బీజేపీ నేత, మాజీ పార్లమెంటు సభ్యురాలు శశికళా పుష్పను ఓ కార్యక్రమంలో ఆ కాషాయ పార్టీకి చెందిన రాష్ట్రస్థాయి నేత లైంగిక వేధింపులకు గురిచేసిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా నేత వేదికపై ఉన్నా.. అమెతో ఎలా వ్యవహరించాలో కూడా తెలియని స్థితిలో అమర్యాదగా వ్యవహరించారు. అమరవీరుడు ఇమ్మాన్యుయేల్ శేఖరన్ 65వ వర్థంతిని తమిళనాడులో ఈనెల 11న నిర్వహించగా, అదేరోజును ఈ ఘటన జరగినా ఆలస్యంగా వెలుగు చేసింది. తమిళానాడులోని రమనాథపురం జిల్లా పరమక్కుడిలోని ఆయన స్మారక స్థూపం సాక్షిగా ఓ మహిళా నేతపై జరిగిన లైంగిక దాడి తాజాగా వెలుగుచూసింది.
డీఎంకే ఐటీ విభాగం రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి ఇసై దక్షిణామూర్తి ఈ వీడియోను తన సోషల్ మీడియా వేదికపై షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్ గా మారింది. అమరవీరుడు ఇమ్మాన్యుయేల్ శేఖరన్ వర్థంతిని పురస్కరించుకుని అన్ని ప్రధాన పార్టీల నేతలు ఆయనకు ఘనంగా అంజలి ఘటించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడకు వచ్చిన బీజేపి నేతలు కూడా శ్రద్దాంజలి ఘటించారు. కాగా ఈ సందర్భంలో జనం ఎదుట, అమరవీరుడి స్థూపం సాక్షిగా మాజీ మహిళా ఎంపీకి జరిగిన పరాభవం వీడియో బయటపడింది.
ఈ వీడియోలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్ బాలగణపతి శశికళ పుష్ప చీరను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆమె తోసివేసినట్టు కనిపించింది. అప్పటికీ మిన్నకుండని ఆపై పొన్ బాలగణపతి ఆమె ఎడమ చేతిని తాకేందుకు ప్రయత్నించాడు. అమెపై తాకాలన్న ఉద్దేశ్యం ఉన్నట్లు ఈ వీడియోలో కనిపించింది. బీజేపీలో చేరిన మహిళలు ఆ పార్టీ నేతల నుంచి తమను తాము కాపాడుకోవడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోందా అనే క్యాప్షన్‌తో డీఎంకే నేత ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోపై పొన్ బాలగణపతి ఇంతవరకూ స్పందించలేదు. కాగా జనంతో రద్దీ అధికంగా ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలు సహజమంటూ పలువురు సమర్థించడం గర్హనీయం.
பாஜகவில் சேரும் பெண்கள், தங்களை பாஜகவினரிடம் இருந்து தற்காத்துக் கொள்வதே பெரும் போராட்டம் தானா? @annamalai_k #ShameOnBJP pic.twitter.com/lNZXVTCKYY
— இசை (@isai_) September 13, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more