Air India flight catches fire in Muscat ఎయిరిండియా విమానం నుంచి పొగలు.. ప్రయాణికుల పరుగులు..

Ai express flight to kochi evacuated after engine catches fire on taxiway in muscat

Air India, air india plane smoke, Air India Express, Muscat flight, Oman muscat, fire on plane, fire on aircraft, Air India Express, muscat-kochi flight, fire on Air India Express flight, muscat, kochi, Oman, DGCA, Air India Flight

An Air India Express flight bound for Kochi was evacuated at Muscat airport in Oman after fire was detected in one of the engines just before takeoff. All crew and the 145 passengers on board, four of them infants, were evacuated from the aircraft and shifted to the terminal building. No serious injuries were reported. "Relief flight will be organised," said a statement by the Directorate General of Civil Aviation.

ఎయిరిండియా విమానం నుంచి పొగలు.. భయాందోళనలో ప్రయాణికులు

Posted: 09/14/2022 06:48 PM IST
Ai express flight to kochi evacuated after engine catches fire on taxiway in muscat

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం ప్రయాణికులను కలవరానికి గురిచేసింది. ఏం జరుగుతుందోనన్న భయాందోళనల మధ్య ప్రయాణికులు విమానం నుంచి దూరంగా పరుగులు తీశారు. ఎయిరిండియా విమానం నుంచి పొగలు రావడమే ఇందుకు కారణం. ఒమన్‌ రాజధాని మస్కట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొచ్చికి బయల్దేరేందుకు సిద్ధం అవుతున్న బోయింగ్‌ 737-800 విమానం రన్‌వేపై ఉన్న సమయంలోనే ఇంజిన్‌ నుంచి అకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. ఇది గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.

విమానం ఎక్కేందుకు వరుస క్రమంలో నిల్చున్న ప్రయాణికులు దూరంగా పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అప్పటికే విమానం ఎక్కేసిన ప్రయాణికులను హుటాహుటిన కిందకు దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. భయంతో ప్రయాణికులు పరుగులు తీసిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.  ఈ ఘటనలో14మందికి గాయాలైనట్టు సమాచారం. ప్రమాదం సమయంలో విమానంలో 141 మంది ప్రయాణికులు ఉండగా.. వీరిలో నలుగురు శిశువులు ఉన్నారు. అలాగే, మరో ఆరుగురు విమాన సిబ్బంది కూడా ఉన్నారు.  

ప్రయాణికులు అందరినీ ఖాళీ చేయించిన విమానాశ్రయ సిబ్బంది వారిని సురక్షితంగా టెర్మినల్‌ భవనంలోకి తరలించారు. మరోవైపు, మస్కట్‌ నుంచి కొచ్చికి ప్రయాణికులను తరలించేందుకు మరో విమాన సర్వీసు ఏర్పాటు చేస్తున్నట్టు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అధికారులు వెల్లడించారు. అలాగే, ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నారు. మరోవైపు, రెండు నెలల క్రితం కూడా కాలికట్‌ నుంచి దుబాయికి వెళ్లే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానంలో కాలిన వాసన రావడంతో ఆ విమానాన్ని మస్కట్‌కు మళ్లించాల్సి వచ్చింది. ఆ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles