Bihar CM Nitish Kumar's strategy for success బీహార్ లో బీజేపికి షాకిచ్చిన నితీశ్.. మహాఘట్ బంధన్ తో దోస్తీ.!

Bihar political crisis nitish kumar quits nda joins grand alliance

BJP, JD(U) alliance, Nitish Kumar, Bihar political crisis, Nitish Kumar, Nitish Kumar news, Nitish Kumar quits NDA, grand alliance, Bihar Politics

Bihar CM Nitish Kumar broke the alliance between his party, the Janata Dal (United), and the BJP, alleging ‘conspiracy’ by the BJP to break the JD(U) and resigned as CM. He reached out to the Rashtriya Janata Dal (RJD) and other Opposition parties, including the Congress, which have agreed to support him. Nitish and Tejashwi Yadav will take oath as Bihar chief minister and deputy CM, respectively, at 2 pm on Wednesday, officials said.

బీహార్ లో బీజేపికి షాకిచ్చిన నితీశ్.. మహాఘట్ బంధన్ తో దోస్తీ.!

Posted: 08/09/2022 05:28 PM IST
Bihar political crisis nitish kumar quits nda joins grand alliance

బీహార్ లోనూ తమ ప్రభుత్వమే ఉందని ఇన్నాళ్లు చెప్పుకున్న బీజేపి.. ఇక తాజాగా తమ మైత్రి ప్రభుత్వంతో ఒక పొసగడం ఇష్టం లేక.. జేడీయు పార్టీలోనూ చక్రం తిప్పాలని భావించింది. అందుకు గాను జేడీయూ నుంచి బయటకు వచ్చిన నేత ఆర్సీపీ సింగ్‌ను అడ్డుపెట్టుకొని జేడీయూలో సంక్షోభం సృష్టించాలనుకొన్న బీజేపీ ఆశలు గల్లంతయ్యాయి. నితీశ్‌ వేగంగా మేలుకొని వ్యూహాత్మకంగా కదిలి తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలిగారు. నితీశ్ చేసిన చర్యలతో బీజేపి మైండ్ బ్లాక్ అయ్యింది. నితీశ్‌ అనుభవంతో పావులు కదిపి విపక్షాల ప్రశంసలను అందుకున్నారు. దేశ రాజకీయాల్లో మార్పునకు ఇది సంకేతమని కొనియాడాయి.

జేడీయుతో దశాబ్దకాలానికి పైగా కోనసాగుతున్న మైత్రిని కాదని పార్టీ నుంచి బయటకు వచ్చిన నేతతో మిత్రపక్షాన్ని కూడా వంచించి.. తాను బలపడాలని తపిస్తున్న బీజేపికి నితీశ్ కుమార్ కోలుకోలేని షాక్ ఇచ్చారు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దుచేసి కాషాయ పార్టీని అధికారానికి దూరం చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో కలసి మరోమారు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. రాష్ట్రంలో మళ్లీ మహాఘట్ బంధన్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆయన చర్యలు చేపట్టారు. ప్రస్తుతం బీహార్‌లో ఎన్డీఏ కూట‌మి బలాబలాలు ఇలా ఉన్నాయి. బీజేపీ(77)-జేడీయూ(45) కూట‌మి పాల‌న బీహార్‌లో ముగిసిపోయింది.

బీజేపీతో తెగ‌దెంపులు చేసుకున్న‌ట్లు జేడీ(యు)నేత నితీశ్ త‌మ ఎమ్మెల్యేల‌కు చెప్పారు. ఇక ఇవాళ సాయంత్రం సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌సి రాష్ట్రంలోని పరిస్థితులను విన్నవించనున్నారు. అయితే ఆర్జేడీ, కాంగ్రెస్‌తో క‌లిసి నితీశ్ కుమార్‌.. కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే అవ‌కాశాలు ఉన్నాయి. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగానే కొన‌సాగ‌నున్నారు. బుధవారం రోజున మహా ఘట్ బంధన్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఆయన ఎనమిదవ పర్యాయం ప్రమాణస్వీకారం చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని ఊహాగానాల ప్ర‌కారం ఆర్జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్‌కు హోంశాఖ ఇవ్వ‌నున్నారు. నితీశ్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెఫ్ట్ పార్టీలు మ‌ద్ద‌తు తెలిపిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles