలిరోజు దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా కనకదుర్గమ్మ దేవీ భక్తులను అనుగ్రహిస్తారు. రోజూ తెల్లవారుజామున నాలుగు  నుంచి రాత్రి పదిగంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అక్టోబర్‌ రెండో తేదీన మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని రెండులక్షల మందికిపైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అదేరోజు అమ్మవారికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువ్రస్తాలు సమర్పిస్తారు. ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా సీపీ టి.కె.రాణా ప్రత్యేక పూజలు చేసి దుర్గమ్మకు పట్టువ్రస్తాలు సమర్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles