Johnson & Johnson to stop sale of baby powder globally 2023 నుండి జే & జే బేబి పౌడ‌ర్‌ను ఆపేస్తున్నాం: కంపెనీ

Johnson johnson drops talcum baby powder globally as lawsuits mount

Johnson & Johnson, talcum powder, 38,000 lawsuits, talcum baby powder, J&J, Johnson & Johnson baby powder, Johnson baby powder cancer, Johnson powder cancer, Johnson baby powder, Bankruptcy, US, Canada, Companies news, business, markets

Johnson & Johnson said it plans to stop selling its legacy talc-based baby-powder products globally in 2023, a move that comes amid continued legal battles and years after the company discontinued the product in the US and Canada. J&J said that it had made the “commercial decision” to transition all its baby powder products to use cornstarch instead of talcum powder after conducting an assessment of its portfolio.

తస్మాత్ జాగ్రత్తా: జాన్సన్ & జాన్సన్ బేబీ పౌడ‌ర్‌ను మీ చిన్నారులకు వాడుతున్నారా.?

Posted: 08/12/2022 04:32 PM IST
Johnson johnson drops talcum baby powder globally as lawsuits mount

అంత‌ర్జాతీయంగా మోస్ట్ పాపుల‌ర్ బేబీ పౌడ‌ర్ జాన్సన్ & జాన్సన్‌ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కంపెనీకి చెందిన ప్రకటనలు పెద్దలను మరీ ముఖ్యంగా అమ్మలను చాలా ఆకర్షిస్తాయనడంలో సందేహమే లేదు. అంతేకాదు ఇదే కంపెనీకి చెందిన పౌడర్ ను వాడాలని.. వాటినే తీసుకురావాలని కూడా వారు తమ భర్తలకు సిఫార్సు చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ కంపెనీకి చెందిన బేబి పౌడర్ కు కాలం చెల్లింది. మరో నాలుగు నెలల తరువాత ఈ కంపెనీ తమ బేబి పౌడర్ ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ ను కూడా నిలిపివేయనుంది. ఔనా.. ఎందుకు అంటారా.. అసలు విషయం చెబితే షాక్ అవుతారు.

ఏంటా అసలు విషయం అన్న వివరంలోకి వెళ్తే.. యుఎస్ ఫార్మాస్యూటికల్ దిగ్గజ సంస్థ జాన్సన్ & జాన్సన్ ఉత్పాదకత అయిన బేబి పౌడర్ వినియోగంతో పిల్లలకు క్యాన్సర్ వస్తుందని అధ్యయనాల్లో వెళ్లడైంది. దీంతో ఈ కంపెనీ విక్రయిస్తున్న బేబి పౌడర్ పై ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 38 వేల పిటీషన్లు ఆయా దేశాల న్యాయస్థానాల్లో వేయబడ్డాయి.  కొన్నేళ్లుగా, జే&జే టాల్కమ్ పౌడర్‌లు, ముఖ్యంగా బేబీ పౌడర్‌లు క్యాన్సర్‌కు కారణమయ్యే కార్సినోజెనిక్ పదార్థాలను క‌లిగి ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటూ, వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి, వినియోగదారులతో పాటు, ఈ పౌడ‌ర్‌ను ఉపయోగించడం వల్ల నష్టపోయిన వారి నుండి 38 వేల‌కు పైగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

ఒకానొక స‌మ‌యంలో కంపెనీ అలాంటిదేమీ లేద‌ని బుకాయించిన‌ప్ప‌టికీ, అంత‌ర్గ‌తంగా తాము క్యాన్స‌ర్ ఆధారిత ప‌దార్థాల‌ను ఉప‌యోగిస్తున్న‌ట్లు ఒప్పుకున్నారు. 2023 నుండి ప్రపంచవ్యాప్తంగా త‌న‌ వివాదాస్పద టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. రెండు సంవ‌త్స‌రాల క్రిత‌మే USA, కెనడాలో J&J తన విక్రయాలను నిలిపియ‌గా, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ బేబీ పౌడ‌ర్ విక్రయాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. అయితే, ఈ టాల్క్ ఆధారిత పౌడర్‌ల నుండి కొత్త‌గా కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్‌కు మారుతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Johnson & Johnson  talcum powder  38  000 lawsuits  talcum baby powder  J&J  Bankruptcy  US  Canada  Companies news  business  markets  

Other Articles