SC says no conclusive proof of Pegasus spyware పెగాసెస్ విచారణకు ప్రభుత్వం సహకరించలేదు: సుప్రీంకోర్టు

Pegasus hearing centre didn t cooperate with probe says supreme court

Pegasus, SC on Pegasus, Supreme Court, SC pegasus sypware, CJI N V Ramana, Justice Surya Kant,Justice Hima Kohli, technical committee, Retired Judge R V Raveendran, Pegasus news, Israeli spyware, Israeli NSO Group, india latest news, National politics

The Supreme Court-appointed technical committee, which probed allegations of unauthorised use of Israeli NSO Group spyware Pegasus software for surveillance, examined 29 phones and found some malware in 5 of them, said a bench headed by Chief Justice of India N V Ramana.

పెగాసెస్ విచారణకు ప్రభుత్వం సహకరించలేదు: సుప్రీంకోర్టు

Posted: 08/25/2022 06:08 PM IST
Pegasus hearing centre didn t cooperate with probe says supreme court

పెగాస‌స్ స్పైవేర్ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. పెగాసెస్ స్పైవేర్ ను వినియోగించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల కాల్ప్ ను చాటుగా వింటున్నారన్న అరోపణలపై పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లిన విషయం తెలిసిందే. దీంతో ఈ అంశంపై కొందరు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఈ అంశంలో నిజనిర్థారణకు రిటైర్డు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అర్ వి రవీంద్రన్ నేతృత్వంలో ఒక సాంకేతిక క‌మిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సమర్పించిన నివేదికను ఇవాళ అత్యున్నత న్యాయ‌స్థానం ప‌రిశీలించింది.

ఈ కేసు దర్యాప్తుకు ప్రభుత్వం సహకరించలేదని కమిటీ పేర్కోంది. కాగా, కేసు పరిశీలనలో తమకు అందిన 29 ఫోన్ల‌ను ప‌రీక్షించ‌గా, దాంట్లో అయిదు ఫోన్ల‌లో మాల్‌వేర్ ఉన్న‌ట్లు గ‌మ‌నించామ‌ని కమిటీ నివేదిక పేర్కోందని సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు. కానీ ఒక్క ఫోన్‌లో కూడా పెగాస‌స్ స్పైవేర్ ఉన్న‌ట్లు గుర్తించ‌లేదు అని కోర్టు తెలిపింది. అయితే పెగాస‌స్ అంశంలో కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌క‌రించి ఉంటే చాలా విషయాలు వెల్లడయ్యేవన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. క‌మిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్న‌ట్లు కోర్టు వెల్ల‌డించింది.

సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన క‌మిటీనే ఈ రిపోర్ట్‌ను త‌యారు చేస్తోంది. మూడు భాగాలుగా రిపోర్ట్‌ను ఇవ్వ‌నున్నారు. దీంట్లో రెండు టెక్నిక‌ల్ క‌మిటీ రిపోర్ట్‌లు ఉంటాయి. రిటైర్డ్ జ‌డ్జి జ‌స్టిస్ ఆర్వీ ర‌వీంద్ర‌న్ మ‌రో నివేదిక‌ను స‌మ‌ర్పిస్తారు. ర‌వీంద్ర‌న్ స‌మ‌ర్పించే నివేదిక‌ను త‌మ వెబ్‌సైట్‌లో ప‌బ్లిక్‌గా పెట్ట‌నున్న‌ట్లు సీజేఐ తెలిపారు. తొలి రెండు భాగాల‌కు చెందిన రిపోర్ట్ కావాల‌ని కొంద‌రు పిటిష‌నర్లు అడగ్గా దానిపై ప‌రిశీలిస్తామ‌ని సీజేఐ పేర్కొన్నారు. ఈ కేసు విచార‌ణ‌ను మ‌రో నాలుగు వారాల‌కు వాయిదా వేశారు. కేసును విచారించిన ధ‌ర్మాస‌నంలో సీజేఐ ర‌మ‌ణ‌తో పాటు జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ హిమా కోహ్లీ ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles