Laborer set fire to Mercedes Benz car బెంజ్ కారుకు నిప్పుపెట్టిన కూలీ.. ఎందుకో తెలుసా.?

Angry labourer sets employer s mercedes ablaze in noida over wage dispute arrested

Laborer set fire to Mercedes car in noida, Mercedes car set on fire, labourer breaks patience, Laborer set fire to Mercedes, labour fires a benz car in delhi, labourer sets fire to merc in delhi, mercedes ablaze, mercedes benz ablaze, labourer sets owner mercedes on fire, mason sets employer's mercedes ablaze, mercedes on fire noida, noida mason sets car on fire, noida worker sets mercedes on fire, delhi news, wage dispute, mason, Ranveer, employer, Mercedes Benz car, set ablaze, Ayush Chauhan, COVID-19 lockdown, Delhi Police, Crime

A wage dispute took an ugly turn in Noida when a mason identified as Ranveer set his employer's Mercedes Benz car on fire. The accused was arrested by Noida police following the car owner's complaint. As per reports, the labourer allegedly had dues of Rs 2 lakh, which led him to do set ablaze the Rs 1 crore car. The employer denied the claims of non-payment.

ITEMVIDEOS: బెంజ్ కారుపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన కూలీ.. ఎందుకో తెలిస్తే షాకే.!

Posted: 09/14/2022 05:53 PM IST
Angry labourer sets employer s mercedes ablaze in noida over wage dispute arrested

ఇంటి బయట పార్క్ చేసి ఉన్న మెర్సిడెజ్ బెంజ్ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరూ అని ఆరా తీసిన పోలీసులకు విస్తుగోలిపే విషయాలు వెలుగు చూశాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు ఏకంగా ఆ ఇంట్లో పనిచేసిన ఓ మేస్త్రీ. అలాంటి మేస్త్రీ ఇంటి యజమానికి చెందిన అత్యంత ఖరీదైన, విలాసవంతమైన విదేశీ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించాడంటే.. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా అదే నిజం. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు కూడా ఆ ఇంటి నిర్మాణానికి పనిచేసిన మేస్త్రీయే కారుకు నిప్పుపెట్టాడని స్పష్టం చేస్తున్నాయి.

సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన ద్విచక్ర వాహనం నెంబరు ఆధారంగా పోలీసులు నిందితుడైన మేస్త్రీని అదుపులోకి తీసుకున్నారు. అయితే అంతకుముందు సదరు వ్యక్తిని సిసిటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాల్లో చూసిన ఆ ఇంటి సభ్యులు ఇతను రణవీర్ మాకు బాగా తెలుసు. ఈ ఇంట్లోని టైల్స్ వేయడానికి అతనితో మేము ఒప్పందం కుదుర్చుకున్నాం. పని చేస్తునన్ని రోజులు మా కుటుంబంలో ఒకడిలా కలసిపోయాడు. అతడేనా ఇలా తమ కారును బగ్గిపాలు చేశాడా.? అంటూ విస్మయం వ్యక్తం చేశారు. అయితే తానెందుకు ఇలాంటి పని చేశాడో మాత్రం నిందితుడినే అడగాలి.. అతనిలో ఉన్న మర్మమేమిటో మాకు తెలియదు అన్నారు కుటుంబసభ్యలు.

కానీ ఓ కూలీ పని చేసే వ్యక్తి.. ఓ సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తులపై ఇలా పగ, ప్రతీకారం తీర్చుకున్నాడంటే.. దానికి అతని మనసుకు ఎంతో గాయమై ఉండి ఉండాలి. అసలేం జరిగిందని అతడ్ని ఆరా తీసిన పోలీసులకు విషయాన్ని వివరించాడు రణవీర్. తనతో టైల్స్ పని చేయించుకుని, తనకు బాకీ ఉన్న డబ్బులు కోసం తిరిగి తిరిగి అలసిపోయానని.. వాటిని తనకు ఇవ్వనందునే కోపంతో ఇలా చేసినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. డబ్బులు కోసం తిరిగి తిరిగి అలసిపోయాను.. ఎన్నిసార్లు తిరిగినా వారు ఇవ్వడం లేదు. దీంతో సహనం నశించి.. వారిపై కోపంతో ఖరీదైన కారును తగలబెట్టానని చెప్పాడు రణవీర్.

అయితే ఈ అరోపణలను ఇంటి యజమాని కుటుంబసభ్యులు కోట్టిపారేస్తున్నారు.  కరోనా సమయంలో తమ ఇంటి నిర్మాణం జరిగిందని.. ఆ సమయంలో తమ ఇంట్లో ఓ వివాహ కార్యక్రమం ఉండటంతో రణవీర్ తో పనిచేయించుకున్నామని.. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా రణవీర్ కూడా తమ ఇంటికి పనికి రాకుండా.. తన స్వస్థలానికి వెళ్లిపోయాడని తెలిపారు. అయితే వెళ్తున్నప్పుడు డబ్బులు కావాలని తీసుకెళ్లాడని ఇంటి యజమాని తెలిపారు. వివాహ సమయం సమీపిస్తున్న వేళ.. అతనికి ఫోన్ చేసి.. రమ్మని తాము పిలిచామని, అయినా అతను వచ్చేందుకు ఆసక్తిని కనబర్చలేదని తెలిపారు. దీంతో తాము వేరే వ్యక్తులను ఏర్పాటు చేసుకుని పనలు చేయించామని యజమాని చెప్పుకోచ్చారు.

అయితే రణవీర్ వారిపై కూడా బెదిరింపులకు పాల్పడ్డారని.. అతడు చేసిన పనికి కాకుండా మొత్తానికి డబ్బు చెల్లించాలని అడుగుతున్నాడని, అతను మిగిల్చిన పనికి, ఇతరులు తీసుకున్న కూలీకి మొత్తం చెల్లుబాటు అయ్యిందని ఇంటి యజమాని తెలిపారు. అయితే అదే అక్కస్సుతో ఇలా తమ కారును బుగ్గిపాలు చేశాడని పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ ఘటన నొయిడా సెక్టార్​-39లోని సదర్​పుర్​ కాలనీలో జరిగింది. బిస్​రఖ్​ ఠాణా పరిధిలోని జలాల్​పుర్​ గ్రామానికి చెందిన రణ్​వీర్​.. నొయిడాలోని సదర్​పుర్​ కాలనీకి చెందిన ఆయుష్ చౌహాన్​ ఇంట్లో టైల్స్ పని చేశాడు. ఇందుకు సంబంధించి తనకు ఆయుష్​ రూ.68వేలు ఇవ్వాల్సి ఉందని రణవీర్ చెబుతున్నాడు.  .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles