YS Viveka murder case: SC issues notices to AP Govt వైఎస్ వివేకా హత్యకేసులో ఏపీ సర్కార్ కు నోటీసులు

Ys viveka murder case supreme court issues notices to andhra pradesh govt

CBI, murder case, Vivekananda, YS Rajasekhara Reddy, YS JaganMohan Reddy, Narreddy Rajasekhar Reddy, YS Pratap Reddy, Y.S. Vivekananda Reddy, Pulivendula, Kadapa, Y.S. Avinash Reddy, YCP state secretary, Devireddy SivaShanker Reddy, Rajashekar reddy, TDP MLC BTech Ravi, Raghunatha Reddy, Sunil Yadav, Rangaiah, servent, Erra Gangireddy​, Jagadishwar Reddy, Gangadhar, CBI, YS Vivekananda Reddy murder case, Sunitha Reddy, Pulivendula, kadapa, andhra pradesh, crime, Politics

The Supreme Court issues notices to Andhra Pradesh Government and Central Bureau of Investigation after hearing the petition, submitted in the apex court by YS Sunitha and YS Showbhagya. YS Sunitha Reddy, pleaded with the SC to oversee the prosecution's case against her father's murder. The Supreme Court Justices MR Shah and Krishna Murari listed the petition for admission.

సుప్రీం’ను ఆశ్రయించిన సునీత.. వైఎస్ వివేకా హత్యకేసులో ఏపీ సర్కార్ కు నోటీసులు

Posted: 09/19/2022 01:44 PM IST
Ys viveka murder case supreme court issues notices to andhra pradesh govt

మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకేసులో మరో ట్విస్టు ఏర్పడింది. ఈ కేసును ఏపీ హైకోర్టులో విచారించేందుకు బదులు మరో రాష్ట్ర హైకోర్టులో విచారించాలని పిటీషన్ దాఖలైంది. ఈ కేసులో నిందితులకు విచారణకు పిలిస్తే.. అధికారుల పైనే ప్రైవేటు కేసులు వేస్తూ.. దర్యాప్తును అడ్డుకుంటున్నారని.. అలాంటి కేసులను కొట్టివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలని సిబిఐ తరపున సహాయ సొలిసిటర్ జనరల్ హైకోర్టుకు విన్నవించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏపీ హైకోర్టులో విచారణ జరిగుతున్నా తమకు న్యాయం జరిగడం లేదని అమె పిటీషన్ దాఖలు చేశారు.

ఏపీ హైకోర్టులో వివేకా హత్యకేసు దర్యాప్తు జరిగితే తమకు న్యాయం జరిగే అవకాశాలు కూడా తక్కువేనని అనుమానాలు వ్యక్తం చేశారు. మూడేళ్లు సమీపిస్తున్నా ఈ కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని వివేక తనయ వైఎస్ సునిత, అమె తల్లి సౌభాగ్యమ్మ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొన్నారు. ఏపీలో విచారణ జరిగితే తమకు న్యాయం అందదని, అందుకని మరో రాష్ట్రానికి కేసు విచారణను బదిలీ చేయాలని సునీతారెడ్డి అత్యున్నత న్యాయస్తానం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తిచేశారు. దాంతో ఏపీ సర్కార్‌తోపాటు సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను అక్టోబర్‌ 14 కు వాయిదా వేసింది.

తన తండ్రి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదలాయించాలని కోరుతూ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు విచారణ జరిపినట్లయితే తమ కుటుంబానికి న్యాయం జరుగదని తాము భావిస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందుకని హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేసి పర్యవేక్షించాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. దీనిపై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారీతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐతో పాటు ఏపీ సర్కార్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 14 కు వాయిదా వేసింది.

తన తండ్రి హత్య జరిగి దాదాపుగా మూడేళ్ల సమయం కావస్తున్నా ఎలాంటి పురోగతి కనిపించడంలేదని సునీతా రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సీబీఐ అధికారులకు బెదిరింపులు కూడా వస్తున్నాయని, అందుకే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసును విచారించాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. 2019 మార్చి 14 న వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన ఇంట్లో దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఇన్నేండ్లయినా కేసు విచారనలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో వివేకా కుమార్తె సునీతరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles