Anand Mahindra shares video of boy gymnast న‌డిరోడ్డుపై బాలుడి జిమ్నాస్టిక్ విన్యాసాలు.. మహీంద్రా ఫిదా!

Next generation of talent anand mahindra shares video of boy gymnast on a road

Anand Mahindra, Mahindra group chairperson, Twitter, Commonwealth Games, Tamil Nadu boy, acrobatics, Tirunelveli Road, front and back flips, spotting talent, Gymnastics, Indian Olympics team, Viral video, video viral

Anand Mahindra is known for bringing to the fore some of the most fascinating content on the internet. This time too, the Mahindra group chairperson has shared a video of a boy and emphasised the need to recognise talent in the country. The video features a boy skillfully performing acrobatics on a road in Tirunelveli, Tamil Nadu. The little kid does multiple stunts including front and back flips and even pulls off a 360-flip as onlookers watch in awe.

ITEMVIDEOS: న‌డిరోడ్డుపై బాలుడి జిమ్నాస్టిక్ విన్యాసాలు.. మహీంద్రా సహా నెటిజ‌న్లు ఫిదా!

Posted: 08/09/2022 06:21 PM IST
Next generation of talent anand mahindra shares video of boy gymnast on a road

ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఆనంద్ మ‌హీంద్ర త‌ర‌చూ ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షిస్తుంటారు. తాజాగా నెక్ట్స్ జ‌నరేష‌న్ ఆఫ్ టాలెంట్ అంటూ న‌డిరోడ్డుపై ఓ బాలుడు చేసిన అద్భుత విన్యాసాల‌తో కూడిన వీడియోను నెట్టింట షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్‌లో బాలుడు రోడ్డు మ‌ధ్య‌లో గాలిలోకి ఎగురుతూ జంప్ చేస్తూ చేసిన జిమ్నాస్టిక్ విన్యాసాలు ఆక‌ట్టుకున్నాయి.

ఈ టాలెంట్‌ను పాస్ట్ ట్రాక్‌లో మ‌నం ప‌దును పెట్టాల్సిన అవ‌స‌రం ఉందనే క్యాప్ష‌న్‌తో ఆనంద్ మ‌హీంద్ర పోస్ట్ చేసిన వీడియోకు నెటిజ‌న్ల నుంచి భారీ స్పంద‌న ల‌భిస్తోంది. త‌మిళ‌నాడులోని తిరున‌ల్వేలి స‌మీపంలోని ఓ గ్రామంలో విన్యాసాలు చేస్తుండ‌గా త‌న స్నేహితుల్లో ఒక‌రు చూసి వీడియోను పోస్ట్ చేశార‌ని ఆనంద్ మ‌హింద్ర పేర్కొన్నారు. కామ‌న్‌వెల్త్ గేమ్స్‌2022లో స్వ‌ర్ణం గెలుచుకున్న త‌ర్వాత త‌ర్వాతి త‌రం నైపుణ్యాలు ముందుకొస్తున్నాయ‌ని సోష‌ల్ మీడియాలో చెప్పుకొచ్చారు.

ఈ వీడియోకు ఇప్పటివ‌ర‌కూ 1,18,000కిపైగా వ్యూస్ రాగా 6000కు పైగా లైక్స్ వ‌చ్చాయి. ఈ చిన్నారి భ‌విష్య‌త్ ప్ర‌పంచ జిమ్నాస్టిక్ చాంపియ‌న్ అని ప‌లువురు నెటిజ‌న్లు ప్ర‌శ్నించ‌గా, ఈ బాలుడికి శిక్ష‌ణ ఇప్పించి, భార‌త ఒలింపిక్స్ టీమ్‌లో చేర్చేలా ఎవ‌రో ఒక‌రు చొర‌వ చూపాల‌ని మ‌రికొంద‌రు యూజ‌ర్లు వ్యాఖ్యానించారు. ఈ బుడ‌త‌డు జిమ్నాస్ట్ ట్రిక్స్‌ను ఇప్ప‌టికే నేర్చుకున్నాడ‌ని మ‌రో నెటిజ‌న్ ప్ర‌శంసించారు. ఇక ఇండియా రాక్స్‌, ఫ్యూచ‌ర్ సూప‌ర్‌స్టార్ అంటూ మ‌రికొంద‌రు బాలుడిని ఆకాశానికెత్తేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles