Rs 11,677 Crore Deposited in Gujarat Man's Account ఒక్క రోజు కోటీశ్వరుడు… వ్యక్తి ఖాతాలో రూ.11,677 కోట్లు

Crorepati for a day rs 11 677 crore deposited in gujarat man s account by mistake withdrawn later

Ramesh Sagar, Kotak Securities, Stock Market, Jandhan Account, Demat Account, Billionaire, Rs 11,677 crore, many account holders happy, Ahmedabad, Gujarat, Assembly elections, Congress party, TRS party, Economy, SP, TMC, indian economy, RBI, viral news

After several recent incidents of banking errors, a similar case has surfaced from Gujarat’s Ahmedabad, wherein a citizen found Rs 11,677 crore in his demat account. However, the man’s joy was short-lived as the whopping sum of money was taken back in a few hours.

ఒక్క రోజు కోటీశ్వరుడు… వ్యక్తి ఖాతాలో రూ.11,677 కోట్లు

Posted: 09/15/2022 04:11 PM IST
Crorepati for a day rs 11 677 crore deposited in gujarat man s account by mistake withdrawn later

ఏక్ దిన్ కా సుల్లాన్ అన్నట్లుగా.. ఈ మధ్యకాలంలో అందులోనూ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన పెద్ద నోట్ల రద్దు సంస్కరణ తరువాత.. అంతకంటే పెద్ద నోటును తీసుకువచ్చి పేదలకు అందకుండా చేసిన తరువాత.. దేశంలోని చాలా మంది ఒక్క రోజు కుబేరులుగా మారుతున్నారు. కానీ ఈ సంతోషం వారికి ఎక్కువ కాలం నిలవదు. గతంలో దేశంలోని పేదలకు చెందిన ఖాతాల్లో పడే కోట్ల కోద్దీ డబ్బు.. వారిని ఆశ్చర్యచకితులను చేసింది. ఈ విషయాలు తెలిసీ తెలియంగానే వారు బ్యాంకుల చుట్టూ తిరగి అసలు విషయం తెలుసుకుని నిరుత్సాహంతో వెనుదిరిగారు. కనీసం కోటి రూపాయలైనా మా ఖాతాలో ఉంచి మిగతావి తీసుకెళ్లాలని వారు కోరినా.. వినిపించుకునే నాథుడే కరువయ్యాడు.

అయితే ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్న క్రమంలో ఇక పేదల ఖాతాలకు మళ్లాల్సిన కోటాను కోట్ల రూపాయలు ఈ మధ్యాకలంలో డీమ్యాట్ అకౌంట్లలను వెతుక్కుంటూ పడుతున్నాయి. అయితే పడిన డబ్బుల విషయమై ఆయా ఖాతాదారులు బ్యాంకు అధికారులకు పిర్యాదు చేసిన తరువాతే ఆ డబ్బులు వారి ఖాతాల నుంచి అదృశ్యమవుతున్నాయి. మరి పిర్యాదు చేయకపోతే ఏకంగా నెల రోజుల పాటు కూడా ఆ డబ్బులు అలానే వారి ఖాతాల్లోనే నిల్వ ఉంటున్నాయి. ఇలా నిల్వ ఉన్న డబ్బులోంచి ఖాతాదారులు ఏ లావాదేవీ అయినా జరిపితే.. అదే రోజున బ్యాంకింగ్ సమయం ముగిసిన తరువాత ఆ డబ్బులు అదృశ్యం అవుతున్నాయి.

ఇలా జరగడానికి కారణాలు ఏంటీ అన్న ప్రశ్నలు అటు డబ్బులు పడిన ఖాతాదారులతో పాటు ఇటు బ్యాంకింగ్ అధికారులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. ఏకంగా బ్యాంకింగ్ సమయం ముగిసిన తరువాత బ్యాంకు అధికారులు ఆన్ లైన్ ద్వారా ఈ డబ్బులను ఎలా తరలిస్తున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదో ఒక ఘటన జరిగిందంటే పోరబాటు అనుకోవచ్చు.. కానీ ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్న కోద్దీ దేశ ప్రజలు, బ్యాంకు ఖాతాదారులలోనూ అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక దీనిపై ప్రశ్నించినా అది ఏదో చిన్న పోరబాటు అని బ్యాంకు ఉన్నాతాధికారులు చెబుతూ దాటవేత దోరణి అవలంభిస్తున్నారు.

అసలు దేశంలో నోట్ల రద్దు తరువాత ఇలా అకస్మికంగా కుబేరులైన వారి సంఖ్య ఏకంగా వంద వరకు చేరుకుంది. సరిగ్గా అన్ని ఘటనలు పరిశీలిస్తే శతాధికం కూడా దాటి ఉంటుంది. దేశంలోని ప్రజల డబ్బులు ఇలా ఒక్కరి ఖాతాలోకి ఎలా చేరుతున్నాయి. అక్కడి నుంచి ఎక్కడికి అదృష్యం అవుతున్నాయి. బ్యాంకు ఉన్నాతాధికారుల దాటవేత ధోరణిపై సరైన సమాధానలు వస్తే తప్ప.. ప్రభుత్వం, అర్బీఐ ఇలాంటి తప్పిదాలపై చర్యలకు పూనుకుంటే తప్ప ఇవి ఆగేలా లేవు. ఇదిలా ఉండగా ఈ ఘటనలు ఉద్దేశ్యపూర్వకంగా జరుగుతుందో లేక, కాకతాలీయంగా జరుగుతున్నాయా.? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా త్వరలో ఎన్నికలు జరుగుతాయనో.. లేక ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు పార్టీలను ఫిరాయిస్తారని తరువాత వార్తలు వినబడతాయో.. ఆయా రాష్ట్రాల్లోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం. బ్యాకింగ్‌ పొరపాట్ల వల్ల కొందరు వ్యక్తులు కొన్ని గంటలపాటు కోటీశ్వరులు అవుతున్నారు. అదే మాదిరిగా ఒక వ్యక్తి ఖాతాలో పొరపాటున రూ.11,677 కోట్లు జమ అయ్యాయి. దీంతో ఆ వ్యక్తి సుమారు ఒక రోజు కోటీశ్వరుడయ్యాడు. అయితే అనంతరం ఆ డబ్బులు వెనక్కి వెళ్లాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. రమేష్ సాగర్ గత ఐదేళ్లుగా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నాడు. ఏడాది కిందట కోటక్ సెక్యూరిటీస్‌లో డీమ్యాట్ ఖాతా తెరిచాడు.

కాగా, నెల రోజుల కిందట సాగర్ డీమ్యాట్‌ ఖాతాలో సుమారు 12 వేల కోట్లు జమ అయ్యాయి. జూలై 26న తన డీమ్యాట్‌ ఖాతాలో రూ.116,77,24,43,277.10 ఉంటడం చూసి అతడు షాకయ్యాడు. ఈ మొత్తం నుంచి రెండు కోట్లను స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాడు. మరో ఐదు లక్షలకు లాభాలు బుక్‌ చేశాడు. మరోవైపు అదే రోజు రాత్రి 8.30 గంటలకు సాగర్‌ డీమ్యాట్‌ ఖాతాలో పొరపాటున జమ అయిన కోట్లాది డబ్బు మాయమైంది. యాప్‌లోని మార్జిన్‌ అప్‌డేట్‌లో సమస్య వచ్చిందని, దీని వల్ల ఇలా జరిగిందంటూ ఆ బ్యాంకు నుంచి అతడికి మెసేజ్‌ వచ్చింది.  ఆ రోజున కోటక్ సెక్యూరిటీస్‌ యాప్‌లో సాంకేతిక సమస్య వల్ల సాగర్‌ మాదిరిగా మరికొంత మంది వ్యక్తుల ఖాతాల్లో పొరపాటున కోట్లలో డబ్బులు జమ అయ్యాయి. దీంతో వారంతా ఒక్కరోజు కోటీశ్వరులయ్యారు. అయితే తరువాత విత్‌డ్రా అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles