Doctor chains dog to the car and drags it on a busy road మూగజీవి పట్ల అమానవీయంగా వ్వవహరించిన వైద్యుడు

Case registered against well know doctor for cruelty towards his dog in jodhpur

dog home foundation, dr galwa, Dog, Stray Dog, dog dangling, SUV, Creta car, Dr. Rajneesh Galwa, plastic surgeon, Jodhpur, Rajasthan, Crime

A video has gone viral on social media showing a dog being made to run by his owner behind his car with the leash of the dog being held by the owner who is also driving the car. The dog seems to be struggling to keep up with the vehicle. The video was made by passers-by, some of whom even 'informed' the doctor about the dog dangling along, believing that he had done so mistakenly.

మూగజీవి పట్ల అమానవీయంగా వ్వవహరించిన వైద్యుడు

Posted: 09/19/2022 03:18 PM IST
Case registered against well know doctor for cruelty towards his dog in jodhpur

‘‘వైద్యో నారాయణో హరిః’’ అంటూ డాక్టర్లను దేవుళ్లతో సమానంగా పరిగణించి గౌరవిస్తాం. అందుకు వారు రోగులకు ప్రాణాలను కాపాడటమే కారణం. కొందరు వైద్యులను పక్కనబెడితే రమారమి వైద్యులందరూ రోగులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని వాటిని నయం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. తమను ఇబ్బందులు పెట్టే అరోగ్య సమస్యల నుంచి కాసింత విముక్తి కలగంగానే రోగులు వారికి కృతజ్ఞతలు తెలుపుతారు. మానవత్వంతో స్పందిస్తూ వ్యాధులను బాపుతూ ఇలపై వెలసిన దేవుళ్లుగానే వారిని పరిగణిస్తారు. కాగా ఇక్కడ ఓ డాక్టర్‌ మాత్రం అమానవీయ చర్యకు పూనుకున్నారు.

తన ఇంటివద్ద ఉండే వీధి కుక్కకు ఎన్నడైనా అన్నం పెట్టాడో లేదో కానీ దాని పట్ల కర్కషంగా వ్యవహరించాడు. వీధి కుక్క నోరును కట్టేసి.. మరో వైపు తాడును తన కారుకు కట్టేసి ఊరంతా తిప్పాడు. కారు వెళ్తున్నంత వేగంగా శునకం పరుగెత్తలేకపోయింది. అయినా పట్టించుకోని వైద్యుడు ఆ మూగజీవి చిత్రహింస అనుభవించేలా చేసిన హృదయ విదారక ఘటన ఇది. రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది. జోధ్‌పూర్‌కు చెందిన డాక్టర్‌ రజనీశ్‌ గల్వా ఇంటివద్ద ఓ వీధి కుక్క ఉన్నది. దానిని ఊరిబయట వదిలి పెట్టాలనుకున్నాడు.

దీంతో అతడు దాని మూతిని ఓ తాడుతో కట్టి.. మరో కొనను తన కారుకు కట్టాడు. ఇలానే శునకాన్ని తన కారు వెనకాలే పరుగెత్తేలా చేసి ఊరంతా తిప్పాడు. అయితే దానిని ఎక్కడ వదిలిపెడదామని అనుకున్నా వైద్యుడికి అనువైన ప్రాంతం కనిపించలేదు. అయితే శునకాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిచిన తీరును గమనించిన ఓ బైకర్‌.. వెంటనే వైద్యుడి కారును ఆపాడు. కుక్క మూతికి ఉన్న తాడు విడిపించాడు. అనంతరం డాగ్‌ హోమ్‌ ఫౌండేషన్‌ సభ్యులకు సమాచారం అందించాడు. వారు ఆ శునకాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై డాగ్‌ హోమ్‌ ఫౌండేషన్‌.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ డాక్టర్‌పై జంతుహింస చట్టం కింద కేసు నమోదుచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles