అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచానికే ఒక శాససకర్త. తన దేశాన్ని అగ్రబాగాన నిలుపుతూనే.. దేశంలోని ప్రజల బాగోగులను సమీక్షిస్తూ.. వారి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూనే.. మరోవైపు ప్రపంచపటంలోని ఏ దేశం ఏం చేస్తుందో కూడా నిత్యం గమనిస్తూ.. డేగ కన్ను పెట్టడం వారి ముఖ్య విధుల్లో ఒకటిగా మారిపోయింది. అయితే తన ఒక్క మాటతో, కను సైగతో ప్రపంచాన్ని శాసించగలిగే వ్యక్తి అగ్రరాజ్యం అధినేత. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మాటే శాసనంలా మిగతా ప్రపంచదేశాలన్నీ ఫాలో కావాల్సిందే. అలాంటి స్థానంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం ఓ వేదికపై చిన్న పిల్లాడిలా వ్యవహరించాడు.
అదేంటి అన్న అనుమానం కలుగుతోంది. ఔను నిజంగా రిపబ్లికన్లు ట్విట్టర్లో పెట్టిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారందరూ ఔను ఏంటీ అధ్యక్షుల వారు ఇలా స్టేజ్ పై చిన్నపిల్లాడిలా వ్యవహరించారేంటి అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఆయనకు ఏమైందీ..? ఏదో మర్చిపోయినట్టు.. దేని గురించో తడుముకుంటున్నట్లు.. ఇంకోదో ఉంది అన్నట్లు గుర్తుకువచ్చి రాకుండా మధ్యలో మధనపడుతున్నట్లుగా ఆయన వ్యవహరించారు. కొన్ని నిమిషాల పాటు ఆయన స్టేజీపై బిత్తర చూపులు చూశారు.
ఓ కార్యక్రమంలో ప్రసంగించిన తర్వాత ఎటు వెళ్లాలో... ఏం చేయాలో తెలియక బైడెన్ తికమక పడ్డ ఓ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. న్యూయార్క్ నగరంలో గ్లోబల్ ఫండ్ సంస్థ ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత స్టేజ్‌పైకి వచ్చిన బైడెన్ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత.. పోడియం దిగేందుకు కుడివైపు కొన్ని అడుగులు వేశారు. ఆ వెంటనే ఆగి వెనక్కి తిరిగారు. ఎటువెళ్లాలో తెలియక కాస్తంత తికమక పడ్డారు. స్టేజ్ చివర్లో కొన్ని క్షణాల పాటు ఎటూ కదలకుండా నిలబడిపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు.
ఇంతలో హోస్ట్ మైక్ తీసుకొని బైడెన్ కు ధన్యవాదాలు చెప్పే సందేశం చదివారు. అప్పుడు కార్యక్రమం ముగిసిందని తెలియడంతో బైడెన్ వెనక్కు తిరిగి అటువైపు వెళ్లారు. ఈ కార్యక్రమానికి హాజరైన వేలాది మంది బైడెన్ ప్రసంగం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కానీ, ప్రసంగం ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడి తడబాటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు. ఏప్రిల్ లోనూ బైడెన్ ఇలాంటి సందర్భం ఎదుర్కొన్నారు. ఎదురుగా ఎవరూ లేకున్నా కరచాలనం చేసేందుకు చేయి ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
Where ya going, Big Guy? pic.twitter.com/hvMjZlprWb
— RNC Research (@RNCResearch) September 21, 2022
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more