Little student brilliant answer makes netizens amazed పరీక్షలో క్రేజీ ఆన్సర్స్.. బుడ్డోడి తెలివికి టీచర్ ఫిదా..

Little student stunning answer in exam will blow your mind

Little Student, brilliant, exam, five words you can spell, question, Answer, netizens, amazed, stunning answer, brilliant student, viral news, viral post

A Little Student shows his briliancy in exam to a question appeared in the exam paper. His stunning answer in exam has amazed the netizens after the same was posted online.

పరీక్షలో క్రేజీ ఆన్సర్స్.. బుడ్డోడి తెలివికి టీచర్ ఫిదా.. నెటిజనులు కూడా..

Posted: 08/19/2022 03:12 PM IST
Little student stunning answer in exam will blow your mind

ప్రస్తుత జనరేషన్‌లో పిల్లల తెలివి తేటలకు తల్లిదండ్రులే కాదు టీచర్లు సైతం అవాక్కు అవుతున్నారు. ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచంలో.. మాతో పోటి పడగలరా అంటూ తమ టాలెంట్‌తో అందరినీ మెస్మరైజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఓ బుడ్డోడు చేసిన పనికి టీచర్ ప్రశంసల వర్షం కురిపించింది. అతని తెలివికి సలాం కొట్టి అదనంగా రెండు మార్కులు బోనస్ ఇచ్చింది. ఇంతకీ ఆ బుడ్డోడు ఏం చేశాడు అనుకుంటున్నారా ? అయితే మీరే చూడండి. రెండో తరగతిలో అడిగిన ప్రశ్నకు ఓ స్టూడెంట్ క్రేజీ ఆన్సర్ ఇచ్చాడు.

ఓ ఇంగ్లీష్ టీచర్.. తన పరీక్షా పత్రంలో రైట్ ఫైవ్ వర్డ్స్ యు కాన్ స్పెల్.. (Write Five Words You Can Spell) అన్న ప్రశ్నను ఇచ్చింది. సహజంగా ఏ విద్యార్ధి అయినా ఇలాంటి ప్రశ్న రాగానే బుక్, పెన్, బ్యాట్, బాల్, సెల్, నేమ్, క్యాట్, డాగ్, రాట్ ఇలా చిన్న పదాలు గుర్తుపెట్టుకుని రాస్తారు. మరికొందరు మాత్రం తమ తల్లిదండ్రుల పేర్లు, అన్నాచెలళ్ల పెర్లు, ఫ్రెండ్స్ పేర్లుతో పాటు వారికి తెలిసిన పదాలు రాస్తుంటారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ చిన్నారి ఇచ్చిన సమాధానాలు చూస్తూ మీరు ఆశ్చర్యపోతారు. అసలేం రాశాడంటాంటే..

కాస్త తెలివిగా ఆలోచించి, (Five, Words, You, Can, Spell) ఆన్సర్‌ రాసేశాడు. ఇక ఈ ప్రశ్నపత్రం చూసిన టీచర్ ఒక్కసారిగా షాకై విద్యార్థిని ప్రశంసలతో ముంచెత్తింది. అలాగే ఐదుకు 5 మార్కులు ఇస్తూ, అదనంగా రెండు మార్క్‌లు బోనస్ ఇచ్చింది. అంతే కాకుండా వెరీ క్లెవర్ అని కాంప్లీమెంట్ ఇచ్చింది. ఇక ఇది చూసిన వారందరూ బుడ్డోడి తెలివిని మెచ్చుకుంటూ.. ఇస్మా్ర్ట్ పిల్లోడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు.. ఈ బుడ్డోడి తెలివే వేరంటున్నారు. అలాగే.. ఇలా ఉంటే ప్రపంచాన్ని మొత్తం ఏలేయచ్చు అంటూ మరికొందరు స్టూడెంట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles