Kerala CM helped UAE terrorist to escape: Swapna Suresh కేరళ సీఎం ఉగ్రవాదికి సహకరించారని స్వప్ప సురేష్ సంచలన ఆరోపణలు..!

Kerala cm supports every illegal terrorist activity for the sake of his daughter s interests swapna suresh

gold smuggling case, Kerala CM pinarayi vijayan, kerala gold smuggling case, Pinarayi Vijayan, gold smuggling case, Swapna Suresh, suspected terrorist, Egypt born UAE national, CISF personnel, Cochin airport, Thuraya satellite phone, Kerala, Crime

Swapna Suresh, the prime accused in the alleged gold smuggling case, alleged that Kerala Chief Minister Pinarayi Vijayan helped the UAE consulate in facilitating the escape of a terrorist. Suresh alleged that she was asked by the UAE Consulate to talk to the Chief Minister to facilitate the travel of a UAE national, who was allegedly caught with a Thuraya satellite phone, which is banned in India.

కేరళ సీఎంపై స్వప్ప సురేష్ సంచలన ఆరోపణలు..! ఉగ్రవాదికి సహకరించారంటూ..

Posted: 08/09/2022 01:31 PM IST
Kerala cm supports every illegal terrorist activity for the sake of his daughter s interests swapna suresh

కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుటుంబసభ్యుల ప్రమేయం కూడా ఉందని ఈ కేసులో కీలక నిందితురాలైన స్వప్నా సురేష్ గత కొన్నాళ్లుగా అరోపిస్తున్న విషయం తెలిసిందే‌. నేరుగా సీఎంను ఆయన కుటుంబసభ్యులను టార్గెట్ చేసి.. అరోపణలు సంధిస్తోన్న ఈమె.. తాను కేసులోంచి బయటపడేందుకు గతకొన్నాళ్లుగా అరోపణలు సంధిస్తున్నారన్న వార్తలు కూడా వినిపించాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెరపైకి వచ్చిన ఈ కేసుతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రతిష్టను భంగపర్చి ఆయనకు అధికారాన్ని దూరం చేయాలని భావిస్తోందన్న విమర్శలు వచ్చాయి.

అయితే అదే అతనికి కలసివచ్చింది. ఈ అరోపణలను పట్టించుకోని కేరళ ప్రజలు విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మరోమారు అధికారాన్ని అందించారు. కాగావిజయన్ ను మళ్లీ టార్గెట్ చేసిన కేరళ స్మగ్లింగ్ కేసు ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ మళ్లీ సంచలన ఆరోపణలు చేశారు. 2017లో అనుమానాస్పద ఉగ్రవాదిగా పట్టుబడిన వ్యక్తిని.. తన కూతరు అక్రమ వ్యాపారాల బయటపడకుండా చేసేందుకు తప్పించుకునేలా సహాయం అందించారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఈజిప్టులో జన్మించిన యూఏఈ జాతీయుడు.. భారత్ కు వచ్చిన సందర్బంగా అతడ్ని కొచ్చిన్ విమానాశ్రయంలో సీఐఎస్ఎప్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు.

దేశంలో నిషేధించిన తురయా శాటిలైట్‌ ఫోన్‌తో ఆయన రావడమే అందుకు కారణమన్నారు. అయితే అతడ్ని పట్టుబడనీయకుండా తప్పించేందుకు విజయన్‌ సహకరించారని ఆరోపించింది. స్వప్నా సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈజిప్ట్‌లో జన్మనించిన యూఏఈ జాతీయుడు జూన్ 30న కేరళకు చేరుకోగా, జూలై 4న సీఐఎస్‌ఎఫ్ అరెస్టు చేసింది. యూఏఈ కాన్సులేట్‌ అధికారుల నుంచి తనకు కాల్‌ వచ్చిందని, ఈ విషయంలో సీఎంతో మాట్లాడాలని కోరినట్లు తెలిపింది. తాను సీఎం కార్యదర్శి శివశంకర్‌రెడ్డితో మాట్లాడి మొత్తం విషయాన్ని చెప్పానని, ఆయన విజయన్‌తో మాట్లాడతానని చెప్పారన్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తిని పోలీసులు విడుదల చేశారని.. మళ్లీ ఈ విషయంలో విచారణ జరుగలేదని స్వప్నా ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles