MEA issues advisory against fake IT job racket ఫేక్‌ ఐటీ జాబ్ ఆఫ‌ర్ల‌పై ఎంఈఏ మార్గ‌ద‌ర్శ‌కాలు..

Mea issues advisory on fake it job offers targeting indian youths in myanmar thailand

Ministry of External Affairs (MEA), lucrative jobs, data entry jobs, Dubai, Myanmar, Thailand, social media advertisements, harsh conditions, Indian nationals, Fake job, racket, youth, skilled, crypto frauds, MEA, IT jobs scam

The Ministry of External Affairs (MEA) issued an advisory warning against “Fake job rackets” that essentially target the skilled youth in the IT industry. According to the advisory, victims are being duped on the pretext of lucrative data entry jobs in Thailand via social media advertisements, as well as by Dubai and India based agents.

ఫేక్‌ ఐటీ జాబ్ ఆఫ‌ర్ల‌ు: ఆశావహులను అప్రమత్తం చేసిన ఎంఈఏ మార్గ‌ద‌ర్శ‌కాలు

Posted: 09/24/2022 04:32 PM IST
Mea issues advisory on fake it job offers targeting indian youths in myanmar thailand

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వేదికగా అద్భుతమైన ఆపర్లను కల్పిస్తూన్నామని.. కేవలం డాటా ఎంట్రీ జాబుతో వేలాది రూపాయల జీతం సొంతం అంటూ ప్రకటను ఇచ్చి.. ఉచ్చులోకి దింపేవారితో అప్రమత్తంగా ఉండాలి. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సూచనలు జారీ చేసింది. విదేశాలలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోవద్దని ఎంఈఏ తాజా గైడ్ లెన్స్ జారీ చేసింది. ఐటీలో నైపుణ్యాలు క‌లిగిన యువ‌త‌కు ఆక‌ర్ష‌ణీయ జాబ్ ఆఫ‌ర్లు అంటూ మోస‌గిస్తున్న ఫేక్ జాబ్ రాకెట్లు, ఏజెంట్ల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఎంఈఏ యువ‌త‌ను కోరింది.

ఐటీ ఉద్యోగాల పేరిట న‌కిలీ జాబ్ రాకెట్ల దందాకు సంబంధించి ఎంఈఏ శ‌నివారం మార్గద‌ర్శకాల‌ను జారీ చేసింది. కొద్దిరోజుల కింద‌ట మ‌య‌న్మార్‌లో చిక్కుకున్న భార‌తీయుల వీడియో బ‌హిర్గ‌త‌మైన నేప‌ధ్యంలో ఎంఈఏ ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. థాయ్‌లాండ్‌లో డిజిట‌ల్ సేల్స్, మార్కెటింగ్‌లో ఆక‌ర్ష‌ణీయ జాబ్ ఆఫ‌ర్ల పేరుతో న‌కిలీ జాబ్ రాకెట్స్ న‌డుస్తున్న విష‌యాన్ని ప్ర‌స్తావించింది. విదేశాల్లో ముఖ్యంగా థాయ్‌లాండ్‌లో డేటా ఎంట్రీ జాబ్‌ల పేరుతో ఐటీ నైపుణ్యాలున్న యువ‌త‌ను టార్గెట్‌గా చేసుకుని దుబాయ్‌, భార‌త్‌కు చెందిన ఏజెంట్లు సోష‌ల్ మీడియా ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఫేక్ జాబ్ రాకెట్ న‌డుపుతున్నార‌ని హెచ్చ‌రించింది.

స‌రిహ‌ద్దుల గుండా బాధితుల‌ను మ‌యన్మార్ తీసుకువెళ్లి అక్క‌డ వారితో క‌ఠిన ప‌రిస్ధితుల మ‌ధ్య బ‌ల‌వంతంగా ప‌నులు చేయిస్తున్నార‌ని తెలిపింది. కొందరిని పలు నేరపూరిత కార్య క్రమాలకు కూడా వినియోగించుకుంటోందని పేర్కోంది. సోష‌ల్ మీడియా వేదిక‌లు, ఇత‌ర మార్గాల్లో ముందుకొచ్చే ఇలాంటి న‌కిలీ జాబ్ రాకెట్‌ల వ‌ల‌లో ప‌డ‌రాద‌ని ఎంఈఏ మార్గ‌ద‌ర్శ‌కాల్లో యువ‌త‌ను కోరింది. ఉద్యోగ నిమిత్తం టూరిస్ట్ వీసా, విజిట్ వీసాల‌పై విదేశాల‌కు వెళ్లే ముందు ఆయా దేశాల్లోని రాయ‌బార కార్యాల‌యాల ద్వారా విదేశీ సంస్ధ‌లు, య‌జ‌మానుల గురించి ఓసారి చెక్ చేసుకోవాల‌ని భార‌త పౌరుల‌కు సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fake job  racket  youth  skilled  crypto frauds  MEA  IT jobs scam  Dubai  Myanmar  Thailand  social media  

Other Articles