SC panel indicts Punjab Police for PM Modi security breach ప్ర‌ధాని భ‌ద్ర‌తా వైఫ‌ల్యం.. పంజాబ్‌ పోలీసుల నిర్లక్ష్యమే: సుప్రీంకోర్టు

Pm s security breach cop s negligence says supreme court cites report

Pm Modi security, Pm Modi, Narendra Modi, Pm Modi security, Pm Modi, Narendra Modi, PM Modi security breach, Supreme Court, Justice Indu Malhotra, five-member committee, Punjab, SC panel on PM Security breach, PM Modi news, Pm Modi latest news, Politics

A committee probing the security breach of Prime Minister Narendra Modi found lapses in the "conduct of the Punjab police" during his visit to the state in January, the Supreme Court said today. The Supreme Court said that the five-member committee, headed by former Supreme Court Judge Justice Indu Malhotra, has indicted the Senior Superintendent of Police Ferozepur for failing to take requisite action.

ప్ర‌ధాని మోడీ భ‌ద్ర‌తా వైఫ‌ల్యం.. పంజాబ్‌ పోలీసుల నిర్లక్ష్యమే: సుప్రీంకోర్టు

Posted: 08/25/2022 05:15 PM IST
Pm s security breach cop s negligence says supreme court cites report

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఆ రాష్ట్రంలోని ఫెరోజ్ పూర్ లో ఏర్పాటు చేసిన ప్రధాని సభకు వెళ్తుండగా, ఆయనకు చేదు అనుభ‌వం ఎదురైన విష‌యం తెలిసిందే. ఫిరోజ్‌ పూర్‌లో ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న ప్ర‌ధాని మోదీని భద్రతా వైఫల్యం కలిగిన విషయం తెలిసిందే. అకస్మాత్తుగా ఆయన వెళ్లే మార్గంలోకి చోచ్చుకోచ్చిన రైతులు ఆయనను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో మోదీ కాన్వాయ్ ఓ బ్రిడ్జ్‌పై అర‌గంట‌కు పైగా నిలిచిపోయింది. ఆ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టేందుకు ఏర్పాటు చేసిన సర్వోన్నత న్యాయస్థాన ఫ్యానెల్ తన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

ఆ రిపోర్ట్‌పై ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచార‌ణ జ‌రిగింది. ఫిరోజ్‌పూర్ సీనియ‌ర్ సూప‌రిండెంట్ ఆఫ్ పోలీసు త‌న విధుల్ని స‌రైన రీతిలో నిర్వ‌ర్తించ‌లేద‌ని న్యాయస్థానం పేర్కొన్న‌ది. చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ సూర్య కాంత్‌, హిమా కోహ్లీల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది. ప్ర‌ధాని మోదీ భ‌ద్ర‌త‌ను పటిష్టం చేసే అంశంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌మిటీ చేసిన సూచ‌న‌ను ధ‌ర్మాస‌నం ప్ర‌స్తావించింది. సుప్రీంకోర్టు మాజీ జ‌డ్జి ఇందూ మ‌ల్హోత్రా నేతృత్వంలోని క‌మిటీ ఈ రిపోర్ట్‌ను త‌యారు చేసింది.

శాంతి, భ‌ద్ర‌త‌ల అమలు విష‌యంలో ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీ విఫ‌లం అయ్యార‌ని, కావాల్సినంత సిబ్బంది ఉన్నా ఎస్ఎస్పీ విధుల నిర్వ‌హ‌ణ‌లో అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించార‌ని, ప్ర‌ధాని మోదీ వెళ్లే మార్గం గురించి రెండు గంట‌ల ముందు చెప్పినా ఆయ‌న స‌రైన చ‌ర్య‌లు తీసుకోలేద‌ని క‌మిటీ త‌న రిపోర్ట్‌లో తెలిపింది. ప్ర‌ధాని భ‌ద్ర‌త అంశంలో దిద్దుబాటు చ‌ర్య‌లు అవ‌స‌ర‌మ‌ని, పోలీసు అధికారుల‌కు శిక్ష‌ణ ఇచ్చే అంశంలో ఓ క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని తెలిపారు. వీవీఐపీల‌కు సెక్యూర్టీ క‌ల్పించే అంశంలో ప్లానింగ్ అవ‌స‌ర‌మ‌ని కోర్టు తెలిపింది. క‌మిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను ప్ర‌భుత్వానికి పంప‌నున్న‌ట్లు సీజేఐ ర‌మ‌ణ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles