Video of UP minor walking home naked goes viral యూపీ మైనర్ బాలిక నగ్న వీడియోలో ట్విస్టు..

Uttar pradesh video of moradabad minor walking home naked goes viral parents say no sexual assault

MInor Girl, naked walking, viral video, no sexual assault, Moradabad-Thakurdwara Road, mental problems, Sandeep Kumar Meena, Moradabad, minor girl naked filming, naked walking minor girl stareing, Sandeep Kumar Meena, FIR, POSCO Act, Gangrape, Uttar Pradesh, National Politics

A day after a video of a girl had gone viral on social media where she can be seen walking naked for about two kilometres on the Moradabad-Thakurdwara Road to reach home, her parents have now said that their daughter is having mental problems since childhood. The girls parents have denied any sexual assault. SSP Moradabad said that police conducted medical examination was conducted and no sexual assault was found.

ITEMVIDEOS: యూపీ మైనర్ బాలిక నగ్న వీడియోలో ట్విస్టు.. గ్యాంగ్ రేప్..

Posted: 09/23/2022 01:36 PM IST
Uttar pradesh video of moradabad minor walking home naked goes viral parents say no sexual assault

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మైనర్ బాలిక నగ్నంగా నడుచుకుంటూ వెళ్లిన వైరల్‌ వీడియోపై దిమ్మతిరిగిపోయే ప్రకటన ఇచ్చారు పోలీసులు. నడిరోడ్డుపై నిస్సహా స్థితిలో నడుచుకుంటూ వెళ్లిన మైనర్ బాలిక (15) అత్యాచార బాధితురాలు కాదని, అసలు ఆమెపై అత్యాచారం జరగలేదని అంటున్నారు. ఈ ఘటనలో గ్యాంగ్ రేప్ కింద సెక్షన్ 376డి, సహా మైనర్ బాలాబాలికల సంరక్షణ చట్టం కింద పోస్కో చట్టం కింద కూడా కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు మాటమార్చారు. అయితే అందుకు కారణాలు లేకపోలేదు. వైద్య పరీక్షలోనూ అది నిర్ధారణ అయ్యిందని ప్రకటించారు.

అంతేకాదు.. బాధిత బాలిక తల్లిదండ్రుల వాంగ్మూలం కూడా తమ బిడ్డపై అత్యాచారం జరగలేదని చెప్పడం సైతం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. మోరాదాబాద్‌ వైరల్‌ వీడియోపై యూపీ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. నగ్నంగా ఓ అమ్మాయి నిస్సహాయ స్థితిలో నడిరోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వీడియో అది. పదిహేను సెకన్ల నిడివి ఉన్న ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లోనూ చక్కర్లు కొట్టి.. స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ వైరల్‌ వీడియోలో ఉంది తన కుటుంబానికి చెందిన వ్యక్తే అని, ఆమె బంధువు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రక్తస్రావంతో ఆమె ఇంటికి చేరిందని, ఆమెపై గ్యాంగ్‌రేప్‌ జరిగిందని అందులో పేర్కొన్నాడు. భోజ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సెప్టెంబర్‌ 1వ తేదీన అఘాయిత్యం జరగ్గా.. 7న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమెను ఎత్తుకెళ్లి గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారని పేర్కొంటూ ఐదుగురిని అరెస్ట్‌ కూడా చేసి.. జ్యూడీషియల్‌ కస్టడీకి తరలించారు. అయితే.. వైద్య పరీక్షలో బాధితురాలిపై అఘాయిత్యం జరిగినట్లు రుజువు కాలేదు. అయినప్పటికీ కేసులో దర్యాప్తు కొనసాగించారు పోలీసులు.         

ఈ లోపు.. మెజిస్ట్రేట్‌ ముందు బాధితురాలి తల్లిదండ్రుల స్టేట్‌మెంట్‌ అందరికీ షాకిచ్చింది. తమ కూతురిపై అసలు సామూహిక అత్యాచారం జరగలేదని, చిన్నప్పటి నుంచి మానసిక సంబంధిత సమస్యలతో ఆమె ఇబ్బంది పడుతోందని మెజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కేసు ఎవరూ ఊహించని ట్విస్టు ఏర్పడింది. అత్యాచారం జరగకుంటే.. ఆమెను ఆకతాయిలు వేధించి దుస్తులు విప్పించి నడిరోడ్డుపై నడిపించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేసులో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. నడిరోడ్డుపై నగ్నంగా ఓ బాలిక నడుచుకుంటూ వెళ్తుంటే సాయం చేయాల్సిందిపోయి.. వీడియోలు తీసి వైరల్‌ చేసిన యువకుల తీరుపైనా విమర్శలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles