More Transmissible Omicron Sub-Variant Detected In Delhi ఢిల్లీలో అందోళన పెంచుతు్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్

The features of the newly emerging sars cov 2 omicron ba 2 75 subvariant

Omicron BA 2.75, Coronavirus, Delhi new omicron variant, New omicron, genome sequencing, Omicron sub-variant BA.2.75, Covid-19, corbevax, booster dose, covid-19, covid vaccination, dgci, emergency use, Emergency Use Listing, WHO, World Health Organisation, union health secretary, rajesh bhushan, corbevax vaccine, Corbevax, Covaxin, Covishield, Corona vaccine, India

A new sub-variant of the coronavirus strain Omicron has been detected in samples sent for genome sequencing in Delhi's Lok Nayak Jai Prakash Narayan Hospital, a top medical officer of the hospital said. The Omicron sub-variant BA 2.75 has been detected in many samples, LNJP Hospital Medical Director Dr Suresh Kumar said.

ఢిల్లీలో అందోళన పెంచుతు్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్.. వేగంగా వ్యాప్తి..

Posted: 08/10/2022 05:52 PM IST
The features of the newly emerging sars cov 2 omicron ba 2 75 subvariant

దేశంలోని పలు రాష్ట్రాలలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు కేరళ, మహారాష్ట్, తెలంగాణ రాజధాని హైదరాబాదులోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇక ఢిల్లీలో అయితే కేసుల వ్యాప్తి విపరీతంగా ఉంది. అయితే ఇందుకు కరోనా ప్రధాన వేరియంట్ ఒమిక్రాన్ లో కొత్త సబ్ వేరియంట్ కారణమని తేలింది. దీనిని ఒమిక్రాన్ బీఏ 2.75 వేరియంట్ గా పిలుస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. అధికారులు పెద్ద సంఖ్యలో శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించి పరిశీలించారు.

ఈక్రమంలో చాలా శాంపిళ్లలో కొత్త ఉప వేరియంట్ ఉన్నట్టుగా బయటపడిందని ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ ప్రకటించారు. ఢిల్లీలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ 2.75 వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్టు నివేదికల్లో వెల్లడైంది. ఇది మిగతా వేరియంట్లతో పోల్చితే మరింత వేగంగా వ్యాపిస్తుంది. ఢిల్లీలో కేసులు పెరుగుతుండటంతో ఇటీవల 90 శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా.. కొత్త వేరియంట్ విషయం బయటపడింది. ఇప్పటికే వ్యాక్సిన్లు తీసుకుని శరీరంలో యాంటీ బాడీలు ఏర్పడిన వారికి కూడా ఈ కొత్త వేరియంట్ సోకుతోందని తేలింది” అని డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు.

ఈ కొత్త వేరియంట్ శరీరంలో రోగ నిరోధక శక్తిని తప్పించుకుని మరీ సోకుతోందని, వేగంగా ఇతరులకు వ్యాపిస్తోందని పేర్కొన్నారు. అయితే కొత్త వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు మరీ ప్రమాదకరంగా ఏమీ ఉండటం లేదని తెలిపారు. కానీ 60 ఏళ్లు దాటినవారు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల జబ్బులతో బాధపడుతున్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఢిల్లీలో కొన్నిరోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క రోజులో 2,445 కోవిడ్ కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయని.. పాజిటివిటీ రేటు 15.41గా ఉందని ఢిల్లీ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles