IMD issues yellow alert to many districts in Andhra ఏపీకి ఎల్లో అలర్ట్.. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు..

Another low pressure in bay of bengal yellow alert issued to many districts in andhra pradesh

light rain, telangana, average rainfall, large excess rainfall, excess rainfall, seven districts of Telangana, India Meteorological Department (IMD), red alert to Adilabad, red alert to Kumram Bheem Asifabad, red alert to Mancherial, red alert to Nirmal, red alert to Jagtial, red alert to Jayashankar Bhupalpally, orange alert to seven districts of Telangana, Nizamabad, Rajanna Sircilla, Karimnagar, Peddapalli, Mulugu, Bhadradri Kothagudem, Siddipet districts, Yellow alert to remaining districts of telangana, Yellow alert to Hyderabad

Another low-pressure formed over over the North-west Bay of Bengal on August 19, informed the India Meteorological Department (IMD). According to the MeT department, under the influence of the cyclonic circulation over Northwest Bay of Bengal & neighbourhood, Yellow alert issued to many districts in Andhra Pradesh, which hints a heavy to very heavy rainfall over the state.

ఏపీకి ఎల్లో అలర్ట్.. రానున్న రెండు రోజులు పలు జిల్లాలో భారీ వర్షాలు..

Posted: 08/19/2022 04:10 PM IST
Another low pressure in bay of bengal yellow alert issued to many districts in andhra pradesh

తెలుగు రాష్ట్రాలపై మునుపెన్నడూ లేని విధంగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని జలాశయాలను, వాగులు, వంకలు, నదులు, కాలువలను నిండుకుండలా మార్చేసిన వరుణుడు.. ఇప్పటికీ శాంతించడం లేదు. ఫలితంగా తెలుగురాష్ట్రాలలో వర్షాలు కురుస్తూనే వున్నాయి. ఇక తాజాగా భారత వాతావరణ శాఖ మరో వార్తతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజల్లో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని వెల్లడించింది. ఈ వాయుగుండం ప్రసుత్తం ఒరిస్సాలోని బాలాసోర్‌కు దగ్గర్లో గంటకు 20 కిమీ వేగంతో వాయివ్యంగా ప్రయాణి స్తోందని సంబంధిత శాఖాధికారులు తెలిపారు. ఈ కారణంగా ఒరిస్సా, ఝూర్ఖండ్, చత్తీస్‌ఘడ్, వెస్ట్ బెంగాల్‌ రాష్రాలతో పాటు ఏపీలోని ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు అవకాశాలున్నాయని స్పష్టం చేసింది . దీంతో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది .

ఇక ఇటు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గ్యాప్ లేకుండా ఏదో ఒక ప్రాంతంలో వరుణుడు తన ప్రతాపాన్ని చాటుతూనే ఉన్నాడు. ఇక తాజాగా పాత‌బ‌స్తీలోని ప‌లు ప్రాంతాల్లో శుక్ర‌వారం సాయంత్రం భారీ వ‌ర్షం కురిసింది. రోడ్ల‌పై భారీగా వ‌ర్ష‌పు నీరు నిలిచిపోయింది. ప‌లు బ‌స్తీల్లోకి వ‌ర్ష‌పు నీరు చేర‌డంతో స్థానికులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. చార్మినార్‌, యాకుత్‌పురా, ఉప్పుగూడ‌, బ‌హ‌దూర్‌పురా, చాంద్రాయ‌ణ‌గుట్ట‌, బాలాపూర్‌, బార్క‌స్‌, ఆరాంఘ‌ర్, మెహిదీప‌ట్నం, గండీపేట్‌, టోలీచౌకి, స‌రూర్‌న‌గ‌ర్‌, మ‌ల‌క్‌పేట‌, ఎల్బీన‌గ‌ర్‌తో పాటు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. ఈ ఏరియాల్లో జీహెచ్ఎంసీ అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles