Eknath Shinde's son sitting on CM chair goes viral ‘మహా’ దుమారం: ముఖ్యమంత్రి కుర్చీలో ఏక్‌నాథ్ షిండే తనయుడు..

Shindes son seen sitting on cms chair ncp taunted with this movie dialogue

Chief Minister Chair, Eknath Shinde, Uddhav thackeray, Shrikant Shinde, CM son sits in chief Minister Chair, Maharashtra Government, Nationalist Congress party, NCP Youth wing Mehboob Shaikh, Mehboob sheikh, NCP, Shivsena, BJP, Maharashtra, Politics

A new controversy has started due to some pictures of CM Eknath Shinde's son Shrikant Shinde. In the picture, Shrikant Shinde is seen sitting on a chair. The board right behind the chair reads Maharashtra Government, Chief Minister. The NCP has alleged that Eknath Shinde's son is sitting on the CM's chair. NCP Youth Wing state president Mehboob Shaikh tweeted the photo and wrote, "In the absence of the CM, his dear handles the chief minister's office.

‘మహా’ దుమారం: ముఖ్యమంత్రి కుర్చీలో ఏక్‌నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్..

Posted: 09/24/2022 03:42 PM IST
Shindes son seen sitting on cms chair ncp taunted with this movie dialogue

మహారాష్ట్ర రాజకీయాలు అంటేనే దేశం మొత్తం ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఇటీవలే తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన శివసేన పార్టీ అధినేత ఉద్దవ్ థాకరే ను కాదని తాన పక్షమే అసలైన శివసేన పార్టీ అంటూ ప్రకటించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షింగే.. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు చెందిన కుర్చీలో ఆయన వారసుడు కూర్చోని అదేశాలు ఇస్తుండగా, ఆయన ఎదుట అధికారులు చేతులు కట్టుకున్నారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటో హల్‌చల్ చేస్తోంది. ఇది మహారాష్ట్రలో రాజకీయాల్లో పెను దుమారానికి కారణమైంది.

ఈ ఫోటోలో సీఎం ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఫొటో ఇది. ఆ గదిలో ప్రభుత్వాధికారులు చేతులు కట్టుకుని నిల్చుని ఉన్నారు. ఆయన చేతిలో ఓ ఫైల్ ఉండడం ఈ మొత్తం దుమారానికి కారణమైంది. ఇక ఈ కుర్చీ వెనుక పెద్ద పెద్దని తాటికాయంతటి అక్షరాల్లో ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ప్రభుత్వం అని కూడా రాసిఉంది. అయినా ఈ కుర్చీలో కూర్చోని షిండే వారసుడు అధికారులకు ఏవో అదేశాలు ఇస్తుండటం తీవ్ర విమర్శలకు కారణమయ్యింది. ఈ ఫొటో వెలుగులోకి రావడంతో విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

‘సూపర్ సీఎం’ అని ఒకరు విమర్శిలు చేస్తుంటే.. బాప్ నెంబరీ తో బేటా దస్ నంబరీ అంటూ మరోకరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా ముఖ్యమంత్రి కుర్చీ అని పెద్ద అక్షరాలతో రాసి ఉన్నాక కూడా ఆయన అక్కడే కూర్చోని అధికారులకు అదేశాలిస్తుండటం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నాయి. ఈ విమర్శలపై శ్రీకాంత్ షిండే స్పందించారు. ముఖ్యమంత్రి రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నారని అన్నారు. ఆయన చాలా సమర్థుడైన సీఎం అని, ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో థానే నివాసంలోనిదని, అది సీఎం అధికారిక నివాసం కాదని వివరణ ఇచ్చారు. సీఎంతోపాటు తాను కూడా దానిని ఉపయోగించుకుంటూ ఉంటానని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles