Shashi Tharoor receives France’s highest civilian honour శశిథరూర్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం

Senior congress leader shashi tharoor to receive france s highest civilian award

Delhi Confidential, Shashi Tharoor, Tharoor Legion Of Honour, Tharoor French award, Venkaiah Naidu, Rajnath Singh, Congress MP, Shashi Tharoor receives France’s highest civilian honour, Chevalier de la Legion d’Honneur, French Ambassador, New Delhi, French government

Congress MP Shashi Tharoor seems to be getting all the recognition outside India. The French government is honouring him with its highest honour, ‘Chevalier de la Legion d’Honneur’, for his writings and speeches. The French Ambassador in New Delhi has written to Tharoor, informing him about the honour, which will be conferred on him during the next visit of any minister of the French government to India.

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం

Posted: 08/12/2022 05:24 PM IST
Senior congress leader shashi tharoor to receive france s highest civilian award

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కి ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘లిజియన్‌ ఆఫ్‌ హానర్‌’ దక్కింది. ఆయన ప్రసంగాలు, రచనలకు గుర్తింపుగా ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది. 1802లో నెపోలియన్ దీన్ని నెలకొల్పారు. ‘ఫ్రాన్స్‌తో భారత్‌ సంబంధాలను గౌరవించే, భాషను ప్రేమించే, సంస్కృతిని ఆరాధించే వ్యక్తిగా.. ఈ గుర్తింపును పొందడం గౌరవంగా భావిస్తున్నా. నేను ఈ పురస్కారానికి అర్హుడినేనని భావించిన వారికి కృతజ్ఞతలు’ అని శశిథరూర్‌ ట్వీట్‌ చేశారు. 2010లో థరూర్‌కు స్పెయిన్‌ ప్రభుత్వం సైతం ఇదే విధమైన గౌరవం అందజేసింది.

మరోవైపు ఈ పురస్కారం దక్కడంపై శశిథరూర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా.. శశిథరూర్ తిరువనంతపురం నియోజకవర్గానికి వరుసగా మూడో సారి ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. శశిథరూర్‌ 2009 నుంచి కేరళలోని తిరువనంతపురం పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. ఆయన తన అపారమైన ఆంగ్లబాషా పరిజ్ఞానంతో ఆయన పలు పుస్తకాలు రాశారు.

ఇక కెవలియర్‌ డీ లా లీజియన్‌ డీ హొనర్‌ పురస్కారాన్ని నెపోలియన్‌ బొనాపార్టే 1802లో నెలకొల్పారు. పౌర, సైనిక రంగాల్లో విశిష్ట సేవలందించే వారికి ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందజేస్తుంది. శశిథరూర్‌ 2009 నుంచి కేరళలోని తిరువనంతపురం పార్లమెంటు సభ్యునిగా ఉన్నారు. గతంలో ఐక్యరాజ్య సమితి అండర్‌ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు. ఐక్యరాజ్యసమితిలో వివిధ హోదాల్లో 23 ఏళ్లపాటు సుదీర్ఘంగా విధులు నిర్వర్తించారు. అప్పుడప్పుడు తన ట్విటర్‌ పోస్టుల్లో అరుదైన ఆంగ్ల పదాలను వాడుతూ.. నెటిజన్లకు సవాల్‌ విసురుతుంటారు!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles